Bad Food For Kidney: కిడ్నీలు మన మన శరీరంలో చాలా ముఖ్యమైన భాగం. గుండెలాగే, మూత్రపిండాల పనితీరుపై ఎలాంటి ప్రభావం పడినా కూడా ఇది తీవవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది.మన చిన్న చెడు అలవాట్లు మూత్రపిండాల పనితీరును ప్రభావితం చేస్తాయి. ఇది భవిష్యత్తులో పెద్ద సమస్యగా మారుతుంది. అంతే కాకుండా మూత్రపిండాలు రక్తాన్ని ఫిల్టర్ చేయడానికి శరీరం నుండి విష పదార్థాలను తొలగించడానికి పని చేస్తాయి.
వయసు పెరుగుతున్నా కూడా మీ మూత్రపిండాల పనితీరు మెరుగ్గా ఉండాలంటే కొన్ని అలవాట్లను మార్చుకోండి. ఈ 6 చెడు అలవాట్లు మీకు తీవ్రమైన కిడ్నీ వ్యాధులను కలిగిస్తాయి.
కిడ్నీలకు హానికరమైన 6 చెడు అలవాట్లు:
తక్కువ నీరు త్రాగడం: మూత్రపిండాలకు నీరు చాలా ముఖ్యమైనది. ఇది విష పదార్థాలను తొలగించడానికి మూత్రపిండాలకు సహాయపడుతుంది. తక్కువ నీరు తాగడం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడటంతో పాటు ఇతర సమస్యలు వస్తాయి.
అధిక ఉప్పు తీసుకోవడం: ఎక్కువ ఉప్పు తినడం వల్ల రక్తపోటు పెరుగుతుంది. ఇది మూత్రపిండాలకు చాలా హానికరం. ఆహారంలో ఉప్పు తీసుకోవడం తగ్గించడం వల్ల కిడ్నీ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు.
ప్రాసెస్ చేసిన ఆహారం తీసుకోవడం: ప్రాసెస్ చేసిన ఆహారంలో అధిక మొత్తంలో ఉప్పు, చక్కెరతో పాటు ఇతర హానికరమైన అంశాలు ఉంటాయి. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీలు దెబ్బతింటాయి.
మందులు ఎక్కువగా వాడటం: కొన్ని మందులు మూత్రపిండాలకు హాని కలిగిస్తాయి. కాబట్టి వైద్యుల సలహా లేకుండా ఎలాంటి మందులూ తీసుకోకూడదు.
ఆల్కహాల్ తీసుకోవడం: ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కిడ్నీలు దెబ్బతింటాయి. అంతే కాకుండా కిడ్నీ వ్యాధుల ముప్పు కూడా పెరుగుతుంది.
ఊబకాయం: ఊబకాయం కిడ్నీ వ్యాధులతో సహా అనేక వ్యాధులకు కారణమవుతుంది. ఊబకాయం రక్తపోటు, మధుమేహం పెరుగుతుంది. ఇది మూత్రపిండాలకు హానికరం.
Also Read: ప్రతి రోజు ఉదయాన్నే ఈ డ్రింక్స్ త్రాగితే.. శరీరంలోని కొవ్వు కరిపోతుంది తెలుసా ?
మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుకోవడం ఎలా ?
తగినంత నీరు త్రాగాలి.
ఉప్పు తీసుకోవడం తగ్గించండి.
తాజా పండ్లు , కూరగాయలు తినండి.
క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి.
మీ బరువును అదుపులో ఉంచుకోండి.
వైద్యుని సలహా లేకుండా ఎలాంటి మందులు తీసుకోవద్దు.
మద్యం సేవించవద్దు.
గమనిక: ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసమే. పలు పరిశోధనలు.. అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించదని గమనించగలరు.