BigTV English

Bitcoin Price Record: బిట్ కాయిన్ ఆల్ టైమ్ రికార్డ్.. మళ్లీ లక్ష పది వేల డాలర్లకు చేరువలో

Bitcoin Price Record: బిట్ కాయిన్ ఆల్ టైమ్ రికార్డ్.. మళ్లీ లక్ష పది వేల డాలర్లకు చేరువలో

Bitcoin Price Record| ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో క్రిప్టో కరెన్సీ అయిన బిట్‌కాయిన్ సంచలనాలు సృష్టిస్తోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలిచిన తర్వాత బిట్‌కాయిన్ రేటుకు రెక్కలు వచ్చాయి. ఇలాంటి క్రిప్టోకరెన్సీలకు తను పూర్తిగా మద్దతుగా నిలుస్తానని, భవిష్యత్తులో అమెరికాను ‘క్రిప్టో కరెన్సీకి రాజధాని’గా మారుస్తానని ట్రంప్ ప్రకటించారు. దీంతో బిట్‌కాయిన్ మరింత పాపులారిటీ సంపాదించి, తాజాగా ఒక బిట్‌కాయిన్ ధర ఏకంగా లక్ష 10 వేల డాలర్లకు చేరువలో ఉంది. అయితే జనవరి 2025లో ఒక బిట్ కాయిన్ ధర 1,08,955 డాలర్ల పలికి అప్పుడు ఆల్ టమై హై రికార్డ్ గా నమోదు అయింది. అయితే ఆ తరువాత ఒడిదొడకులు ఎదుర్కొంటే వచ్చింది. ప్రస్తుతం ఆ రికార్డ్ ధరను కూడా మించి కొత్త రికార్డ్ సృష్టించింది.


అమెరికాలోని నాస్ డాక్ స్టాక్ మార్కెట్ టెక్ స్టాక్స్ జాబితాలో బుధవారం బిట్ కాయిన్ విలువ 30 శాతం జంప్ చేసింది. అంతకుముందు ఏప్రిల్ నెల మొత్తం బిట్ కాయిన్ ధర క్షిణిస్తూ వచ్చింది. బిట్ కాయిన్.. ఒక హై రిస్క్, హై రివార్డ్ స్టాక్ గా పరిగణించబడింది. అమెరికా డాలర్ క్షీణించడంతో క్రిప్టో కరెన్సీలో బిట్ కాయిన ధర పైపైకి పాకుతోంది.

ఇలాంటి సమయంలో.. భారతీయులు కూడా బిట్‌కాయిన్‌పై ఆసక్తి చూపుతున్నారు అయితే భారత్‌లో బిట్‌కాయిన్ వంటి క్రిప్టోకరెన్సీ న్యాయబద్ధమేనా? కాదా? అని చాలామంది అనుమానపడుతున్నారు. అలాంటి వారికి సమాధానం ఇప్పుడు చూద్దాం.


భారత్‌లో బిట్‌కాయిన్‌ ఇల్లీగల్ ఏమీ కాదు. ఇలాంటి క్రిప్టోకరెన్సీ వచ్చిన కొత్తల్లో రిజర్వ్ బ్యాంక్ ఇండియా (ఆర్బీఐ) వీటి వల్ల చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని భావించింది. అందుకే క్రిప్టో కరెన్సీలన్నింటినీ బ్యాన్ చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఈ విషయం సుప్రీంకోర్టుకు వెళ్లినప్పుడు ఈ నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు అత్యున్నత న్యాయస్థానం ప్రకటించింది.

అందుకని క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెడితే అంతా లాభమే అనుకోకండి. సుప్రీం కోర్టు వీటిపై నిషేధం ఎత్తేయగానే ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఇలాంటి డిజిటల్ కరెన్సీలపై లాభాలు సంపాదిస్తే ఏకంగా 30 శాతం వడ్డీ కట్టాలని రూల్ తెచ్చింది. అంతేకాదు, 50 వేల రూపాయల కన్నా పెద్ద క్రిప్టో ట్రాన్సాక్షన్ చేస్తే దానిపై మళ్లీ ఇంకో ఒక శాతం టీడీఎస్ (ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్)ఉంటుందని తెలిపింది. కొన్ని ప్రత్యేక కేటగిరీల్లో పది వేల రూపాయల ట్రాన్సాక్షన్‌పై కూడా టీడీఎస్ ఉంటుందని చెప్పింది.

