E-Paper
Advertisement

మోడీని డిఫెన్స్‌లో పడేసిన ‘ఫారెన్‌ లింక్‌’ అస్త్రం! ధీటుగా సవాల్‌ విసిరి దేశ వ్యాప్త చర్చకు తెరలేపిన రాహుల్‌! మోడీ ఒకటి తలిస్తే..!

మోడీని డిఫెన్స్‌లో పడేసిన ‘ఫారెన్‌ లింక్‌’ అస్త్రం! ధీటుగా సవాల్‌ విసిరి దేశ వ్యాప్త చర్చకు తెరలేపిన రాహుల్‌! మోడీ ఒకటి తలిస్తే..!
Advertisement

తానొకటి తలిస్తే.. దైవమొకటి తలిచాడంటే ఇదేనేమో! మోడీకి కాలం కలిసి రానట్టుంది. ఈ మధ్య ఏది ముట్టుకున్నా అది తిరగబడుతోంది. ఏది ముట్టుకున్నా అది తిరిగి తనకే రివర్స్‌గా తాకుతోంది. హనుమంతుడిని చేయబోతే కోతైనట్టుగా తయారవుతోంది మోడీ ప్రతి అడుగు.

నీట్‌ పేపర్ లీకేజీ నుంచి మొదలైన ఈ తతంగం.. తాజాగా ‘ఫారిన్‌ లింక్‌’ అంశం దాకా కొనసాగుతోంది. అన్నీ ఉల్టా గాయాలే తప్ప… ఏ ఒక్కటీ కేంద్ర ప్రభుత్వానికి, బీజేపీకి పార్టీకి పనికి వచ్చేలా లేవు. ఎస్‌ఐఆర్‌ వివాదం ఓ వైపు తీవ్ర రూపం దాల్చుతూనే ఉంది. ఓట్ చోరీ అంశం సామాన్య జనం దాకా పాకిపోయింది. సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేస్తారా? చేయిస్తారా? అనే అంశం పక్కకు పెడితే.. దీని వెనుక పెద్ద తప్పిదమే జరుగుతోందనే సంకేతాలు దేశ జనానికి వెళ్లాయనడంలో అతిశయోక్తి లేదు.

Advertisement

నీట్ పేపర్ లీకేజీని లైట్‌గా తీసుకుని.. జెన్‌జీని చైతన్య పరిచి, కాక్రోచుల పార్టీకి పురుడు పోసి తమ మీదే దండయాత్ర చేయించుకున్న ఉదంతంతో కూడా మోడీ సర్కార్‌ మేలుకోలేదు. ధర్మేంద్ర ప్రధాన్‌ను రాజీనామా చేయించేదాకా పరిస్థితి వచ్చిందంటేనే అది యువత చేతిలో మోడీ నైతికంగా ఓటమి చెందారనే సిగ్నల్స్‌గా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఆ తరువాత ఎస్ఐఆర్‌ వివాదంపై రాహుల్‌ ఆది నుంచి పోరాటం ఆపలేదు. మొదట దీన్ని జనం కూడా లైట్‌గానే తీసుకున్నారు. ఇదో రాజకీయ ఆందోళనగానే చూశారు. కానీ, ఆ తరువాతే తెలిసి వచ్చింది కోట్లాది మంది ఓట్లను ఎలా గల్లంతు చేస్తున్నారనే విషయం. అమిత్ షా డైరెక్టుగా చెప్పేస్తున్నారు… ‘ఓట్లు పోయినోళ్లంతా మనోళ్లు కాదు.. వీదేశీ శక్తుల’ని. ‘మరి మూడు సార్లు ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన కేంద్రం.. ఈ దొంగ ఓట్లు.. వీదేశీ ఓటర్లతోనే గెలిచారా?’ అనే ప్రశ్నకు వారే ఆజ్యం పోసి.. ఆ మంటల సెగకు విలవిలలాడుతున్నారు.

Advertisement

ఇది చాలదంటూ కొత్తగా మోడీ మరో వివాదాన్ని తలకెత్తుకున్నారు. ఎస్ఐఆర్‌ పై ఆందోళనలను విదేశీ శక్తులు చేయిస్తున్నాయనే విధంగా తనదైన రాజకీయ వ్యూహంలో భాగంగా ఆయన చేసిన కామెంట్స్‌ బూమరాంగే అయ్యాయి. తమపై ఓట్ చోరీ ముద్ర వేయాలనుకుంటున్న రాహుల్‌ను ఇరకాటంలో పెట్టేందుకు కాంగ్రెస్ కు విదేశీ శక్తుల అండ ఉందని, ఆర్థిక మూలాలు కూడా అక్కడ్నుంచే వస్తున్నాయని మోడీ తాజాగా చేసిన కామెంట్స్‌ దేశ రాజకీయాల్లో మరో కొత్త వివాదానికి తెర లేపింది.

