BigTV English

Waterfalls in India: తలకోన To దూద్ సాగర్, దేశంలో కనువిందు చేసే జలపాతాలు!

Waterfalls in India: తలకోన To దూద్ సాగర్, దేశంలో కనువిందు చేసే జలపాతాలు!

Beautiful Waterfalls: అందమైన పర్వతాల నుంచి ఎడారుల వరకు, దట్టమైన అరణ్యాల నుంచి బీచ్‌ల వరకు.. భారత్ సహజ అద్భుతాలకు నిలయం. వర్షాకాలం వచ్చిందంటే.. దేశ వ్యాప్తంగా ఉన్న జలపాతాలు కనువిందు చేస్తాయి. పర్యాటకులను కట్టిపడేస్తాయి. ఇండియాలోని బెస్ట్ వాటర్స్ ఫాల్స్ గురించి ఇప్పుడు చూద్దాం..


⦿ నోహ్కాలికై జలపాతం: మేఘాలయ

తూర్పు భారతంలో ఉంది ఈ అందమైన జలపాతం.  భూటాన్- బంగ్లాదేశ్ మధ్యలో ఉంటుంది. దేశంలోనే అత్యంత ఎత్తైన జలపాతంగా గుర్తింపు తెచ్చుకుంది. దీని ఎత్తు ఏకంగా 1,110 అడుగులు ఉంటుంది.  ఈ జలపాతం ఏడాది అంతా జాలువారుతూ కనిపించినప్పటికీ, మే నుంచి సెప్టెంబర్ మధ్యలో వర్షాకాల సమయంలో మరింత అందంగా కనిపిస్తుంది.


⦿ నోహ్స్ంగిథియాంగ్ జలపాతం: మేఘాలయ

మేఘాలయలో ఉన్న మరో అద్భుతమైన వాటర్ ఫాల్ ఇది.  ఏడు విభిన్న ప్రవాహాలుగా విడిపోయి కనిపిస్తుంది. 1,033 అడుగుల ఎత్తులో ఉన్న సున్నపు రాయి కొండ మీది నుంచి దుంకుతుంది. ఈ వాటర్ ఫాల్ కూడా వర్షాకాలంలో మరింతగా ఆకట్టుకుంటుంది.

⦿ చిత్రకూట్ జలపాతాలు: చత్తీస్‌ గఢ్

దేశంలోని అందమైన వాటర్ ఫాల్స్ లో ఇవి కూడా ఒకటి. మొత్తం 980 అడుగుల విస్తీర్ణంలో దేశంలోనే అత్యంత విశాలమైన జలపాతంగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ వాటర్ ఫాల్స్ గుర్రపు నాడా ఆకారంలో కనిపిస్తతాయి. జూలై నుంచి సెప్టెంబర్ వరకు కొండ మీది నుంచి నీరు అత్యంత వేగంగా ప్రయాణిస్తోంది. ఈ ప్రదేశాన్ని చిన్న నయాగరా జలపాతంగా పిలుస్తారు.

⦿ జోగ్ జలపాతం: కర్ణాటక

ఇది దేశంలోనే రెండో అతి ఎత్తైన జలపాతం. దాదాపు 830 అడుగుల ఎత్తులో ఉంటుంది. నాలుగు భాగాలుగా నీళ్లు కిందికి దుంకుతాయి. పాల ధారల్లాంటి నీటి ప్రవాహాలు జీవితాంతం మనసులో అలా నిలిచిపోతాయి.

⦿ దూద్‌ సాగర్ జలపాతాలు: గోవా

గోవా, కర్నాటక సరిహద్దుల్లో ఉంటుంది. దీనిని పాల సముద్రంగా పిలుస్తారు. 1,017 అడుగుల పొడవు, 100 అడుగుల వెడల్పుతో అద్భుతంగా ఉంటుంది. ఈ జలపాతం అనేక ప్రవాహాలుగా విడిపోతుంది. పొగమంచులా పడే నీటి తుంపరలు ఆహా అనిపిస్తాయి.  కాలి నడక ద్వారా లేదంటే షేర్డ్ జీపు ద్వారా జలపాతం అడుగు భాగానికి చేరుకునే అవకాశం ఉంటుంది.

