Telugu Director :ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో.. మొదటి సినిమాతోనే హిట్ కొట్టి, హిట్ దర్శకులలో చోటు సంపాదించుకున్న డైరెక్టర్ వెంకీ కుడుముల (Venky kudumula) ప్రస్తుతం గడ్డుకాలం ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే ఆయనతో ఏ ఒక్క తెలుగు హీరో కూడా సినిమా చేయడానికి ముందుకు రావడం లేదు. సడన్ వెంకీ కుడుములకు ఈ పరిస్థితి రావడానికి కారణం ఏంటి..? ఎందుకు టాలీవుడ్ హీరోలు ఈయనను పట్టించుకోవడం లేదు అనే విషయానికి వస్తే.. సినీ ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది డైరెక్టర్లు సినిమాలకు డైరెక్షన్ వహించే కంటే ముందే సహా రచయితలుగా, సహదర్శకులుగా కొన్ని సినిమాలకు వర్క్ చేసి ఉంటారు. అలాంటి వారిలో డైరెక్టర్ వెంకీ కుడుముల కూడా ఒకరు.
రచయిత నుంచి దర్శకుడిగా మారిన వెంకీ కుడుముల..
ఈయన ఇండస్ట్రీకి వచ్చే ముందు కొంతమంది దర్శకుల దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు. అలా మొదట డైరెక్టర్ తేజ తెరకెక్కించిన ‘నీకు నాకు డాష్ డాష్’ అనే సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు. ఆ తర్వాత రామ్ చరణ్ (Ram Charan) హీరోగా చేసిన ‘తుఫాన్’ మూవీకి సహ రచయితగా చేశారు.. అలాగే అఆ, జాదుగాడు వంటి చిత్రాలకు కూడా అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసిన వెంకీ కుడుముల నాగశౌర్య (Naga Shourya), రష్మిక మందన్న (Rashmika Mandanna) కాంబోలో వచ్చిన ‘ఛలో’ మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఫస్ట్ టైం దర్శకుడిగా పరిచయమయ్యారు. ఇక మొదటి సినిమానే హిట్ కొట్టడంతో వెంకీ కుడుముల రేంజ్ మారిపోయింది.ఆ తర్వాత మళ్లీ రష్మిక మందన్నా హీరోయిన్ గా, నితిన్ (Nithin) ని హీరోగా పెట్టి ‘భీష్మ’ అనే సినిమాను తెరకెక్కించారు.. బయోఫామ్ బ్యాక్ గ్రౌండ్ లో తెరకెక్కిన భీష్మ మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం అందుకుంది. దాంతో వెంకీ కుడుముల టాలీవుడ్ లో తిరుగులేని డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు.
వెంకీ కుడుములకు అవకాశం ఇవ్వని తెలుగు హీరోలు.. కారణం
ఇదే జోష్ లో మళ్లీ నితిన్, రష్మిక మందన్నా కాంబోలో రాబిన్ హుడ్ మూవీని ప్రకటించారు. అయితే ఈ సినిమాకి హీరోయిన్ గా మొదట రష్మిక ఓకే చేసినప్పటికీ.. ఆ తర్వాత వేరే సినిమాల్లో బిజీగా ఉన్న కారణంగా ఆమె సినిమా నుండి తప్పుకోవడంతో టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ అయినటువంటి శ్రీలీల (Sree Leela) ను ఇందులో హీరోయిన్ గా తీసుకున్నారు. అలా ఎన్నో అంచనాలతో వచ్చినటువంటి రాబిన్ హుడ్ (Robinhood ) మూవీ బాక్సాఫీస్ వద్ద అభిమానులను నిరాశ పరిచింది. ముఖ్యంగా చాలా రోజుల నుండి హిట్ కోసం ఎదురుచూస్తున్న నితిన్ ని కూడా ఈ సినిమా దెబ్బ కొట్టిందని చెప్పుకోవచ్చు. ఇక రాబిన్ హుడ్ మూవీ ఫ్లాప్ అవ్వడంతో వెంకీ కుడుములతో సినిమా చేయడానికి ఏ హీరోలు కూడా ముందుకు రావడం లేదు. ముఖ్యంగా రాబిన్ హుడ్ మూవీ కంటే ముందు కొంతమంది టాలీవుడ్ హీరోలు వెంకీ కుడుములతో వర్క్ చేయాలనుకున్నారు. కానీ ఎప్పుడైతే రాబిన్ హుడ్ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ ఫ్లాఫ్ అయిందో ఆ తర్వాత వెంకీ కుడుములకి హ్యాండ్ ఇచ్చారట. అలా ఒక్క ప్లాఫ్ తో వెంకీ కుడుముల గ్రాఫ్ మొత్తం పడిపోయింది. అయినా సరే ఈయన పైన నమ్మకంతో ఒకరో ఇద్దరో హీరోలు ముందుకు వచ్చినా.. ఈయన రాసుకున్న కథలు చెత్తగా ఉండడంతో ఆ కథలు నచ్చక వెంకీ కుడుములకి నో చెబుతున్నారట. ఇక మొత్తానికైతే ఒక్క ఫ్లాప్ తో వెంకీ కుడుముల మూటముళ్లు సర్దేయాల్సిన టైం వచ్చిందని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.
ALSO READ:Actress Poojitha: తొలిసారి విడాకులపై స్పందించిన పూజిత.. ఏకంగా 9 మందితో ఎఫైర్..