BigTV English

OTT Movie : ఈ ఐలాండ్ కి వెళ్తే ప్రాణం పోయినట్లే … సీట్ ఎడ్జ్ అడ్వెంచర్ థ్రిల్లర్

OTT Movie : ఈ ఐలాండ్ కి వెళ్తే ప్రాణం పోయినట్లే … సీట్ ఎడ్జ్ అడ్వెంచర్ థ్రిల్లర్

OTT Movie : అడ్వెంచర్ థ్రిల్లర్ సినిమాలంటే పడి చచ్చే వారు ఎంతోమంది ఉన్నారు. అలాంటి మూవీ లవర్స్ కు కిక్ ఇచ్చే మూవీనే ఇది. అడుగడుగునా ప్రమాదాలతో, క్షణ క్షణం ఉత్కంఠభరితంగా సాగే ఈ మూవీ పేరేంటి? కథ ఏంటి? అనే వివరాల్లోకి వెళ్తే…


కథలోకి వెళ్తే…
ఈ మూవీ కథ అంతా “హెల్ ఐలాండ్” అనే సీక్రెట్ ద్వీపంలో జరుగుతుంది. ఇక్కడ భారీ మొసళ్లు, ఒక మెగా క్రోకోడైల్ ఉంటాయి. కథ ప్రారంభంలో ఒక ఓడ, అందులో నుంచి కొంతమంది సర్వైవర్లు ఈ ద్వీపంలోకి అడుగు పెడతారు. అయితే అక్కడ ఉండే ప్రమాదాల గురించి అవగాహన లేకపోవడంతో వాళ్ళంతా భారీ మొసళ్ల దాడికి గురవుతారు. తర్వాత ఒక చిన్న గ్రామంలో ఒక బాలుడు భారీ ఉప్పు నీటి మొసలి దాడికి గురవుతాడు. దీనితో స్థానిక నిపుణుడు లువో హాన్ (లీ గ్వాంగ్బిన్), ఒక క్రోకోడైల్ రీసెర్చర్ ఈ సంఘటనను “హెల్ ఐలాండ్”తో ముడి పెట్టి చూస్తారు.

మరోవైపు కాంగ్ మింగ్జు (గ్వో జివెన్) అనే ఒక రిచ్ వ్యాపారవేత్త తన సోదరుడు జీ హావ్, ఒక యంగ్ బయాలజిస్ట్ హెల్ ఐలాండ్ సమీపంలో మిస్ అయ్యారని, వాళ్ళను వెతకడానికి హెల్ప్ కావాలని లువోని సహాయం కోరుతుంది. లువో గతంలో ఈ ద్వీపం నుండి తప్పించుకున్న ఏకైక వ్యక్తి. అందుకే అతన్నే హెల్ప్ అడుగుతుంది. కానీ అతనేమో మొదట నిరాకరిస్తాడు. ఆ తర్వాత సహాయం చేయడానికి ఒప్పుకుంటాడు.


నెక్స్ట్ ఒక రెస్క్యూ టీమ్‌తో హెల్ ఐలాండ్‌కు వెళ్తాడు. వీళ్ళంతా కలిసి ఒక కార్గో విమానం నుండి పారాచూట్ లేకుండా ద్వీపంలోకి దూకుతారు. ఇక ఈ అడవిలో భారీ మొసళ్లు, మాంసాన్ని తినే మొక్కలు, “సింగింగ్” బగ్స్ (మనుషుల గొంతును అనుకరించే కీటకాలు) వంటి ప్రమాదాలు ఉంటాయి. వాటన్నింటినీ ఎదుర్కొన్న తరువాత ఒక రహస్య భూగర్భ పరిశోధన కేంద్రాన్ని కనుగొంటారు, ఇక్కడ మెగా క్రోకోడైల్ క్యాన్సర్ నివారణ ఔషధం కోసం రిసెర్చ్ జరుగుతుంది. కానీ ఈ క్రోకోడైల్ కు ఊహించని అసాధారణ శక్తులు ఉంటాయి. మరి ఆ భయంకరమైన జీవిని లువో టీం ఎలా ఎదుర్కొంది ? దాని నుంచి ఎలా తప్పించుకున్నారు? చివరికి ఏం జరిగింది? అనే విషయాలను తెరపై చూడాల్సిందే.

Read Also : గురువు గారి రాసలీలలు … తీగలాగితే డొంకంతా కదిలే …

ఏ ఓటీటీలో ఉందంటే?
ఇప్పుడు మనం చెప్పుకుంటున్న అడ్వెంచరస్ మూవీ పేరు ‘మెగా క్రోకోడైల్’ (Mega Crocodile). 2019లో రిలీజ్ అయిన ఈ చైనీస్ సైన్స్ ఫిక్షన్ హర్రర్-అడ్వెంచర్ సినిమా ఫుగుయ్ దర్శకత్వంలో రూపొందింది. లీ గ్వాంగ్బిన్, గ్వో జివెన్, చెన్ లిన్షెంగ్, గ్వాన్ జియాంగ్యున్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ, ఇంగ్లీష్ డబ్బింగ్‌లలో అందుబాటులో ఉంది. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో ఈ మూవీ అందుబాటులో ఉంది.

Related News

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో … ఒక్కడితో సరిపెట్టలేక ….

OTT Movie : పని మనిషితో రాసలీలలు… ఒకరి భార్యతో మరొకరు… అన్నీ అవే సీన్లు… లాస్ట్ ట్విస్ట్ హైలెట్ మావా

Oho Enthan Baby OTT : ఓటీటీలోకి వచ్చిన రొమాంటిక్ లవ్ స్టోరీ.. ఎక్కడ చూడొచ్చంటే..?

OTT Movie : మనిషి మాంసాన్ని ఎగబడి తినే గ్రామం… ఈ భార్యాభర్తల యాపారం తెలిస్తే గుండె గుభేల్

Big Stories

×