Bank Holidays: చాలామంది బ్యాంకు లేదా టీచర్ ఉద్యోగాలు చేయడానికి ఇష్టపడతారు. టైమింగ్స్‌తోపాటు సెలవులు అదే విధంగా ఉంటాయి. నేటికీ చాలా మంది యువత ఈ ఉద్యోగాలకు తొలి ప్రాధాన్యత ఇస్తుంటారు. తాజాగా ఏప్రిల్ నెలలో బ్యాంకులకు 15 రోజులు సెలవులు రాబోతున్నాయి. కేవలం 15 రోజులు మాత్రమే పని చేయనుంది. దీన్ని బట్టి పెళ్లిళ్లు, ఫంక్షన్లు చేసేవారు ముందుగా ప్లాన్ చేసుకోవడం బెటర్.
బ్యాంకులకు సెలవు వస్తే వినియోగదారులకు ఫైనాన్షియల్‌గా ఇబ్బందులు వస్తాయని ప్రభుత్వాలు భావిస్తుంటాయి. అందుకే సెలవులను కుదించేందుకు ప్రయత్నాలు చేస్తుంటాయి ప్రభుత్వాలు. అయితే బ్యాంకింగ్ సెక్టార్‌లో గత దశాబ్ద కాలంలో రిక్రూట్‌మెంట్ లేకపోవడంతో ఉన్న ఉద్యోగులకు పని భారం తీవ్రమవుతోందని గగ్గోలు పెడుతున్నారు.
అందుకే వారానికి రెండు రోజులు సెలవు కావాలని బ్యాంకు యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి. ప్రస్తుతానికి అందుకు సంబంధించిన ఫైల్ కేంద్ర ఆర్థికశాఖ మంత్రి వద్ద పెండింగ్‌లో ఉంది. ఈ వారం మొదట్లో రెండురోజులు సమ్మెకు వెళ్లాలని భావించినప్పటికీ, చివరకు అనివార్య కారణాల వల్ల బ్యాంకు ఉద్యోగులు డ్రాపయ్యారు.
2025 ఏడాదికి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకు సెలవులకి సంబంధించిన పూర్తి జాబితాని విడుదల చేసింది. ఆర్బీఐ జాబితా ప్రకారం.. ఏప్రిల్‌లో బ్యాంకులు మొత్తం 15 రోజుల పాటు మూతపడనున్నాయి. ఈ లెక్కన కేవలం 15 రోజులు మాత్రమే పని చేయనున్నాయి.
ALSO READ: పీఎఫ్ విత్ డ్రా ఎలా చేసుకోవాలి?
నార్మల్‌గా నెలలో వచ్చే రెండు, నాలుగు శనివారాల సెలవులు బ్యాంకు వినియోగదారులకు గుర్తు ఉంటుంది. రెండు శనివారాలు, నాలుగు ఆదివారాలతో దాదాపు అక్కడికే ఆరు రోజుల సెలవులు వస్తున్నాయి. అయితే జాబితాలో కొన్ని సెలవులు అన్ని రాష్ట్రాలకు వర్తించవు. జాతీయ స్థాయిలో ఉండే సెలవులు మాత్రమే వర్తిస్తాయి. కొన్ని సెలవులు ప్రత్యేకంగా కొన్ని రాష్ట్రాలకు మాత్రమే వర్తిస్తాయి.
బ్యాంకు సెలవులను దృష్టిలో పెట్టుకుని ఖాతాదారులు తమ వర్క్ కి సంబంధించి ముందుగా ప్లాన్ చేసుకోవడం బెటర్. లేకుంటే ఇబ్బందులు తప్పవు. సెలవు రోజులలో బ్యాంకులు మూతబడినప్పటికీ ఆన్ లైన్ సర్వీసులు మాత్రం యధాతథంగా పని చేస్తాయి. సెలవు రోజుల్లో కూడా బ్యాంకుల ఏటీఎంలు క్యాష్ డిపాజిట్ మెషిన్స్ అందుబాటులో ఉంటున్నాయి.
ఏప్రిల్ నెలకు సంబంధించి బ్యాంకు సెలవులపై ఓ లుక్కేద్దాం.
ఏప్రిల్ 1 న అకౌంట్స్ క్లోజింగ్ సందర్భంగా దేశంలో అన్ని బ్యాంకులకు సెలవు రానుంది.
ఏప్రిల్ 5 న బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా తెలంగాణలోని బ్యాంకులకు సెలవు రానుంది.
ఏప్రిల్ 6 న ఆదివారం సాధారణంగా వచ్చే సెలవు ఉంటుంది.
ఏప్రిల్ 10న మహావీర్ జయంతి సందర్భంగా చాలా రాష్ట్రాలు బ్యాంకులకు సెలవు ప్రకటిస్తున్నాయి.
ఏప్రిల్ 12న ఎప్పటిమాదిరిగా రెండో శనివారం సెలవు ఉంటుంది. మరుసటి రోజు 13న ఆదివారం.
ఏప్రిల్ 14 న అంబేద్కర్ జయంతి, విషు బిహు, తమిళ న్యూఇయర్ సందర్భంగా చాలా రాష్ట్రాలు బ్యాంకులకు సెలవులు ఇచ్చేశారు.
ఏప్రిల్ 15 న బెంగాలీ న్యూఇయర్, హిమాచల్ డే, బోహాగ్ బిహు నేపథ్యంలో అస్సాం, బెంగాల్, హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల బ్యాంకులకు సెలవు ఉంటుంది.
ఏప్రిల్ 18 న గుడ్ ఫ్రైడే సందర్భంగా దేశంలో అన్ని బ్యాంకులకు సెలవు, మరుసటి రోజు ఆదివారం రావడంతో ఉద్యోగులకు కలిసొచ్చింది.
ఏప్రిల్ 21 న గరియా పూజ సందర్భంగా త్రిపుర రాష్ట్రంలో బ్యాంకులకు సెలవు ఉంటుంది.
ఏప్రిల్ 26న నాలుగో శనివారం, ఆ మరుసటి రోజు ఆదివారం కావడంతో వరుసగా రెండు రోజులు సెలవులు.
ఏప్రిల్ 29న పరుశురాం జయంతి సందర్భంగా హిమాచల్ ప్రదేశ్‌లో బ్యాంకులకు సెలవు ఉంది.