దీన్ని వెంటనే అందిపుచ్చుకున్నారు రాహుల్‌. తన ఎక్స్‌ వేదికగా దీనిపై ఆందోళనకు రెడీ అయిపోయారాయన. ‘అసలు విదేశీ లింకులు, సాయం, ఆర్ధిక దన్ను మీకే ఉంది… దీనిపై ఎక్కడైనా చర్చకు సిద్దమ’ని ఆయన ప్రకటించడం ఆ వివాదాన్ని మరింత వేడెక్కించింది. ‘బహిరంగ చర్చకు ప్లేస్‌ మీరే చెప్పండి.. ఎప్పుడో ఆ తేదీనీ నిర్ణయించండి.. జడ్జిగా ఒకరు కావాలి కాబట్టి మీ ఆర్ఎస్‌ఎస్‌ చీఫ్‌ మహేశ్‌ భగవత్‌ను నియమించుకున్నా పర్వాలేదు.. చర్చకు సిద్దమా?’ అని కయ్యానికి కాలు దువ్వే సరికి ఎన్డీయే పరిస్థితి కుయ్యో మొర్రోగా మారింది.

అంతేకాదు.. మోడీని రెచ్చగొట్టేలా.. ‘నేను, ప్రధాని బహిరంగంగా చర్చించుకోవడం మీరు చూడాలనుకుంటున్నారా?’ అని ఎక్స్‌లో రాహుల్‌ మెసేజ్‌ పెట్టడం కూడా యువతలో చర్చకు తెర తీసింది. ‘నా వద్ద మోడీకి చెందిన రహస్యాలున్నాయి. అవి బయటపడతాయనే ఆయన బహిరంగ చర్చకు రావడం లేదు..!’ అని కూడా కామెంట్ చేశారు రాహుల్. ‘చర్చకైనా రండి.. లేదా నాపై పరువు నష్టం దావా అయినా వేయండి..!’ అని ఎన్ని రకాలుగా రెచ్చగొట్టాలో అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు రాహుల్‌.

దీంతో గాలికిపోయే కంపను.. తలిగించుకున్నట్టుగా అయ్యిందనే భావన బీజేపీలో నెలకొన్నదనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. దీన్ని కౌంటర్ ఎటాక్‌ చేసేందుకు అమిత్‌ షా, నిర్మలా సీతారామన్ తంటాలు పడుతున్నట్టు కనిపిస్తోంది. ‘అన్ని విషయాలపై చర్చకు సిద్దం.. పార్లమెంటులో అయితేనే.. !’  కండిషన్ అప్లై అన్నట్టుగా మాట్లాడుతున్నారు.

కానీ ఈ వివాదం బహిరంగ రాజకీయ రచ్చగా మారిన నేపథ్యంలో బీజేపీ ఈ విషయంలో ఆరోపణ చేసి వెనక్కి తగ్గిందనే కామెంట్సే వస్తున్నాయి. అంటే బీజేపీకి ఇది వరుసగా మూడో ఓటమిగా చూడాల్సి ఉంటుందంటున్నారు విశ్లేషకులు. అయితే ఇప్పటి వరకు అధికారిక గణాంకాల మేరకు బీజేపీకి పార్టీ ఫండ్‌ ఆడిట్‌ రిపోర్టు ప్రకారం రూ. 7,113.80 కోట్లు కాగా, కాంగ్రెస్‌ పార్టీ నిధులు రూ. 857.15 కోట్లుగా ఉన్నాయి. దేశంలోని మొత్తం రాజకీయ విరాళాలలో 91% వాటా ఒక్క బీజేపీకే దక్కుతుండగా, కాంగ్రెస్‌ పార్టీకి కేవలం 8% వాటానే వస్తున్నదని ఏడీఆర్‌ నివేదిక స్పష్టం చేస్తోంది.

Tags

Related News

అమరవీరుల కాలనీ ఫామ్‌హౌజ్‌ దగ్గర ఎందుకు? ఉద్యమకారులకు కూడా మియాపూర్‌లో జాగాలివ్వండి! కేటీఆర్‌ స్టేట్‌మెంట్‌ బూమరాంగ్‌!

ఏడాది తరువాత కోదండరామ్‌కు టైం ఇచ్చిన సీఎం! కలిసిన టీజేఎస్ ప్రతినిధులు! కరువు నేపథ్యంపై ప్రొఫెసర్‌ కీలక చర్చలు!

కేరళ, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ…! ఈ రాష్ట్రాల్లో జనాలకు సీఎంలు భయపడాల్సిందే.. జవాబుదారీ పాలన అందివ్వాల్సిందే!

బీఆర్ఎస్ పార్టీలో హరీశ్‌రావుకు ‘ఫ్రీ హ్యాండ్.. ఎందుకో తెలుసా..?

మెగాలోమేనియా, డెల్యూషనల్‌ డిజార్డర్‌! అమిత శక్తిమంతులమనే ఊహా.. తానే గొప్ప అనే భ్రాంతి! ఇదేనా బీఆరెస్‌ మానసిక స్థితి?

ఖైరతాబాద్ ఉపఎన్నిక సస్పెన్స్.. దానం నాగేందర్ వర్సెస్ పి. విజయారెడ్డి న్యాయపోరాటంలో గెలుపెవరిది?

కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై కమలం గట్టి ఫోకస్.. కారణం బీజేపీ అసలు ప్లాన్ ఇదే?

Big Stories

Advertisement
×