Airtel Offers: ఒక్కసారి ఇంటర్నెట్ లేని రోజును ఊహించుకోండి, ఫోన్ నుంచి మెసేజ్ పంపడం, యూ ట్యూబ్ చూడటం, ఆన్‌లైన్ క్లాస్, ఆఫీస్ మీటింగ్ ఏమిచేయాలన్నా ఇంటర్నెట్ లేకుండా పని జరగదు. అలా ఇంటర్నెట్‌కు అందరూ అలవాటు పడిపోయాము. నిజానికి మన జీవితంలోని ప్రతి చిన్న పని కూడా ఇప్పుడు ఇంటర్నెట్ లేకుండా కుదరడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మంచి స్పీడ్‌తో, ఎలాంటి డేటా టెన్షన్ లేకుండా ఇంటర్నెట్ దొరికితే ఎలా ఉంటుంది? కానీ ఎలా? ఏ రీచార్జ్ చేసిన దానికి పరిమిత డేటా ఉంటుంది కదా బాసూ అంటారా? అందుకే ఇప్పుడు ఎలాంటి పరిమితి లేకుండా అన్ లిమిటెడ్ వైఫై గురించి చెప్పబోతున్నా, ఇప్పుడు అలాంటి ఆఫర్‌ని తెచ్చింది ఎయిర్టెల్ ఎక్స్ స్ట్రీమ్ ఫైబర్. కేవలం రూ.499కే అన్‌లిమిటెడ్ వైఫై డేటా అందిస్తోంది. అంటే ఇంట్లో ఉన్న అందరూ ఒకేసారి ల్యాప్‌టాప్‌లో, మొబైల్‌లో, టీవీలో కనెక్ట్ అయ్యి నిరభ్యంతరంగా వాడుకోవచ్చు.
15శాతం వరకు సేవింగ్
ఈ రోజుల్లో ఆన్‌లైన్ ఎడ్యుకేషన్‌కి, వర్క్ ఫ్రమ్ హోమ్‌కి, ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లకి, గేమింగ్‌కి ప్రతిదానికీ హై స్పీడ్ వైఫై తప్పనిసరి. దీంతో మొబైల్ డేటా త్వరగా అయిపోతుంది, స్పీడ్ తగ్గిపోతుంది. కానీ ఇక్కడ మాత్రం అన్‌లిమిటెడ్ అని చెప్పడం వల్ల మనకు టెన్షన్ ఉండదు. అందులోనూ 6 నెలల ప్లాన్‌కి వెళితే కేవలం రూ.2000 వరకు డిస్కౌంట్ వస్తుంది. అంటే ఒక్కో నెలలో ఖర్చు ఇంకా తక్కువ అవుతుంది. అలాగే మొత్తం బిల్లుపై 15శాతం వరకు సేవింగ్ కూడా ఉంటుంది.
Also Read: BRS Politics: కవిత మేటర్ కేసీఆర్ చేతుల్లో..మళ్లీ అదే ఫార్ములా
వీడియో డౌన్‌లోడ్ అయినా స్పీడ్ తగ్గదు
ఇంట్లో ఉన్నవాళ్లకు ఒక్కరికి ఆఫీస్ మీటింగ్ ఉంటే, ఇంకొకరికి ఆన్‌లైన్ క్లాస్, ఇంకొకరికి మూవీ లేదా వెబ్ సిరీస్ చూడాలి. అందరూ ఒకేసారి కనెక్ట్ అయినా కూడా లోడింగ్ అవుతూ ఆగిపోవడం అలాంటి సమస్య లేకుండా సూపర్ స్పీడ్ అందించడమే ఈ ఎయిర్టెల్ ఎక్స్ స్ట్రీమ్ ఫైబర్ ప్రత్యేకత. ఇంకా చెప్పాలంటే ఈ ఫైబర్ టెక్నాలజీ వల్ల ఆన్‌లైన్ గేమింగ్ ఏదైనా సరే ఎక్కువ సమయం పట్టదు. మ్యూజిక్, సినిమాలు, వీడియో కాల్స్ అన్నీ ఎలాంటి ఆటంకం లేకుండా జరుగుతాయి. ముఖ్యంగా ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ ఎక్కువ మంది వాడుతున్న సమయంలో, ఇంట్లోనే స్మార్ట్ టీవీ, మొబైల్ అన్నీ ఆటోమెటిక్‌గా కనెక్ట్ అయినా పనులకు మాత్రం ఆటంకం ఉండదు.
గంటల కొద్దీ వాడుకోవచ్చు
కేవలం రూ.499లో ఈ ఆఫర్ రావడం వల్ల చాలా కుటుంబాలకు ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ అని చెప్పొచ్చు. సిటీ అయినా, టౌన్ అయినా ఎయిర్‌టెల్ ఇప్పటికే చాలా ప్రాంతాల్లో సర్వీస్ అందిస్తోంది. కనుక కనెక్షన్ పొందడం కూడా చాలా సులభమే. ఈ ఆఫర్ చేసుకోవడం వలన ఒకేసారి అన్‌లిమిటెడ్ డేటా, హై స్పీడ్ కనెక్షన్, 6 నెలలకే భారీ తగ్గింపు, 15శాతం వరకు అదనపు సేవింగ్ ఇవన్నీ కలిపి ఎయిర్టెల్ ఎక్స్ స్ట్రీమ్ ఫైబర్‌ను నిజంగా ఆకర్షణీయమైన ఆఫర్‌గా నిలిపాయి. కాబట్టి మీ ఇంట్లో ఇంకా హై స్పీడ్ వైఫై కనెక్షన్ లేకపోతే, ఒకసారి ఈ ఆఫర్‌ని పరిశీలించండి. రోజూ డేటా అయిపోతుంది అనే టెన్షన్ లేకుండా గంటల కొద్దీ ఆన్‌లైన్ క్లాసులు, ఆఫీస్ మీటింగ్స్, సినిమాలు, గేమ్స్ అన్నీ ఇష్టం వచ్చినంత వరకు వాడుకోవచ్చు.