Fake Gold: దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగి పోతున్నాయి. భారతదేశంలో బంగారానికి డిమాండ్ చాలా ఎక్కువ. ముఖ్యంగా మగువలకు బంగారం అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే పెరుగుతున్న రేట్లను చూస్తుంటే.. ప్రస్తుతం బంగారం కొనాలంటే సామాన్యుడికి భారంగా మారింది. దీంతొ కొందరు ఫేక్ బంగారంతో తెగ మోసాలకు పాల్పడుతున్నారు. బంగారం ఆభరణాలపై స్వచ్ఛత ప్రమాణాలు పాటించకుండా మార్కెట్లో అమ్ముతున్నారు. స్వచ్ఛత ప్రమాణాలకు పాటించే హాల్ మార్క్‌ను వాడకుండా విక్రయాలు కొనసాగిస్తున్నారు.
దీంతో మార్కెట్‌లో నకిలీ బంగారం అనేది ఒక పెద్ద సమస్యగా మారింది. చాలామంది వ్యాపారులు నకిలీ బంగారాన్ని అసలైన బంగారంగా అమ్ముతూ.. ప్రజలను మోసం చేస్తున్నారు. భారతీయ ప్రమాణాల సంస్థ (బీఐఎస్) స్వచ్ఛత ప్రమాణాలు తప్పనిసరి పాటించాలని గైడ్ లైన్స్ ప్రకటించినా.. కొందరు వాటిని పట్టించుకోవడం లేదు. గతంలో జరిపిన తనిఖీల్లోనూ.. ప్రస్తుతం ఉన్న మొత్తం దుకాణాల్లో పది శాతమే పాటిస్తున్నట్టు అధికారులు గుర్తించారు.
బీఐఎస్ నిబంధనల ప్రకారం.. వినియోగదారుల్లో నమ్మకం కలిగించేందుకు.. గుర్తింపు పొందిన హాల్ మార్క్ పరీక్ష కేంద్రాల్లో చేయించుకుని.. ముద్ర వేసిన గోల్డ్ నే దుకాణాదారులు విక్రయించాలి. అయితే అలాంటి దుకాణాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా తక్కువగా ఉన్నాయట. చిన్న, మధ్యస్థ, కార్పొరేట్ వ్యాపారుల వరకు కొందరు ఇంట్రెస్ట్ చూపడం లేదట. అయితే హాల్ మార్క్ లైసెన్స్ లేకపోయినా.. టెస్ట్ చేయించకోకపోయినా సంబంధిత యజమానులకు జైలు శిక్షతో పాటు, బీఐఎస్ అధికారులు ఫైన్ వేస్తారు.
ఫేక్ బంగారాన్ని గుర్తించడం ఎలా?
అయితే నకిలీ బంగారాన్ని గుర్తించడానికి కొన్ని రకాల పద్ధతులు ఉన్నాయి. అవి ఏంటో మనం ఒకసారి క్లియర్ కట్‌గా చూద్దాం.
హాల్ మార్క్: నకిలీ బంగారాన్ని గుర్తించడానికి హాల్ మార్క్ ముద్ర చాలా యూజ్ అవుతోంది. నాణ్యత గల బంగారంపై హాల్ మార్క్ ముద్ర ఉంటుంది. ఇది బంగారం స్వచ్ఛతను సూచిస్తుంది.
అయస్కాంత: నాణ్యత గల బంగారాన్ని గుర్తించడంలో అయస్కాంత పరీక్ష కూడా ముఖ్యమైనది. అయస్కాంతాన్ని బంగారం దగ్గర ఉంచండి. నాణ్యత గల గోల్డ్‌ను అయస్కాంతం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆకర్షించుకోదు. కానీ, దాని రియాక్షన్ ను మనం తెలుసుకోవచ్చు. గోల్డ్ పూతతో కూడిన లోహాలు ఆకర్షించవు. ఐతే.. దీని ద్వారా 100 శాతం బంగారం నాణ్యతను టెస్ట్ చేయడం కష్టమే.
స్క్రాచ్ టెస్ట్: సిరామిక్ ప్లేట్‌పై గోల్డ్‌ను రఫ్ చేయండి. నాణ్యత గల బంగారం సిరామిక్ ప్లేట్‌పై గోల్డ్ లైన్ కనిపిస్తుంది. ఒకవేళ లైన్ కనిపించకపోతే.. అది ఫేక్ గోల్డ్ అని నిర్ధారించుకోండి. ఇంట్లో గోల్డ్ నిజమా? నకిలీదా? అని గుర్తించడానికి ఇది సులభమైన విధానం.
సాంద్రత టెస్ట్: గోల్డ్ వెయిట్, పరిమాణాన్ని మెసర్‌మెంట్ ద్వారా దాని సాంద్రతను సులభంగా తెలుసుకోవచ్చు. ఇలా చేయడం ద్వారా నకిలీ బంగారు ఆభరణాలు, అసలైన నాణ్యత గల గోల్డ్ కంటే కాస్త తక్కు సాంద్రతను కలిగి ఉంటాయి.
గోల్డ్ స్టాండర్డ్ టెస్ట్: దీన్ని మాత్రం గోల్డ్ ఎక్స్‌పర్ట్స్ మాత్రమే ఐడెంటిఫై చేస్తారు. కొన్ని రకాల కెమికల్స్ ద్వారా ఈ పరీక్ష చేస్తారు. వీటి వల్ల ఎక్కువగా నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దీని ఎక్స్‌పర్ట్స్ పర్యవేక్షణలో మాత్రమే చేయాలి.
ALSO READ: AP : సీమలో వజ్రాల వేట.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. ఎలా అమ్మాలి? ఎక్కడ అమ్మాలి?
జాగ్రత్తలు:
బంగారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. హాల్ మార్క్ ఉన్న గోల్డ్ ను కొనుగోలు చేయండి. బంగారం కొనే ముందు దాని స్వచ్ఛతను చెక్ చేసుకోండి. ఖరీదు విషయంలో అప్రమత్తంగా ఉండండి. బంగారం కొనే ముందు విశ్వసనీయమైన దుకాణాలను మాత్రమే సెలెక్ట్ చేసుకోండి.