E-Paper
Advertisement

Mahindra XUV 3XO : అదరగొట్టే లుక్స్‌తో మహీంద్రా SUV XUV 3XO .. బుకింగ్స్ షురూ!

Mahindra XUV 3XO : అదరగొట్టే లుక్స్‌తో మహీంద్రా SUV XUV 3XO .. బుకింగ్స్ షురూ!
Advertisement

Mahindra XUV 3XO : మహీంద్రా ఇటీవలే కొత్త XUV 3XO ని విడుదల చేసింది. ఇది భారతదేశంలో చీపెస్ట్ ఆటోమేటిక్‌గా ఎస్‌యూవీగా మారింది. కారు MX2 పెట్రోల్ ఆటోమేటిక్ వేరియంట్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 9.99 లక్షలు కాగా, డీజిల్ ఇంజిన్‌లోని ఆటోషిఫ్ట్ ప్లస్ వేరియంట్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 11.69 లక్షలు. ఈ ధరతో ఇది భారతదేశంలో చౌకైన ఆటోమేటిక్ SUVగా మారడమే కాకుండా ఈ కారుతో SUV సెగ్మెంట్ పోటీ తీవ్రంగా మారింది. ఆకర్షణీయమైన ధరలతో, మహీంద్రా కొత్త XUV 3X0తో బలమైన పోటీని  ఇస్తుంది.

మహీంద్రా కొత్త XUV 3XO కారు బుకింగ్‌ను మే 15 నుంచి ప్రారంభిస్తామని కంపెనీ వెల్లడించింది. మే 26 నుంచి వినియోగదారులకు డెలివరీ చేయనున్నట్లు తెలియజేసింది. లుక్స్ గురించి చెప్పాలంటే కొత్త XUV3X0 XUV300తో పోలిస్తే పూర్తిగా భిన్నంగా ఉంటుంది. కారు LED ప్రొజెక్టర్ హెడ్‌లైట్‌లు పూర్తిగా కొత్త డిజైన్‌లో ఉన్నాయి. అయితే LED DRL షేప్‌లో మార్పులు చేశారు. కొత్త గ్రిల్, కొత్త బంపర్‌లు, C-ఆకారపు LED టైల్‌లైట్‌లు దీనిని అట్రాక్ట్‌గా మార్చుతాయి. వెనుకవైపు ఉన్న LED లైట్ బార్ దీనికి మంచి లుల్ ఇస్తుంది.

Advertisement

Also Read : కియా లవర్స్‌కు పండగే.. త్వరలో మూడు కొత్త EVలు లాంచ్!

మహీంద్రా XUV 3X0 క్యాబిన్ కూడా దాదాపు పూర్తిగా మార్చారు. దీని డ్యాష్‌బోర్డ్ చాలా ఆకర్షణీయంగా ఉంది. ఇందులో మీరు 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.25-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ని చూస్తారు. దీనితో పాటు SUV బూట్ స్పేస్ కూడా 257 లీటర్ల నుండి 295 లీటర్లకు పెంచారు. దీనిలో డ్యూయల్ జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పనోరమిక్ సన్‌రూఫ్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్‌లు, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో కార్‌ప్లే, అలెక్సా ఇంటిగ్రేషన్, 7-స్పీకర్ హర్మాన్ కార్డాన్ సౌండ్ సిస్టమ్, వైర్‌లెస్ ఛార్జింగ్, కనెక్ట్ చేయబడిన కార్ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.

Advertisement

Also Read : డీజిల్, సీఎన్‌జీ, పెట్రోల్ హైబ్రిడ్ కార్లలో ఏది బెస్టో తెలుసా..?

భద్రత గురించి మాట్లాడితే 3XO టాప్ మోడల్‌కు 360 డిగ్రీ కెమెరా, లెవల్ 2 అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్ అంటే ADAS ఇచ్చారు. దీని సహాయంతో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్, లేన్ కీప్ అసిస్ట్, స్పాట్ మానిటరింగ్, స్టాండర్డ్ 6 ఎయిర్‌బ్యాగ్‌లు, చక్రాలకు డిస్క్ బ్రేక్‌లు, హిల్ డిసెంట్ కంట్రోల్, హిల్ హోల్డ్ అసిస్ట్ వంటి భద్రతా ఫీచర్లు, వాహనం డైనమిక్ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్ అందుబాటులో ఉంటాయి. మహీంద్రా XUV 3XO 1.2-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. ఇది 110 bhp పవర్, 200 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కాకుండా, 115 బిహెచ్‌పి పవర్, 300 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేసే 1.5-లీటర్ టర్బో డీజిల్ ఇంజన్ కూడా ఈ ఎస్‌యూవీలో అందుబాటులో ఉంది.

Related News

ఆధార్, ఫోన్ నంబర్‌తో.. మీ UAN నంబర్‌ను క్షణాల్లో కనుక్కోండిలా

ఆషాడ వేళ పసిడి షాక్.. ఆశలకి బ్రేక్ వేస్తూ మళ్ళీ పైపైకి బంగారం ధరలు!

ఎల్పీజీ గ్యాస్‌కు చెక్.. ఇకపై ఇథనాల్‌తో కుకింగ్, కేంద్రం సన్నాహాలు మొదలు

హోటల్ బిల్లులో సర్వీస్ ఛార్జ్.. 41 రెస్టారెంట్లపై కఠిన చర్యలు

పసిడి ప్రియులకు షాక్.. రెండు రోజులుగా మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు.. ఎంత పెరిగిందంటే?

Credit Cards: షాకింగ్ నిజాలు.. కొత్త క్రెడిట్ కార్డులు, సగానికి జెన్ జీలదే హవా, వారంతా అక్కడి వారే

ఆ 3 సెకన్ల వెనుక కోట్ల వ్యాపారం.. Mutual Funds యాడ్స్ స్పీడ్ వెనుక ఉన్న మైండ్ గేమ్ ఇదే!

కూతురు ఉందా? రూపాయి ఖర్చు లేకుండా ఆమె పెళ్లి, చదువు బాధ్యతలు తీరిపోయే సూపర్ స్కీమ్ ఇదే!

Big Stories

Advertisement
×