⦿ తలకోన జలపాతం, ఆంధ్రప్రదేశ్

తలకోనలోని 270 అడుగుల జలపాతం ఎత్తులో ఎంతో అందంగా కనిపిస్తుంది. చిత్తూరులోని శ్రీ వెంకటేశ్వర జాతీయ ఉద్యానవనం లోపల ఉన్న ఈ జలపాతం, ప్రశాంతమైన, అటవీ వాతావరణంలో ఆకట్టుకుంటుంది. దాదాపు 2 కిలోమీటర్ల వరకు పచ్చని ప్రకృతిని చీల్చుకుంటూ జాలువారుతూ వస్తుంది. రాతి ముఖాల వెంబడి దుంకుతూ ఆకట్టుకుంటాయి.

⦿ హోగేనక్కల్ జలపాతం, తమిళనాడు

హోగేనక్కల్ జలపాతం బెంగళూరుకు దక్షిణంగా అటవీ ప్రాంతంలో ఉంటుంది. ఈ అద్భుతమైన జలపాతం కావేరి నది నుంచి ప్రవహిస్తుంది. 66 అడుగుల ఎత్తులో ఉన్న కొండ చరియల నుంచి నీళ్లు జారిపడుతూ ఉంటాయి.  గుండ్రటి వెదురు పడవలో వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్లి చాలా మంది నీళ్లలో ఈత కొడుతుంటారు.

⦿ అతిరప్పిల్లి జలపాతం, కేరళ

కేరళలో ఈ జలపాతం ఉంటుంది. 80 అడుగుల పొడవు, దాదాపు 330 అడుగుల వెడల్పుతో ఉంటుంది. విశాలమైన కొండ చరియలు, పచ్చని పరిసరాలు, గర్జిస్తూ దునికే నీటి ప్రవాహం ఆకట్టుకుంటుంది. ఇక్కడ చాలా సినిమా షూటింగ్స్ జరిగాయి.

Read Also: జపాన్ లో ఆహా అనిపించే అద్భుతమైన ఎయిర్ పోర్టులు, చూస్తే, ఆశ్చర్యపోవడం పక్కా!

Related News

PR to Indians: అమెరికా వేస్ట్.. ఈ 6 దేశాల్లో హాయిగా సెటిలైపోండి, వీసా ఫీజులు ఎంతంటే?

Local Train: సడెన్‌ గా ఆగిన లోకల్ రైలు.. దాని కింద ఏం ఉందా అని చూస్తే.. షాక్, అదెలా జరిగింది?

Metro Warning: కోచ్ లోపల రీల్స్ చేస్తే తోలు తీస్తాం, మెట్రో స్ట్రాంగ్ వార్నింగ్!

Jaffar Express Blast: రైళ్లే టార్గెట్ గా పేలుళ్లు, ఎగిరిపడ్డ బోగీలు, పదుల సంఖ్యలో ప్రయాణీకులు..

President Special Train: ప్రత్యేక రైల్లో మధురైకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఇంతకీ ఆ ట్రైన్ ప్రత్యేకత ఏంటో తెలుసా?

Vande Bharat Trains: 9 వందేభారత్ రైళ్లు ప్రారంభం, తెలుగు రాష్ట్రాలకు ఎన్ని అంటే?

Vande Bharat Sleeper: ఒకటి కాదు.. ఒకేసారి రెండు.. వచ్చేస్తున్నాయ్ వందే భారత్ స్లీపర్ రైళ్లు!

Dasara Special Trains: దసరా వేళ రైల్వే గుడ్ న్యూస్, ముంబై నుంచి కరీంనగర్ కు స్పెషల్ ట్రైన్!

Big Stories

×