Manju Warrier: సెలబ్రిటీలు బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా హీరోయిన్స్ పబ్లిక్ లోకి రావాలంటేనే ఆలోచిస్తున్నారు. చుట్టూ ఉన్న జనంలో ఆకతాయిలు చేరి సెలబ్రిటీలను ఇబ్బంది పెడుతున్నారు. కొన్నిసార్లు ఆకతాయిలు హద్దులు మీరు ప్రవర్తించడం కూడా మనం గమనిస్తున్నాం. ఇటీవల శ్రీలీలను ఆకతాయిలు చెయ్యి పట్టి లాగిన సంఘటన మనం చూసాం. తాజాగా మంజు వారియర్ కి ఇలాంటి అనుభవమే ఎదురయింది. ఆమె రీసెంట్గా ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి వెళ్ళగా అక్కడ ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. ఆ వివరాలు ఇలా..
స్టార్ హీరోయిన్ కి చేదు అనుభవం..
మంజు వారియర్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి వెళ్లి, తిరిగి కారు దగ్గరికి వస్తూ ఉండగా.. అభిమానులు చుట్టుముట్టారు. ఒకసారిగా అందరూ ఎగబడడంతో ఆమెవారికి అభివాదం చేసుకుంటూ వెళ్తున్నారు. అప్పుడే మంజు వారియర్ కు చేదు అనుభవం ఎదురయింది. ఈక్రమంలో ఓ వ్యక్తి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించి నడుముని గిల్లాడు. అంతేకాకుండా కొంతమంది ఆమె చెస్ట్ ను టచ్ చేయాలని ప్రయత్నించగా భయపడిపోయిన మంజు కార్ దగ్గరికి వేగంగా వెళ్లిపోయింది.. ఆమె ఇబ్బంది పడినట్టు తెలియకుండా నవ్వుతో కవర్ చేసుకుంది. ఇదేమీ పట్టించుకోకుండా మంజు వారియర్ ఫ్యాన్స్ తో ఫోటోలు దిగి అక్కడ నుంచి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
మంజు వారియర్ సినీ ప్రస్థానం ..
మంజు వారియర్ మలయాళ సినీ పరిశ్రమలో నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈమెఅనేక మలయాళ చిత్రాల్లో నటించారు. 1996 నుండి 1999 వరకు మూడు సంవత్సరాల లో 20 మలయాళ చిత్రాల లో నటించారు. వివాహం తర్వాత కొంతకాలం సినీ రంగానికి దూరంగా ఉండి విరామం తీసుకున్నారు. ఆమె 2014లో ఓ ఓల్డ్ ఆర్ యు అనే కామెడీ మూవీ ద్వారా సినీ రంగంలోకి రీఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రంలో నిరుపమా రాజీవ్ అనే పాత్రలో ఒక మహిళ తన కలలను సాకారం చేసుకునే ప్రయాణాన్ని అద్భుతంగా చూపెట్టిన చిత్రం గా విమర్శకుల ప్రశంసలను అందుకుంది.ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో మంజు నటనకు 2017లో సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ సైమాలో బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు లభించింది. ఇక అక్కడి నుంచి ఆమె వెనక్కి తిరిగి చూసుకోకుండా ఆఫర్స్ క్యూ కట్టాయి. 2019లో లూసిఫర్ సినిమాలో నటించి మెప్పించారు. అదే సంవత్సరం ధనుష్ తో తమిళ చిత్రంలో నటించారు. ఈ సినిమా ఆమె తమిళ చిత్రాలలో మొదటిది. ఇక అక్కడి నుంచి తమిళ సినీ రంగంలో కూడా తన ప్రతిభను చాటుకుంటూ వెళ్లారు. గత సంవత్సరం వెట్టాయన్ చిత్రంలో రజనీకాంత్ సరసన నటించారు. ఆ సినిమాలో ఆమె ఓ పాటకి అద్భుతంగా డాన్స్ చేసి సోషల్ మీడియాలో స్టార్ డమ్ సంపాదించుకుంది. ఎంపురాన్ 2 లోను మోహన్ లాల్ తో కలిసి నటించారు. ఈ సినిమా మలయాళ సినిమాల్లోనే అత్యధిక వసూలు సాధించిన చిత్రంగా నిలిచింది.ఇక ఆమె ప్రస్తుతం విజయ్ సేతుపతి సరసన నటిస్తున్నారు.
Mahesh Babu : ప్రియాంక – మహేష్ పాట.. ప్యాకప్ తో నెలరోజులు రెస్ట్ అంటున్న మహేష్..