BigTV English

Sreeleela: మరోసారి ప్రియుడితో కలిసి అడ్డంగా దొరికిన శ్రీలీల..

Sreeleela: మరోసారి ప్రియుడితో కలిసి అడ్డంగా దొరికిన శ్రీలీల..

Sreeleela: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రీలీల బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే.. తాజాగా బాలీవుడ్ స్టార్ కార్తీక్ ఆర్యన్ హీరోగా ఆషికి 3 మూవీలో నటించే ఛాన్స్ కొట్టేసింది. కార్తీక్ ఆర్యన్ తో శ్రీ లీల ప్రేమలో ఉన్నట్లు వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారని బీ టౌన్లో వార్తలు గుప్పుమంటున్నాయి. వీరిద్దరూ జంటగా ఒకే ఫంక్షన్ లో కనిపించి ఆ వార్తలకు ప్రాణం పోశారు. తాజాగా వీరిద్దరూ మరోసారి మీడియా కంట పడడంతో మరోసారి హాట్ టాపిక్ గా నిలిచారు.


బాలీవుడ్ క్యూట్ కపుల్స్..

సూపర్ టాలెంటెడ్ శ్రీలీల రాఘవేంద్ర దర్శకత్వంలో పెళ్లి సందD సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఆ తరువాత ధమాకా, స్కంద, భగవత్ కేసరి వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ఆమె బాలీవుడ్ లో అనురాగ్ బసు దర్శకత్వంలో ఆషీకీ 3 మూవీలో నటిస్తున్నారు. కార్తీక్ ఆర్యన్ ప్యార్ కపంచ్ నామ చిత్రంతో కెరీయర్ని ప్రారంభించి 2024 లో వచ్చిన భూల్ భూలయ్యా 3 తో విజయాన్ని అందుకున్నారు. శ్రీలీల కార్తీక్ కలిసి ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రంలో కార్తీక్ ఒక రాక్ స్టార్ గా కనిపించనున్నాడు. ఇటీవల వీరిద్దరూ కలిసి ఈవెంట్స్ లో పాల్గొనడం, సినిమా వేడుకల్లో కలిసి కనిపించడంతో.. వారు డేటింగ్ లో ఉన్నారన్న పుకారు షికారు చేస్తుంది. తాజాగా కార్తీక్ ఆర్యన్ ఫ్యామిలీ అటెండ్ అయినా ఫంక్షన్ కు శ్రీలీల కూడా తన కుటుంబంతో హాజరవ్వడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. బయటికి చెప్పకపోయినా వీరి మధ్య ఏదో ఉందనే విషయం మరోసారి మీడియా కంటపడడంతో ఖరారు అయింది. ఈ జంటని చూసినవారు బాలీవుడ్ క్యూట్ కపుల్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.


ఆమె కోడలు గా ..శ్రీలీల..

కార్తీక్ ఆర్యన్ శ్రీలీల డేటింగ్ పుకార్లు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. కార్తీక్ సోదరి ఫంక్షన్ లో వీరిద్దరూ కలిసి మొదటిసారి కనిపించారు. ఆ తర్వాత కార్తీక్ ఇంస్టాగ్రామ్ లో శ్రీలీల ఫోటోని షేర్ చేస్తూ తూ మేరి జిందగీ హై అనే క్యాప్షన్ రాశారు. ఇది వారి డేటింగ్ పుకార్లని నిజమయ్యేలా చేసింది. కార్తీక్ తల్లి ఐఫా2025 వేడుకల సందర్భంగా తన కోడలు మంచి డాక్టర్ కావాలని చెప్పడంతో.. శ్రీలీల వైద్య విద్యార్థి కావడంతో ఈ వ్యాఖ్యలు ఆమె శ్రీలీలను ఉద్దేశించి చేసినవి అన్నట్లుగా ఫ్యాన్స్ ఊహించుకున్నారు. ఏది ఏమైనా ఫ్యాన్స్ స్క్రీన్ పై వీరి కేమిస్ట్రీ అద్భుతంగా ఉంటుంది అని కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటివరకు శ్రీలీల, కార్తీక్ ఈ విషయంపై స్పందించలేదు.

ఇక శ్రీలీల గత సంవత్సరం గుంటూరు కారం సినిమాతో బ్లాక్ బస్టర్ ని అందుకున్నారు. తాజాగా రవితేజతో మాస్ జాతరలో, పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ లో, అక్కినేని అఖిల్ సరసన లెనిన్ వంటి క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తున్నారు. ఇక ఆషీకీ 3 చిత్రంతో బాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తున్నారు. ఈ చిత్రం అక్టోబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Gopichand Malineni : మలేషియాలో ప్రభాస్ ఒకే అన్నాడు.. ఇండియా వచ్చాకే లెక్కలు మారిపోయాయి..

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×