Akshaya Tritiya 2025: అక్షయ తృతీయ హిందూ సాంప్రదాయంలో అత్యంత శుభప్రదమైన రోజుగా పరిగణిస్తారు. ఆరోజున బంగారం, వెండి వంటి విలువైన వస్తువులను.. కొనుగోలు చేయడం శాశ్వత సంపదను తెస్తుందని నమ్ముతుంటారు. మరి ఈ ఏడాది అక్షయ తృతీయ ఎప్పుడు వచ్చింది..? బంగారం ధరలు తగ్గే అవకాశాలు ఉన్నాయా..? నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
అక్షయ తృతీయ 2025 తేదీ:
అక్షయ తృతీయ వైశాఖ మాసంలోని.. శుక్ల పక్ష తృతీయ తిథి రోజు జరుపుకుంటారు. ఈ ఏడాదిలో అక్షయ తృతీయ ఏప్రిల్ 30న వచ్చింది. ఆ రోజు లక్ష్మీదేవి ఆశీస్సుల కోసం బంగారం, ఆస్తులు, ఇతర పెట్టుబడులను కొనుగోలు చేయడానికి అనువైన సమయంగా భావిస్తుంటారు.
అక్షయ తృతీయ ప్రాముఖ్యత
‘అక్షయ’ అనేది సంస్కృత పదం ‘ఎన్నటికీ క్షీణించనిది’ అని అర్థం. అక్షయ తృతీయ రోజు చేసే కొనుగోళ్లు, శుభ కార్యాలు శాశ్వత ఫలితాలను ఇస్తాయని ప్రజల నమ్మకం. ఆ రోజు బంగారం కొనుగోలు చేస్తే ఆర్థిక స్థిరత్వానికి, సంపద వృద్ధికి దోహదపడుతుందని చాలా మంది నమ్మకం. మన దేశంలో ముఖ్యంగా అక్షయ తృతీయ రోజు బంగారం డిమాండ్ గణనీయంగా పెరుగుతుంది.
ప్రస్తుతం బంగారం ధరల ఎలా ఉన్నాయంటే..
గతేడాది చివరి నుంచి బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఇక ఇటీవల బంగారం ధర రూ.1 లక్ష మార్కును దాటేసింది. అయితే గత రెండు రోజుల నుంచి తగ్గుముఖంపట్టింది. ప్రస్తుతం 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.90,050 ఉంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.98,240 వద్ద కొనసాగుతోంది.
ఈ ధరల పెరుగుదలకు కొన్ని కారణాలు:
అంతర్జాతీయ అస్థిరతలు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు, అమెరికా-చైనా వాణిజ్య ఉద్రిక్తతలు బంగారం డిమాండ్‌ను పెంచాయి. అంతేకాదు అమెరికా డాలర్ వాల్యూ తగ్గడంతో.. పెట్టుబడిదారులు బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గిస్తే, బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది.
అక్షయ తృతీయ రోజున బంగారం ధరలు తగ్గే అవకాశం ఉందా?
అక్షయ తృతీయ రోజున బంగారం ధరలు తగ్గే అవకాశాలు పరిమితంగా ఉన్నాయి. కొన్ని అంశాలు ధరలను ప్రభావితం చేయవచ్చు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బంగారు ఆభరణాల దిగుమతులపై.. సుంకాలు విధించడం వల్ల ధరలు తాత్కాలికంగా తగ్గాయి. ఇలాంటి విధానాలు మళ్లీ అమలైతే స్వల్ప తగ్గుదల ఉండే అవకాశం ఉంది. 2025లో కమోడిటీ ధరలు 5.1% తగ్గవచ్చని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. ఇది బంగారం ధరలపై స్వల్ప ప్రభావం చూపవచ్చు. అక్షయ తృతీయ సంధర్బంగా భారతదేశంలో.. బంగారం డిమాండ్ పెరగడం వల్ల ధరలు స్థిరంగా ఉండవచ్చు లేదా స్వల్పంగా పెరగవచ్చు.
నిపుణుల అభిప్రాయాలు
కమోడిటీ ట్రేడింగ్ సంస్థలు: “అక్షయ తృతీయ సమయంలో ఇండియాలో బంగారం డిమాండ్ గణనీయంగా పెరుగుతుంది. అయితే, ట్రంప్ సుంకాలు, డాలర్ బలహీనత ధరలను స్వల్పంగా తగ్గించవచ్చని చెబుతున్నారు.
ప్రపంచ బ్యాంక్ నివేదిక: “2025లో ధరలు స్వల్పంగా తగ్గవచ్చు. కానీ బంగారం సేఫ్-హెవెన్ ఆస్తిగా డిమాండ్ కొనసాగుతుంది.”
Also Read: భారత్ మొదటి దెబ్బ.. కుప్పకూలిన పాక్ స్టాక్ మార్కెట్
బంగారం కొనుగోలు చేసేటప్పుడు కొన్ని సలహాలు..
స్వచ్ఛత తనిఖీ: 22K లేదా 24K బంగారం కొనుగోలు చేసేటప్పుడు BIS హాల్‌మార్క్ సర్టిఫికేట్ తప్పనిసరిగా తీసుకోండి.
ప్రసిద్ధ జ్యూయలరీ షాప్‌లు*: నమ్మకమైన షాప్‌ల నుండి కొనుగోలు చేయండి..
బడ్జెట్ ప్లానింగ్: మీ ఆర్థిక సామర్థ్యానికి తగినట్లు కొనుగోలు చేయండి. తద్వారా ఆర్థిక ఒత్తిడి రాదు.