Jio New Offers: ఇండియాలో అతిపెద్ద టెలికాం ప్రొవైడర్ గా గుర్తింపు తెచ్చుకున్నది రిలయన్స్ జియో. 46 కోట్ల మంది వినియోగదారులతో టాప్ లో కొనసాగుతోంది. తన కస్టమర్లకు ఆకట్టుకునేలా ఎప్పటికప్పుడు సరికొత్త ఆఫర్లను పరిచయం చేస్తూనే ఉంది. అందులో భాగంగా తాజాగా మరో సూపర్ డూపర్ ప్లాన్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. రూ.895 ధరతో కొత్త లాంగ్-వ్యాలిడిటీ ప్లాన్ ను ప్రవేశపెట్టింది. దాదాపు సంవత్సరం సేవలను అందించడానికి రూపొందించబడిన ఈ ప్లాన్, తక్కువ రీఛార్జ్ లు, స్థిరమైన కనెక్టివిటీని ఇష్టపడే వినియోగదారులకు ఎంతో ఉపయోగకరంగా ఉండబోతోంది.
రూ.895 ప్లాన్ తో లాభం ఏంటి?
రూ.895 ప్లాన్ తో ఏకంగా 336 రోజులు వ్యాలిడిటీ అవకాశం ఉంటుంది.
⦿ అన్ని లోకల్, STD నెట్ వర్క్ లకు అపరిమిత వాయిస్ కాలింగ్
⦿ ప్రతి 28 రోజులకు 50 ఎస్సెమ్మెస్ లు
⦿ ప్రతి 28 రోజులకు 2GB హై-స్పీడ్ డేటా. పూర్తి ప్లాన్ వ్యవధిలో 24GB డేటా అందిస్తుంది.
నిజానికి ఎక్కువ నెట్ ఉపయోగించే వారికి ఈ డేటా సరిపోకపోవచ్చు. కానీ, బ్రౌజింగ్, మెసేజింగ్, లైట్ యాప్ వినియోగించే వారికి సరిపోతుంది.
ఈ ప్లాన్ ఎవరు పొందే అవకాశం ఉందంటే?
ఆకర్షణీయమైన రూ. 895 ప్లాన్ జియో ఫోన్, జియో భారత్ ఫోన్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. సాధారణ స్మార్ట్ ఫోన్లలో జియో సిమ్‌ను ఉపయోగించే కస్టమర్‌లు ఈ ప్లాన్‌ను పొందలేరు. సో, జియో ఫీచర్ ఫోన్లను కలిగి ఉన్నవారు మాత్రమే ఈ రీఛార్జ్ ఎంపిక నుండి ప్రయోజనాన్ని పొందే అవకాశం ఉంటుంది.
ఈ ప్లాన్ ఎందుకు ముఖ్యమైనది?
ఇటీవల మొబైల్ రీఛార్జ్ ధరల పెరుగుదల తర్వాత, వినియోగదారులు బడ్జెట్ ఫ్రెండ్లీ, లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్‌ల కోసం వెతుకుతున్నారు. జియో తాజా ఆఫర్ అలాంటి వారి కోసం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది ముఖ్యంగా కమ్యూనికేషన్ కోసం ప్రాథమిక ఫోన్లపై ఆధారపడే గ్రామీణ,సెమీ-అర్బన్ ప్రాంతాల వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఉంటుంది.
Read Also: రిలయన్స్ ఫ్రెష్, డి-మార్ట్.. దేనిలో ధరలు తక్కువ, ఎందుకు?
జియో నవీకరించబడిన రీఛార్జ్ పోర్ట్ ఫోలియో
అన్ని రకాల కస్టమర్ అవసరాలను తీర్చడానికి జియో మొత్తం రీఛార్జ్ పోర్ట్ ఫోలియోను రిఫ్రెష్ చేస్తోంది. ఎంటర్ టైన్ మెంట్ ప్లాన్లు, ట్రూ అన్ లిమిటెడ్ అప్ గ్రేడ్ ప్లాన్లు, వార్షిక ప్లాన్లు, డేటా ప్యాక్ లు, జియో ఫోన్, భారత్ ఫోన్ ప్లాన్లు, వాల్యూ ప్లాన్లు, ట్రూ 5G అన్ లిమిటెడ్ ప్లాన్లు ఉన్నాయి. జియో ఫోన్, భారత్ ఫోన్ వినియోగదారుల కోసం, ఈ కొత్త రూ. 895 రీఛార్జ్ ప్లాన్ చక్కగా ఉపయోగపడుతుంది. నెలవారీ రీఛార్జ్ ల ఇబ్బంది లేకుండా ఉండాలనుకునే వారికి ఇదో బెస్ట్ ప్లాన్ గా చెప్పుకోవచ్చు.
Read Also: డిమార్ట్ లో వస్తువుల ధరలు ఎందుకంత తక్కువ? ఏ రోజుల్లో మరింత చీప్ గా కొనేయొచ్చు?