BigTV English

Sivakarthikeyan : క్రేజీ డైరెక్టర్ ను లైన్లో పెట్టిన శివకార్తీకేయన్… ‘అమరన్’ను మించే ప్లాన్

Sivakarthikeyan : క్రేజీ డైరెక్టర్ ను లైన్లో పెట్టిన శివకార్తీకేయన్… ‘అమరన్’ను మించే ప్లాన్

Sivakarthikeyan : గత ఏడాది ‘అమరన్’ (Amaran) మూవీతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న హీరో శివ కార్తికేయన్ (Sivakarthikeyan). ఈ మూవీ ఇచ్చిన హిట్టుతో జోష్ మీదున్నాడు ఈ హీరో. ప్రస్తుతం ఈ తమిళ స్టార్ వరస ప్రాజెక్టుతో బిజీ బిజీగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆయన లైన్లో మరి క్రేజీ ప్రాజెక్ట్ చేరిందనే వార్త వినిపిస్తోంది. ‘2018’ ఫేమ్ డైరెక్టర్ జూడ్ ఆంథనీ జోసెఫ్ (Jude Anthany Joseph) తో కలిసి శివ కార్తికేయన్ కొత్త ప్రాజెక్ట్ చేయబోతున్నాడనే వార్తలు కోలీవుడ్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


‘2018’ డైరెక్టర్ తో శివ కార్తికేయన్

తాజా సమాచారం ప్రకారం ‘అమరన్’ స్టార్ మరో కొత్త ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. గతంలో ‘2018’ లాంటి బ్లాక్ బస్టర్ మూవీకి దర్శకత్వం వహించిన ప్రముఖ మలయాళ డైరెక్టర్ జూడ్ ఆంథని జోసెఫ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నట్టు తెలుస్తోంది. అలాగే ఈ సినిమాలో శివ కార్తికేయన్ ను ఢీకొట్టే విలన్ గా ప్రముఖ తమిళ హీరో ఆర్య నటించబోతున్నట్టు సమాచారం. ఈ మూవీని ఏజిఎస్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నారు అనే టాక్ నడుస్తోంది. ఇది శివ కార్తికేయన్ కెరీర్ లోనే అతిపెద్ద ప్రాజెక్టు కాబోతోందని అంటున్నారు. ఇప్పటికైతే ఇవన్నీ కేవలం పుకార్లు మాత్రమే. దీని గురించి ఇంకా అఫీషియల్ గా ఎలాంటి అనౌన్స్మెంట్ రాలేదు.


అల్లు అర్జున్ సినిమాలో శివ కార్తికేయన్ ?

మరో ఇంట్రెస్టింగ్ వార్త ఏమిటంటే అల్లు అర్జున్ – అట్లీ కాంబినేషన్లో రాబోతున్న సినిమాలో శివ కార్తికేయన్ ఓ కీలకపాత్ర పోషించబోతున్నట్టు తెలుస్తోంది. పీరియాడికల్ డ్రామాగా రూపొందుతున్న ఈ ప్రాజెక్టులో ఒక హీరోగా అల్లు అర్జున్ నటిస్తుండగా, రెండో హీరో కోసం నిర్మాతలు వెట మొదలు పెట్టారనే రూమర్లు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నిర్మాతలు ఈ సినిమాలో రెండవ హీరో కోసం శివ కార్తికేయన్ ను సెలెక్ట్ చేసుకున్నారని టాక్ నడుస్తోంది.

మరోవైపు శివ కార్తికేయన్ లేడీ డైరెక్టర్ సుధా కొంగర దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ మూవీ ‘పరాశక్తి’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ దశలో ఉండగా, కొన్నాళ్ళ క్రితమే రిలీజ్ చేసిన ‘పరాశక్తి’ గ్లిమ్స్ మూవీపై ఆసక్తిని పెంచేసిన సంగతి తెలిసిందే. ఇందులో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. ‘పరాశక్తి’ మూవీ పూర్తయిన తర్వాతే శివ కార్తికేయన్ మరో ప్రాజెక్టుపై దృష్టి పెట్టే అవకాశం ఉంది. అయితే అల్లు అర్జున్ సినిమాలో సెకండ్ హీరోగా శివ కార్తికేయన్ నటించబోతున్నాడు అన్న రూమర్ మూవీ లవర్స్ లో మరింత ఉత్సాహాన్ని పెంచింది. ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందన్నది ఇంకా తెలియరాలేదు. కానీ ప్రస్తుతం సుధా కొంగర తీస్తున్న ‘పరాశక్తి’ మూవీ నుంచి ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘మదరాశి’ వరకు డిఫరెంట్ జానర్ సినిమాలతో తన అభిమానులను అలరించడానికి శివ కార్తికేయన్ సిద్ధమవుతున్నాడు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×