E-Paper
Advertisement

అటల్ పెన్షన్ స్కీమ్.. రూ.577 కడితే జీవితాంతం రూ.5,000 పెన్షన్.. నామినీకి రూ.8.5 లక్షలు!

అటల్ పెన్షన్ స్కీమ్.. రూ.577 కడితే జీవితాంతం రూ.5,000 పెన్షన్.. నామినీకి రూ.8.5 లక్షలు!
Advertisement

Atal Pension Yojana: పదవి విరమణ తర్వాత డబ్బు సంపాదన ఒక్కసారిగా ఆగిపోతుంది. కాబట్టి ప్రతీ ఒక్కరూ ముందుగానే ఆర్థిక ప్రణాళిక వేసుకోవడం తప్పనిసరని నిపుణులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘అటల్ పెన్షన్ యోజన’ (APY) పథకాన్ని సూచిస్తున్నారు. ఈ స్కీమ్ లో పెట్టుబడి పెడితే 60 ఏళ్లు నిండిన తర్వాత నెలకు రూ.1,000 నుంచి రూ.5,000 వరకు పిన్షన్ లభించనుంది. రిటైర్మెంట్ తర్వాత నెలకు రూ.5,000 పెన్షన్ పొందాలనుకుంటే ఎంత మొత్తం జమ చేయాల్సి ఉంటుందో ఇప్పుడు చూద్దాం.

ఎవరు అర్హులు? నిబంధనలు ఏంటి?

18 నుంచి 40 ఏళ్ల మధ్య వయసున్న భారత పౌరులు ఎవరైనా ఈ పథకంలో చేరవచ్చు. ఇందుకోసం బ్యాంకు లేదా పోస్టాఫీసులో సేవింగ్స్ ఖాతాను ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఆఫ్ లైన్ తో పాటు ఆన్ లైన్ లో ఖాతాను తెరిచే వెసులుబాటును కొన్ని బ్యాంకులు కల్పిస్తున్నాయి. అయితే ఆదాయపు పన్ను చెల్లించే వారు అటల్ పెన్షన్ యోజన ఖాతా తెరవడానికి అనర్హులు.

30 ఏళ్ల వయసులో ఎంత పెట్టుబడి పెట్టాలి?

Advertisement

30 ఏళ్ల వయసులో ఉండి 60 ఏళ్ల తర్వాత నెలకు రూ.5,000 పెన్షన్ అందుకోవాలనుకుంటే రాబోయే 30 ఏళ్ల పాటు క్రమం తప్పకుండా డబ్బు జమ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం వాయిదాలను ప్రతీ నెల, 3 నెలలు, 6 నెలలు, ఏడాది పద్ధతిలో చెల్లించే వెసులుబాటు ఈ పథకంలో ఉంది. దీని ప్రకారం 30 ఏళ్ల వయసులో అటల్ పెన్షన్ యోజనలో చేరి ప్రతి నెలా రూ.577 చొప్పున 30 ఏళ్ల పాటు (రూ.2,07,720) జమ చేస్తే.. 60 ఏళ్లు దాటిన తర్వాత ప్రతి నెలా రూ.5,000 పెన్షన్ అందనుంది.

Also Read: ప్యాకేజ్డ్ ఫుడ్‌పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. ఇకపై ఆ గుర్తు ఉండాల్సిందే!

మరణిస్తే పెన్షన్ ఎవరికి దక్కుతుంది?

Advertisement

ఈ స్కీమ్ కింద పెన్షన్ తీసుకుంటున్న వ్యక్తి మరణిస్తే అదే పెన్షన్ మొత్తాన్ని వారి జీవిత భాగస్వామి (Spouse)కి ప్రతీ నెలా అందిస్తారు. ఖాతాదారుడు, వారి జీవిత భాగస్వామి ఇద్దరూ మరణించిన తర్వాత.. జమ అయిన పెన్షన్ కార్పస్ మొత్తాన్ని నామినీకి అందజేస్తారు. నెలకు రూ.5,000 పెన్షన్ ఆప్షన్ ఎంచుకున్న వారి నామినీకి రూ.8.5 లక్షలు లభించనున్నాయి.

Also Read: ఆయనకు 75, ఆమెకు 63.. వృద్ధాశ్రమంలో చిగురించిన ప్రేమ.. హిమాచల్‌లో వింత పెళ్లి!

Tags

Related News

20 సంవత్సరాలలో 2 కోట్లు సంపాదించాలంటే ప్రతి నెలా ఎంత SIP చేయాలి ?

ఇకపై మార్కెట్లోకి ప్రయోగశాలలో పెంచిన బంగారం… ల్యాబ్ గ్రోన్ గోల్డ్ అంటే ఏమిటి ?

స్టూడెంట్స్ నుంచి సీనియర్ సిటిజన్ల వరకు.. అందరికీ ఉపయోగపడే ప్రభుత్వ స్కీమ్స్ ఇవే!

రూ. 30 వేలు ఆదాయం.. కష్టపడకుండా ప్రతీ నెలా, ఇంతకీ ఏం చెయ్యాలో తెలుసా?

ప్రతి నెలా ఆన్‌లైన్ షాపింగ్ కోసం ఎంత వరకూ చేయొచ్చు? డబ్బు ఆదా చేసే సూపర్ ఫార్ములా ఇదే!

బంగారంపై లోన్ తీసుకుంటున్నారా? బ్యాంకు వాళ్లను ఈ 5 ప్రశ్నలు కచ్చితంగా అడగండి!

డిసెంబర్ ఒకటి నుంచి కొత్త రూల్స్.. క్రెడిట్ కార్డు మొదలు ఆధార్ వరకు, ఇంకా ఏంటంటే..

Big Stories

Advertisement
×