July Month Holidays: జూలై నెలలో బ్యాంకులకు పండగే. ఎందుకంటే 31 రోజుల్లో 13 రోజులపాటు సెలవులు రానున్నాయి. అంటే 18 రోజులు మాత్రమే పని చేయనున్నాయి. అందులో ఆదివారాలు, పండుగలు కూడా ఉన్నాయి. కొన్ని సెలవులు ప్రత్యేకంగా కొన్ని రాష్ట్రాలకు మాత్రమే ఉంటాయి. మరికొన్ని అన్ని రాష్ట్రాలకు వర్తిస్తాయి.
దేశంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించిన అనంతరం ఆర్బీఐ-2025 ఏడాదికి సంబంధించిన బ్యాంకు సెలవుల జాబితాను విడుదల చేసింది. దీని ప్రకారం జూలై నెలలో బ్యాంకులు దాదాపు రెండువారాల పాటు మూతపడనున్నాయి. బ్యాంకు హాలిడేస్ జాబితాలో స్థానికంగా జరుపునే పండుగలు, రెండవ శనివారం, నాలుగో శనివారం, ఆదివారాలు అందులో ఉంటాయి.
ఈ జాబితాలోని కొన్ని సెలవులు అన్ని రాష్ట్రాలకు వర్తించనున్నాయి. అందులో కొన్ని మాత్రం ఇంకొన్ని రాష్ట్రాలకు వర్తిస్తాయి. ఈ విషయాన్ని బ్యాంకు కస్టమర్స్ గమనించాల్సి ఉంటుంది. బ్యాంకు సెలవుల జాబితాని దృష్టిలో పెట్టుకుని కస్టమర్స్ బ్యాంకు పనులకు సంబంధించిన ప్రణాళిక రెడీ చేసుకోవాలి. దేశంలోని బ్యాంకులు ప్రతి నెలా రెండు, నాలుగు శనివారాలు మూతపడతాయి.
మిగతా అన్నిరోజులు పని చేస్తాయి. అయితే సెలవు రోజుల్లో బ్యాంకులు పని చేయన్నప్పటికీ ఆన్‌లైన్ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. బ్యాంకు ఏటీఎంలు, క్యాష్ డిపాజిట్ మెషిన్స్ యధావిధిగా ప్రజలకు అందుబాటులో ఉంటాయి. ఈ విషయాన్ని బ్యాంకు అధికారులు చెప్పుకొచ్చారు. జూలైలో బ్యాంకులకు వచ్చే సెలవుల జాబితాపై ఓ లుక్కేద్దాం.
ALSO READ: జూలైలో అమెజాన్ ప్రైమ్ డే సేల్.. టాప్ డీల్స్ జాబితాలో స్మార్ట్‌ఫోన్స్
జూలై 3న ఖర్చీ పూజా సందర్భంగా త్రిపురలో బ్యాంకులకు సెలవు ఉంటుంది.
జూలై 5న గురు హరిగోబింద్ జీ జయంతి సందర్భంగా జమ్మూ-కాశ్మీర్‌లో బ్యాంకులకు సెలవు రానుంది.
జూలై 6 ఆదివారం కామన్‌గా ఉండే సెలవు.
జూలై 12న రెండవ శనివారం ఆ రోజు బ్యాంకులు పని చేయవు.
జూలై 13న ఆదివారం కావడంతో బ్యాంకు ఉద్యోగులకు వరుసగా రెండు రోజులు సెలవు వచ్చాయి.
జూలై 14న బెహ్ దీంక్లామ్ సందర్భంగా మేఘాలయలో బ్యాంకులకు సెలవు వచ్చింది.
జూలై 16న హరేలా సందర్భంగా ఉత్తరాఖండ్‌లో బ్యాంకులకు సెలవు ఇచ్చాయి.
జూలై 17న యూ టిరోట్ సింగ్ వర్ధంతి సందర్భంగా మేఘాలయలో బ్యాంకులకు సెలవు ఉంటుంది.
జూలై 19న కెర్ పూజా సందర్భంగా త్రిపురలో బ్యాంకులకు మళ్లీ సెలవు
జూలై 20న ఆదివారం సెలవు కామన్.
జూలై 26ననాలుగో శనివారం కావడంతో ఆ రోజు బ్యాంకు ఉద్యోగులకు సెలవు ఉంటుంది.
జూలై 27న ఆదివారం కావడంతో మళ్లీ బ్యాంకు ఉద్యోగులకు రెండురోజులు సెలవులు రానున్నాయి.