L2 Empuraan Twitter Review : మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ – డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ కాంబోలో వచ్చిన ‘ఎంపురాన్’ (Lucifer 2) ఈరోజు (మార్చి 27, 2025) గ్రాండ్‌గా రిలీజ్ అయింది. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగా వెయిట్ చేశారో, ఇప్పుడు టాక్ చూస్తుంటే హైప్ కరెక్ట్ అనిపిస్తోంది! 2019లో వచ్చిన ‘లూసిఫర్’ మలయాళ ఇండస్ట్రీలో గేమ్ ఛేంజర్ సినిమా. మోహన్‌లాల్ స్టీఫెన్ నెడుంపల్లి అనే పవర్‌ఫుల్ పొలిటికల్ లీడర్ రోల్ ప్లే చేసి హవా క్రియేట్ చేశాడు. స్టైలిష్ మేకింగ్, మైండ్‌గేమ్స్, హై వోల్టేజ్ యాక్షన్ – అన్నీ కలిసి ఆ సినిమాను అల్లటిదెబ్బ హిట్ చేశాయి.
‘ఎంపురాన్’ సినిమా చూసిన ఫ్యాన్స్ టాక్ చూస్తుంటే డామినేషన్ క్లియర్! X (ట్విట్టర్)లో #L2Empuraan ట్రెండ్ అవుతోంది. మాస్ లెవల్ హై, స్కేల్ బిగ్, యాక్షన్ పీక్స్!
మోహన్‌లాల్ అంటే కంప్లీట్ యాక్టర్, కానీ అయితే “లూసిఫర్‌లోని అటిట్యూడ్ ఇక్కడ కొంత మిస్సయ్యిందేమో” అని కొందరు కామెంట్ చేస్తున్నారు. డైరెక్టర్ పృథ్విరాజ్ సుకుమారన్ మేకింగ్ గురించి మిక్స్‌డ్ టాక్ ఉంది. “గ్లోబల్ లెవెల్ విజువల్స్, హై బడ్జెట్ యూజ్ పెర్ఫెక్ట్” అని ఒక సైడ్. మరొక సైడ్ “లూసిఫర్ లెవెల్ నెరేషన్ లేదుగా!” అంటున్నారు. కానీ పాన్ ఇండియా రేంజ్ మేకింగ్ కచ్చితంగా ఉంది! ‘ఎంపురాన్’ టెక్నికల్‌గా మలయాళ ఇండస్ట్రీకి మైలు రాయి అని చెప్పొచ్చు. ఇది IMAX, EPIQ ఫార్మాట్స్‌లో రిలీజ్ అయిన మొట్టమొదటి మలయాళ సినిమా, అంటే విజువల్ గ్రాండియర్ మామూలుగా ఉండదని అర్థం. థియేటర్స్‌లో స్క్రీన్‌పై గ్రేట్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చేలా సినిమాని డిజైన్ చేశారు.
ఈ సినిమా షూటింగ్ భారత్, UK, USA, UAE లాంటి ఇంటర్నేషనల్ లొకేషన్స్‌లో జరగడం వల్ల గ్లోబల్ ఫీల్ వచ్చింది. ప్రొడక్షన్ వాల్యూస్ హాలీవుడ్ రేంజ్‌లో ఉన్నాయ్ అని ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు. సినిమా యాక్షన్ సీక్వెన్స్‌లు, వెహికల్ చేజ్‌లు, స్టంట్స్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్నాయంటూ ట్వీట్ల వర్షం కురుస్తోంది. ‘ఎంపురాన్’ బాక్సాఫీస్ దుమ్ముదులిపేలా అడ్వాన్స్ బుకింగ్స్‌లోనే ₹50 కోట్లు+ కొల్లగొట్టింది. ఫస్ట్ డే కలెక్షన్స్ కూడా స్టన్నింగ్ నంబర్స్ అందుకుంటున్నాయట. ఈ స్కేల్ చూసిన వాళ్లందరూ “ఇది మలయాళ సినిమా కాదు రా, పాన్ ఇండియా లెవెల్ మూవీ!” అని కామెంట్ చేస్తున్నారు.
ఫైనల్ వర్డిక్ట్ :
‘ఎంపురాన్’ సినిమా హైప్ చూస్తుంటే బాక్సాఫీస్ దుమ్ములేపడం పక్కా. మోహన్‌లాల్ మాస్ అటిట్యూడ్, పృథ్విరాజ్ గ్రాండ్ మేకింగ్, హై-ఎండ్ యాక్షన్ – అన్నీ కలిపి ప్రేక్షకులకు ఫుల్ ప్యాక్డ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చాయి. అయితే, స్టోరీ అంచనాలు అందుకోలేదనేది కొందరి అభిప్రాయం. కానీ మాస్ ఆడియన్స్‌కి మాత్రం ‘ఎంపురాన్’ మస్త్ హై ఇవ్వడం గ్యారంటీ. స్టైల్, యాక్షన్, స్కేల్… అన్నింటా సినిమా డామినేట్ చేసేలా ఉంది.