క్రిప్టోలో లాభాలు వచ్చినా రాకపోయినా సరే ట్రాన్సాక్షన్స్‌పై టీడీఎస్ మాత్రం తప్పనిసరి అని పేర్కొంది. అంతేకాదు, మీ దగ్గర బిట్‌కాయిన్, ఇథీరియం అనే రెండు రకాల క్రిప్టో కరెన్సీలు ఉన్నాయనుకోండి. ఇథీరియంలో మీకు భారీగా నష్టాలు వచ్చాయి. బిట్‌కాయిన్‌లో కొంచెం లాభం వచ్చింది. అప్పుడు ఇథీరియంలో నష్టాలు చూపించి, బిట్‌కాయిన్‌పై కట్టే ట్యాక్స్‌లో కన్సెషన్స్ తీసుకోవడం కూడా కుదరదు.

Also Read: 10 ఏళ్ల క్రితం రూ.5900 కోట్లు చెత్తలో పడేసిన జంట.. ఇప్పుడు వెతికిపెట్టాలంటూ కోర్టులో కేసు

ఇలాంటి మైనస్‌లు ఉన్నా కూడా క్రిప్టోలో పెట్టుబడులు పెట్టాలని అనుకుంటే.. ఒక సర్టిఫైడ్ క్రిప్టో ఎక్స్‌ఛేంజ్‌ను ఎంచుకొని, మీ కేవైసీ రిజిస్టర్ చేయించుకోవాలి. ఆ తర్వాత డబ్బులు డిపాజిట్ చేసి, క్రిప్టో వాలెట్స్‌లో మీ డిజిటల్ కరెన్సీని జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఆ వాలెట్స్ నుంచే క్రిప్టో ట్రాన్సాక్షన్ చెయ్యగలం.

అలాగే ఒకవేళ మీ క్రిప్టో కరెన్సీని అమ్మేయాలని అనుకుంటే.. దానిపై కూడ టీడీఎస్ చార్జ్ చేస్తారు. ట్యాక్స్ డిడక్షన్స్ తర్వాత మిగిలిన డబ్బు మీ బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. అయితే క్రిప్టోలో పెట్టుబడులు పెట్టే ముందు దాంట్లో చాలా రిస్క్‌లు ఉంటాయని గుర్తుంచుకోవాలి. డిజిటల్ కరెన్సీ రేట్లు ఎప్పుడు పెరుగుతాయో? ఎప్పుడు తగ్గుతాయో చెప్పలేం. అలాగే కొన్ని కొందరు హ్యాకర్లు క్రిప్టో కరెన్సీనే టార్గెట్ చేస్తుంటారు. వారి నుంచి కూడా మన కరెన్సీని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇక స్కామ్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. వీటన్నింటి నుంచి ఎలాగోలా మన సొమ్మును కాపాడుకున్నా.. డిజిటల్ కరెన్సీ నియమ నిబంధనల్లో ఏ దేశం ఎప్పుడు ఎలాంటి మార్పులు చేస్తుందో? ఎవరూ చెప్పలేరు.

Related News

D-Mart: కొనేది తక్కువ, దొంగతనాలు ఎక్కువ.. డి-మార్ట్ యాజమాన్యానికి కొత్త తలనొప్పి!

JIO Super Plans: జియో నుంచి సూపర్ ఆఫర్లు.. ఏది ఫ్రీ, ఏది బెస్ట్ అంటే?

SEBI – Foreign Funds: భారతీయ ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్.. విదేశీ ఫండ్స్‌కి SEBI గ్రీన్ సిగ్నల్

ICICI Bank New Rules: కస్టమర్లకు ICICI బిక్ షాక్.. కనీస బ్యాలెన్స్ రూ.10 వేలు కాదు.. అంతకుమించి.. పేదోళ్ల సంగతి ఏంటో?

Digital Rent Agreement: ఈ రూల్ తెలియకుండా ఇల్లు అద్దెకు ఇస్తే రూ. 5000 జరిమానా కట్టక తప్పదు..

Real Estate: ఈ విషయాలు తెలియకుండా ‌ఫార్మ్ లాండ్స్ కొంటే భారీ నష్టం తప్పుదు..అడ్వర్టయిజ్‌మెంట్స్ చూసి మోసపోకండి..

Big Stories

×