Money Earning Tips: నేటి సమాజంలో శ్రమించాలన్న ఆలోచన ఉంటే చాలు ఉపాధి మార్గాలకు కొదవలేదు. మీ చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా దర్జాగా ఉపాధి పొందేందుకు ఎన్నో మార్గాలు ఉన్నాయి. కానీ అందుకు కాస్త నాలుగు మాటలు, సమయస్పూర్తి ఉంటే చాలు. చాలా వరకు యువత పెట్టుబడికి డబ్బులు లేవు. ఎవరూ ఉపాధి అవకాశాలు ఇవ్వడం లేదని తమ ఆవేదన వెళ్లగక్కుతూ ఉంటారు. కానీ అలాంటి వారికి మార్కెట్ లో ఎన్నో అవకాశాలు ఉన్నాయని వ్యాపార నిపుణులు చెబుతున్నారు. అయితే మీ చేతిలో చిల్లిగవ్వ డబ్బులు లేకుండా ఎలాంటి అవకాశాలు ఉన్నాయో తెలుసుకుందాం.
ఒక్క రూపాయి పెట్టుబడి అవసరం లేదు. కేవలం మీ ఆలోచన, మీ సమయ స్పూర్తి, మీ శ్రమ దీనికి పెట్టుబడి. ఈ ప్లాన్స్ అమలు చేస్తే చాలు మీరు అంబానీ కుటుంబానికి పోటీ కావచ్చు. అందుకు డబ్బు పొదుపు కూడా అవసరమే. ప్రధానంగా పట్టణాలలో ఉన్న వారికి ఉపాధికి కొదువ ఉండదు. అదే గ్రామీణ ప్రాంతాలో నివసించే వారికి ఉపాధి అవకాశాలు తక్కువ ఉంటాయి. అలాంటి సమయంలో వారు వేల రూపాయలు పెట్టుబడితో వ్యాపారం సాగించడం కష్టమే. అందుకే అలాంటి వారికి పలు ఉపాధి మార్గాలు ఉన్నాయి.
రూపాయి ఖర్చు లేదు..
గ్రామీణ ప్రాంతాలలో రూపాయి ఖర్చు లేకుండా ఉపాధి పొందేందుకు సరైన అవకాశం ఇది. గ్రామ సేవా సలహాదారులుగా ఉంటే చాలు. ఇదేదో జాబ్ అనుకోవద్దు. మీ పనితీరు, మీపై గ్రామ ప్రజలకు ఉన్న నమ్మకమే దీనికి పెట్టుబడి. రైతులకు, పాఠశాల విద్యార్థులకు, పేద కుటుంబాలకు ప్రభుత్వం అందిస్తున్న పథకాల గురించి వివరిస్తే చాలు, మీకు ఉపాధి దక్కినట్లే. అదెలాగంటే వారికోసం ఆన్‌లైన్ అప్లికేషన్లు నింపండి. సేవా ఫీజుగా రూ. 20 నుండి రూ. 50 వసూలు చేయొచ్చు. ఇందుకు మీ చేతిలో మొబైల్ ఉంటే పని సులువుగా అవుతుంది.
వాట్సాప్ పబ్లిసిటీ..
మీ మండలంలోని చిన్న వ్యాపారాలకు వాట్సాప్ పబ్లిసిటీ చేయవచ్చు. స్థానిక దుకాణాలు, కూరగాయలు అమ్మే వారు, మెకానిక్‌ల కోసం WhatsApp స్టేటస్ అడ్వర్టైజింగ్ సేవలు అందించండి. మీ స్నేహితుల గ్రూప్ లలో, ఇతర గ్రూప్‌లలో వ్యాపార వివరాలు షేర్ చేయండి. మంచి పబ్లిసిటీ చేసినందుకు గాను రూ.30 నుండి రూ. 50 తీసుకోవచ్చు. దీనికి మీకు ఫోన్ తప్పనిసరి.
డిజిటల్ సేవలు
మీరు మీ పేరుతో PhonePe Business, PayNearby వంటి యాప్‌లు ఓపెన్ చేస్తే, గ్రామంలో రీచార్జ్‌లు, బిల్లులు వేసే అవకాశం ఉంటుంది. మొదట మీ పేరు, బ్యాంక్ ఖాతా ఉంటే చాలు, దీనికి పెట్టుబడి కూడా అవసరం లేదు. ప్రతి నగదు లావాదేవీకి కమిషన్ వస్తుంది.
పాఠశాల పిల్లలకు హోమ్ ట్యూషన్
గ్రామంలోని చిన్న పిల్లలకు ఇంటి వద్దే చదువు చెప్పండి. ఒక్క విద్యార్థికి రూ.100 నుండి రూ. 200 వరకు తీసుకోవచ్చు. మీరు చదువుతుంటే మీ చదువుకు కూడా ఇది ఎంతగానో దోహదపడుతుంది.
వాట్సాప్ గ్రూప్ లతో ఆదాయం..
మీషో, అమెజాన్ అఫిలియేట్ లింక్ తీసుకుని, గ్రామస్థుల అవసరాల కోసం వస్తువులను షేర్ చేయండి. వారెవరు ఆ లింక్ ద్వారా కొంటే, మీకు ఆదాయమే. సిటీకి వెళ్ళి కొనుగోళ్లు నిర్వహించే వారిని మీరు ఆశ్రయిస్తే చాలు మీకు ఇదొక ఉపాధి మార్గమే.
ఫేస్‌బుక్ పేజీ..
మీ గ్రామాన్ని ప్రోత్సహించేలా ఒక ఫ్రీ ఫేస్‌బుక్ పేజీ రెడీ చేయండి. గ్రామ ఉత్సవాలు, స్థానిక మేళాలు, పంటలు మొదలైన అంశాలపై రాస్తూ అందరినీ ఆకట్టుకోండి. ఆ తర్వాత స్థానిక బ్రాండ్లు, సంస్థలు మీ పేజీలో ప్రకటనలు ఇవ్వడానికి ఆసక్తి చూపుతారు. దీనితో మీకు ఆదాయం రావడం ఖాయం.
అయితే ఇందుకు మీకు కావాల్సిందల్లా స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్ డేటా, ఉపాధి పొందాలనే ఆశ, ఉత్సాహం, గ్రామ ప్రజలకు మీపై నమ్మకం ఉంటే చాలు. ప్రధానంగా ఇలా ఉపాధి పొందే వారు ఒక్కసారి నమ్మకాన్ని పోగొట్టుకున్నారో, ఇక లైఫ్ లో మీకు ఉపాధి దొరకడం కష్టమే. ఒక్క రూపాయి పెట్టుబడి లేకుండా మన ఊరిలో మనం జీవించే అవకాశాలు ఇన్ని ఉన్నాయి. శ్రమించే గుణం మనకు ఉంటే చాలు, నేటి రోజుల్లో ఉపాధి మార్గాలకు కొదువే లేదు. ఈ టెక్నిక్స్ తో మీరు నెలకు సుమారు రూ. 15 వేల నుంది రూ. 25 వేల ఆదాయం పొందవచ్చు.