6 Insurance Mistakes: ప్రతి ఒక్కరి ఆర్థిక ప్రణాళికలో జీవిత బీమా అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఆకస్మాత్తుగా ఏదైనా ప్రమాదం జరిగినా లేదా అనుకోని కారణాల వల్ల ఇంటి యజమాని మరణించినా కూడా బీమా తీసుకున్న వారి కుటుంబానికి ఆర్థిక భరోసా లభిస్తుంది. అయితే అనేక మంది ఈ పథకాలను తీసుకునే సమయంలో సాధారణ తప్పులు చేస్తుంటారు. ఈ తప్పులను నివారించడం ద్వారా మీరు బీమా ప్రయోజనాలను పెంచుకోవచ్చు.
కొన్నిసార్లు మీరు జీవిత బీమా గురించి ఆలోచించడంలో చాలా ఆలస్యం చేస్తారు. మంచి ప్లాన్ కోసం వెతుకుతూ తీసుకోవడం ఆలస్యం చేస్తారు. మీరు ఆలస్యం చేస్తున్న క్రమంలో మీకు ఏదైనా జరిగితే మీ ప్యామిలీ ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు త్వరగా నిర్ణయం తీసుకోకపోవడం వల్ల మీ కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించవచ్చు. ఈ క్రమంలో మీరు సంపాదించడం ప్రారంభించిన వెంటనే జీవిత బీమా తీసుకోవడం చాలా మంచిది.
బీమా పాలసీ తీసుకునే క్రమంలో మీరు అందించే సమాచారం ఆధారంగానే మీ ప్రీమియం నిర్ణయించబడుతుంది. కాబట్టి మీరు మీ వయస్సు, వృత్తి, కుటుంబ చరిత్ర, ఆరోగ్య పరిస్థితుల గురించి మాత్రం ఎలాంటి తప్పులు చెప్పకూడదు. ఒక వేళ మీరు మీ ఆరోగ్యం విషయంలో వ్యాధులు ఉన్నా కూడా లేవని చెబితే, తర్వాత తప్పుడు సమాచారం ఇచ్చారని భవిష్యత్తులో క్లెయిమ్‌లు తిరస్కరించబడవచ్చు.
అనేక మంది ఉద్యోగులు చేస్తున్న వాటిలో ఇది కూడా ఉంటుంది. కంపెనీ బీమా పాలసీ ఇస్తుందని, టర్మ్ లేదా కుంటుంబ పాలసీ తీసుకోవడంలో నిర్లక్ష్యం చేస్తారు. ఇలా చేయడం ద్వారా కూడా ఉద్యోగం కోల్పోవడం లేదా కెరీర్ విరామం తీసుకున్న క్రమంలో ఏదైనా ప్రమాదాలు జరిగితే ఆర్థిక ఇబ్బందులు వచ్చే ఛాన్స్ ఎక్కువ. కాబట్టి కేవలం కంపెనీ పాలసీపై మాత్రమే ఆధారపడటం తగ్గించండి.
Read Also: Bluetooth Earphones: రూ. 699కే బ్లూటూత్ హెడ్‌ఫోన్స్.. ఏడాది వారంటీతోపాటు
బీమా ప్రొవైడర్ మీకు కవర్ చేయాలని కోరుకునే మొత్తం హామీ ఆధారంగా ప్రీమియం నిర్ణయించబడుతుంది. మీ ఖర్చులు, భవిష్యత్తులో తలెత్తే బాధ్యతలను లెక్కించి, తగినంత బీమా మొత్తాన్ని ఎంచుకోవడం మంచిది. సాధారణంగా మీ వార్షిక జీతం కంటే 15 నుంచి 20 రెట్ల ఎక్కువ బీమా మొత్తాన్ని తీసుకోవాలి.
స్వల్పకాలిక ప్రణాళికలు తీసుకోవడం కూడా తప్పని చెప్పవచ్చు. మీరు 25 సంవత్సరాల కంటే తక్కువ వయస్సులో ఉన్నప్పుడు ఒక పథకాన్ని తీసుకుంటే, 50 ఏళ్ల తర్వాత కొత్త టర్మ్ ప్లాన్ ప్రారంభించాల్సి వస్తుంది. ఆ సమయంలో అది మరింత ఖరీదైనదిగా మారుతుంది. కాబట్టి ముందే దీర్ఘకాలిక ప్రణాళికను ముందే ఎంచుకోవడం ద్వారా మీరు ఆరోగ్య సంబంధిత సవాళ్లను ఎదుర్కొనకుండా ఉంటారు.
మీరు ఏజెంట్ ద్వారా బీమా పథకాన్ని పొందాలని పట్టుబట్టే వారిలో ఒకరైతే, ఆన్‌లైన్‌లో బీమా కొనుగోలు చేసే అవకాశాన్ని కోల్పోతారు. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో బీమా కొనుగోలు చేయడం ద్వారా తక్కువ ధరకు లభిస్తుంది. ఈ క్రమంలోనే అనేక కంపెనీలు ఆన్‌లైన్‌లో పలు రకాల ప్లాన్‌లను కొనుగోలు చేయడంపై డిస్కౌంట్లను అందిస్తున్నాయి.