E-Paper
Advertisement

IND VS AUS 2nd Test: పింక్ బాల్ టెస్ట్ టైమింగ్స్ లో మార్పులు.. ఫ్రీగా ఎక్కడ చూడాలంటే..?

IND VS AUS 2nd Test:  పింక్ బాల్ టెస్ట్ టైమింగ్స్ లో మార్పులు.. ఫ్రీగా ఎక్కడ చూడాలంటే..?

IND VS AUS 2nd Test: టీమ్ ఇండియా ( Team India) వర్సెస్ ఆస్ట్రేలియా ( Australia ) మధ్య ప్రస్తుతం టెస్ట్ సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ లో ( Border Gavaskar Trophy 2024/25 ) భాగంగా.. టీమ్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య ప్రస్తుతం 5 టెస్టుల సిరీస్ జరుగుతోంది. ఈ మేరకు ఆస్ట్రేలియా లో ( Australia ) అడుగుపెట్టిన టీమిండియా ( Team India)… పెర్త్ టెస్ట్ లో విజయం సాధించింది. పెద్ద టెస్టులో 295 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను మట్టికరిపించింది టీమిండియా. అంతకుముందు మన సొంత గడ్డపై న్యూజిలాండ్ చేతిలో టీమిండియా ( Team India) దారుణంగా ఓడిపోయింది.

ALSO READ: Sachin – Vinod Kambli: ఒకప్పుడు దోస్తులు..మిత్రుడినే గుర్తుపట్టలేకపోయిన కాంబ్లీ..!

మూడు టెస్టులు ఆడితే మూడు టెస్టుల్లోనూ దారుణంగా ఓడిపోయి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు ( ICC World Test Championship ) దూరమయ్యేలా టీమిండియా ( Team India) కనిపించింది. అయితే ఈ ఫోబియాలో ఉన్న టీమిండియా… ఆస్ట్రేలియా గడ్డపై అడుగు పెట్టి మొదటి టెస్టులో విజయం సాధించింది. అయితే మొదటి టెస్టులో.. ఆస్ట్రేలియా పైన 295 పరుగుల తేడాతో టీమిండియా ( Team India) విజయాన్ని అందుకోవడం గమనార్హం.

ఇక ఇప్పుడు అదే ఊపుతో టీమిండియా ( Team India) రంగం సిద్ధం చేసుకుంది. రెండు టెస్టులో కూడా విజయం సాధించాలని అనుకుంటోంది. అడిలైడ్ వేదికగా ఈ పింక్ బాల్ టెస్టు జరగనుంది. అయితే పెడుతూ టెస్ట్ మ్యాచ్ తరహాలో ఈ మ్యాచ్ జరగదు. ఇది పూర్తిగా డే అయిన నైట్ మ్యాచ్ అన్నమాట. ఈ మ్యాచ్ ఉదయం 9:30 ప్రాంతంలో ప్రారంభం అవుతుంది. పెర్త్ టెస్ట్ ఉదయం ఏడున్నర గంటల ప్రాంతంలో మన భారత కాలమానం ప్రకారం ప్రారంభమైంది.

కానీ ఇప్పుడు రెండవ పింక్ బాల్ టెస్ట్ మాత్రం ఉదయం 9:30 గంటల ప్రాంతంలో ప్రారంభం కానుంది. డిసెంబర్ 6వ తేదీ అంటే రేపటి నుంచి పదో తేదీ వరకు ఈ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్లను మనం డిడి స్పోర్ట్స్ లో కూడా ఉచితంగా చూడవచ్చు. ఇండియా ( Team India) వర్సెస్ ఆస్ట్రేలియా ( Team India)మధ్య టెస్టులు జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అభిమానులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. దీంతో డిడి స్పోర్ట్స్ లో కూడా ఈ మ్యాచులు ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. హాట్‌ స్టార్‌ లో కూడా టీమ్ ఇండియా ( Team India) వర్సెస్ ఆస్ట్రేలియా ( Australia ) మధ్య ప్రస్తుతం జరుగుతున్న టెస్ట్‌ సిరీస్‌ చూడొచ్చు.

Also Read: IND vs AUS 2nd Test: కోహ్లీ, రాహుల్‌కు షాక్.. రెండో టెస్టుకు తుదిజట్టు ఇదే!

జట్ల అంచనా

ఆస్ట్రేలియా జట్టు (రెండో టెస్టు కోసం): పాట్ కమిన్స్ (సి), స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ (WK), జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుస్‌చాగ్నే, నాథన్ లియాన్, మిచ్ మార్ష్, నాథన్ మెక్‌స్వీనీ

భారత జట్టు: రోహిత్ శర్మ (సి), జస్ప్రీత్ బుమ్రా (విసి), యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, ధృవ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్

Related News

వైభ‌వ్ ఇంకా స్కూల్ లోనే ఉంటే బాగుండు.. వాడికి బౌలింగ్ వేయాలంటేనే భ‌య‌మెస్తోంది

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

టీమిండియాకు బిగ్ షాక్‌..బంగ్లాదేశ్ లోనే ఆసియా కప్ 2027, షెడ్యూల్ ఇదే

ఎలిమినేట‌ర్ లో ఓడిపోయిన‌ SRHకు ఊపిరిపోసిన పాకిస్తాన్ ప్లేయ‌ర్

రెండోసారి ఛాంపియ‌న్ గా RCB..ప్ర‌మాదంలో సూర్య‌, శ్రేయ‌స్ అయ్య‌ర్ భ‌విష్య‌త్తు !

Tanveer Ahmed: విరాట్ కోహ్లీ మ‌గాడైతే, పాకిస్తాన్ పిచ్ ల‌పై ఆడి చూపించాలి

Big Stories

×