Harshavardhan Rameshwar: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. దానిలో సందేహం లేదు. కానీ సినిమా దిశా దశ మార్చే సినిమాలు అతి తక్కువగా వస్తుంటాయి. అటువంటి సినిమాల ప్రస్తావన వస్తే మొదటిగా మాట్లాడవలసింది రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన శివ సినిమా. అప్పటివరకు ఒక మూసలో వెళుతున్న తెలుగు సినిమాలను పరుగులు పెట్టించాడు రామ్ గోపాల్ వర్మ. తాను విజయవాడలో చదువుకుంటున్నప్పుడు చూసిన కొన్ని ఇన్సిడెంట్స్ ను, అలానే తాను చూసిన కొన్ని ఇంగ్లీష్ సినిమాలను ఇన్స్పిరేషన్ గా తీసుకొని శివ కథను రెడీ చేసి తెలుగు ప్రేక్షకులకు సర్ప్రైజింగ్ ఎక్స్పీరియన్స్ ను అందించాడు. శివ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. శివ సినిమా చూసిన తర్వాత చాలామంది దర్శకులు కావాలనుకున్న వాళ్ళు అప్పటికే రాసుకున్న కథలను కూడా చింపేసారు.
రథన్ తో కాంట్రవర్సీ
శివ సినిమా తర్వాత ఆ స్థాయిలో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఇంపాక్ట్ చూపించిన సినిమా అర్జున్ రెడ్డి. ఈ సినిమాతో సందీప్ రెడ్డి వంగ దర్శకుడుగా పరిచయమయ్యాడు. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ రేంజ్ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాను దర్శకత్వం వహించిన మూడవ సినిమాతోనే దాదాపు 1000 కోట్లకు పైగా వసూళ్లు వచ్చే స్టామినా ఉన్న డైరెక్టర్ అని నిరూపించుకున్నాడు. బాలీవుడ్ లో ఒక తెలుగు వాడి సత్తా ఏంటో రాంగోపాల్ వర్మ తర్వాత చూపించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. సందీప్ రెడ్డి వంగ చాలా ముక్కుసూటితనంతో ఉంటారు అనే విషయాన్ని తెలిసిందే. తన సినిమా రిలీజ్ టైం లో మ్యూజిక్ డైరెక్టర్ రథన్ గురించి మాట్లాడుతూ తనను చాలా ఇబ్బంది పెట్టినట్లు బహిరంగంగా చెప్పుకొచ్చాడు.
అసలు ఎక్కడ మొదలైంది
అర్జున్ రెడ్డి సినిమాకు పాటల కోసం రథన్ ను చాలా రిక్వెస్ట్ చేసుకున్నాడు సందీప్ రెడ్డి వంగ. అయితే అప్పటికే రథన్ దగ్గర కీబోర్డ్ ప్లేయర్ గా పనిచేస్తున్న హర్షవర్ధన్ రామేశ్వర్ తో పాటు దగ్గరుండి అర్జున్ రెడ్డి సినిమాకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేయించుకున్నాడు. మామూలుగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ క్రెడిట్ కూడా రథన్ పేరు ఉంటుంది అని అందరూ ఊహించరు. కానీ హర్షవర్ధన్ రామేశ్వర్ పేరు చూడగానే అందరికీ ఆశ్చర్యం కలిగింది. చాలామంది హర్షవర్ధన్ రామేశ్వరికి బ్యాగ్రౌండ్ స్కోర్ క్రెడిట్స్ నీకు వేశారు అని ఫోన్ చేసి చెప్పినప్పుడు, ఏంటి బ్రో ఇలా చేశారు అంటూ సందీప్ రెడ్డి వంగానే హర్షవర్ధన్ అడిగారట. దానికి సందీప్ రెడ్డి వంగా బ్రో నీ వర్క్ కి క్రెడిట్ చేయాల్సిన బాధ్యత నాకుంది అంటూ మాట్లాడారు. ఏం జరిగినా అది నేను చూసుకుంటాను అంటూ భరోసా ఇచ్చారు. అక్కడి నుంచి రథన్ తో సందీప్ రెడ్డి వంగకి డిస్కషన్స్ మొదలయ్యాయి.
Also Read : Arjun SonOf Vyjayanthi : అందరూ ఆ 20 నిమిషాల గురించి మాట్లాడుతున్నారు, దేవర రిపీట్ అవుతుందా.?