Real estate vs Mutual funds: ఈ రోజుల్లో సంపాదన కన్నా తెలివైన పెట్టుబడి చాలా ముఖ్యం అంటున్నారు నిపుణులు. సంపాదించిందంతా బ్యాంక్‌లో దాచుకుందాం అనే రోజులు పోయాయి. ఇప్పుడు అందరూ పలు రకాల స్కీంలలో ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇలాంటి సమయంలో, రెండు బలమైన ప్రత్యామ్నాయా పెట్టుబడుల గురించి తెలుసుకుందాం. వాటిలో ఒకటి రియల్ ఎస్టేట్ (Real Estate), ఇంకొటి మ్యూచువల్ ఫండ్స్ SIP (Systematic Investment Plan). మరి ఏది బెస్ట్? మీకు లాభమిచ్చేది ఏదనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పెట్టుబడికి ముందుగా తెలుసుకోవాల్సిన విషయాలు
-Risk Appetite – మీరు ఎంత రిస్క్ తట్టుకోగలుగుతారు?
-Liquidity – అవసరం వచ్చినప్పుడు డబ్బు వెంటనే వెనక్కి వస్తుందా?
-Returns – లాభం ఎంత వస్తుంది?
-Tax Implications – పన్నుల వ్యవహారం ఎలా ఉంటుంది?
-Maintenance – నిర్వహణ తలనొప్పి ఎంత ఉంటుంది?
రియల్ ఎస్టేట్
రియల్ ఎస్టేట్ అంటే ఏంటి? ఇది భూమి, ఇల్లు, అపార్ట్‌మెంట్ లాంటి భౌతిక ఆస్తులపై పెట్టుబడి పెట్టడం. అనేక మంది ప్రజల మైండ్‌సెట్ లో ‘అసలైన ఆస్తి అంటే భూమే’ అనే అభిప్రాయం ఉంటుంది.
రియల్ ఎస్టేట్ లాభాలు:
-విలువ పెరుగుతుండటం (Appreciation): ముఖ్యమైన నగరాల్లో భూమి ధరలు సంవత్సరానికొకసారి పెరుగుతూనే ఉంటాయి.
-అద్దె ఆదాయం: మీరు ఇంటిని కొనుగోలు చేస్తే, మీరు అద్దెకు ఇస్తే నెలవారీ ఆదాయం లభిస్తుంది.
-భౌతిక ఆస్తి: ఇది కనిపించే, అనుభూతి చెందే ఆస్తి కావడం వలన మనకి సైకాలజికల్ సెక్యూరిటీ ఉంటుంది.
-లాంగ్ టెర్మ్ పెరుగుదల: 10–15 ఏళ్ళ దృష్టిలో చూస్తే, రియల్ ఎస్టేట్ మంచి రాబడిని ఇస్తుంది.
రియల్ ఎస్టేట్ నష్టాలు:
-క్యాష్ లిక్విడిటీ లేదు: ఇంటి అమ్మకానికి టైం పడుతుంది. ఎవరైనా వెంటనే కొనుగోలు చేయలేరు. లావాదేవీలు, రిజిస్ట్రేషన్, డాక్యుమెంటేషన్ వంటివి ఉంటాయి.
-నిర్వహణ ఖర్చులు: మెంటైనెన్స్, పన్నులు, రిపేర్స్ అన్నీ మీరు భరించాల్సి ఉంటుంది.
-రిస్క్: ప్రాజెక్టులు ఆలస్యం అవ్వడం, డెవలపర్లు మోసాలు చేయడం వంటి సమస్యలు.
-పన్నులు: లాంగ్ టెర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ (20% + indexation) పడుతుంది.
Read Also: Ambani Brothers: అప్పుల్లో ఉన్న తమ్ముడికి సహాయం చేయని …
మ్యూచువల్ ఫండ్స్ SIP
SIP అంటే ఏంటి? – ప్రతి నెలా ఫిక్స్ చేసిన అమౌంట్‌తో మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడి పెట్టడం. ఇది నేరుగా స్టాక్ మార్కెట్‌లో కాకుండా, నిపుణుల ద్వారా నడపబడే పథకం.
SIP లాభాలు:
-సిగ్నిఫికెంట్ రిటర్న్స్: మంచి ఫండ్‌ను ఎంచుకుంటే 12%–15% వరకూ రాబడి సాధ్యమే.
-లిక్విడిటీ: మీ పెట్టుబడిని సులభంగా రిడీమ్ చేసుకోవచ్చు.
-ఫ్లెక్సిబిలిటీ: నెలకు రూ. 500 నుంచే ప్రారంభించవచ్చు. ఏప్పుడు కావాలంటే అప్పుడు పెంచుకోవచ్చు లేదా ఆపుకోవచ్చు.
-ట్యాక్స్ బెనిఫిట్స్: ELSS లాంటి ఫండ్స్‌లో పెట్టితే 80C కింద ట్యాక్స్ మినహాయింపు లభిస్తుంది
-నిర్వహణ బాధ్యత లేదు: ఫండ్ మేనేజర్ అన్నింటినీ చూసుకుంటారు.
SIPలో నష్టాలు:
మార్కెట్ వోలాటిలిటీ: మార్కెట్ పడితే విలువ తక్కువయ్యే ప్రమాదం ఉంది.
కమిట్‌మెంట్ అవసరం: నెల నెలా డిసిప్లిన్‌తో పెట్టుబడి కొనసాగించాలి.
షార్ట్ టెర్మ్ లో లాభం తక్కువ: 1-2 ఏళ్ళలో పెద్ద Returns ఆశించకూడదు.
టాక్స్: 1 సంవత్సరానికి లోపే విక్రయిస్తే షార్ట్ టెర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ (15%) పడుతుంది. 1 సంవత్సరానికి మించిన వాటిపై రూ.1లక్షకు మించి లాభాలపై 10% లాంగ్ టెర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఉంటుంది.