Indian Railways: గత కొంత కాలంగా రైళ్లలో దోపిడీలు ఎక్కువవుతున్నాయి. గత రెండు నెలల్లోనే దేశ వ్యాప్తంగా సుమారు 10 దోపిడీ కేసులు నమోదయ్యాయి. తెలంగాణ, ఏపీలోనూ రైళ్లను ఆపి దొంగలు దోపిడీలకు పాల్పడ్డారు. ఈ దోపిడీలకు సంబంధించి కేసులు నమోదు అయినప్పటికీ, దొంగలను పట్టుకున్న దాఖలాలు కనిపించడం లేదు. సుమారు 20 రోజుల క్రితం హిమాచల్ ఎక్స్ ప్రెస్ లోని జరిగిన దోపిడీకి సంబంధించి AC ఫస్ట్ క్లాస్ కోచ్‌లోని ప్రయాణీకుడు సచిన్ జైన్ రైల్వే నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. కురుక్షేత్ర, కర్నాల్-పానిపట్ మధ్య రైళ్లలో దోపిడీ దొంగల ముఠా తరచుగా దొంగతనాలకు పాల్పడుతుందని ఆరోపించారు. రైల్వే అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ దోడిపీలు కొనసాగుతున్నాయని, ప్రయాణీకుల విలువైన వస్తువులు దొంగతనం జరుగుతున్నాయన్నారు.
ఆగష్టు 2న హిమాచల్ ఎక్స్ ప్రెస్ లో దోపిడీ
ఉత్తరప్రదేశ్ లోని గ్రేటర్ నోయిడా నివాసి సచిన్ జైన్, ఆగస్టు 2న హిమాచల్ ఎక్స్ ప్రెస్ రైలు దోపిడీ జరిగింది. ఈ ఘటనకు సంబంధించి సచిన్ జైన్ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆగస్టు 1 తాను పంజాబ్ లోని రూప్ నగర్ నుంచి ఢిల్లీకి హిమాచల్ ఎక్స్ ప్రెస్ లో ఎక్కానని జైన్ చెప్పారు. ఆ మధ్య రాత్రి 2:30 గంటల ప్రాంతంలో రైల్లో ప్రయాణీకులు నిద్రిస్తున్నప్పుడు, కొంతమంది రైలులోకి ప్రవేశించి విలువైన వస్తువులను దోచుకెళ్లినట్లు వెల్లడించారు. ఇంతపెద్ద ఘటన జరుగుతున్నప్పటికీ కనీసం రైల్వే పోలీసులు స్పందించలేదని ఆరోపించారు.
Read Also: తెలంగాణలో కొత్త రైల్వే స్టేషన్.. ప్రారంభం ఎప్పుడంటే?
ఇంతకీ సచిన్ జైన్ ఫిర్యాదులో ఏం చెప్పారంటే?
హిమాచల్ ఎక్స్ ప్రెస్ దోపిడీ గురించి సచిన్ జైన్ గురించి కీలక విషయాలు వెల్లడించారు. “అర్థరాత్రి వేళ రైల్వే కోచ్ లోకి చొరబడి దోపిడీ దొంగలు బీభత్సం చేశారు. ఇంత గందరగోళం జరుగుతున్నా కోచ్ లోకి TTE (రైలు టికెట్ ఎగ్జామినర్), RPF (రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్) సిబ్బంది ఎవరూ లేరు. దుండగుల రైలులో ఎలాంటి భయం లేకుండా స్వేచ్ఛగా తిరుగుతూ నాతో సహా అనేక మంది ప్రయాణికులను దోచుకున్నారు. నేను రూ.60,000 విలువైన ల్యాప్ టాప్, ఛార్జర్ తో కూడిన బ్రౌన్ ల్యాప్ టాప్ బ్యాగ్ ను పోగొట్టుకున్నాను. అందులో కీలకమైన బిజినెస్ డేటా, రూ.2,19,000 నగదు, రూ.14,000 విలువైన కళ్లద్దాలు, పెన్ డ్రైవ్, పవర్ బ్యాంక్ సహా పలు వస్తువులు ఉన్నాయి” అని సచిన్ జైన్ వెల్లడించారు.
Read Also: అరే బాబూ.. అది రైల్వే టాయిలెట్.. ఓయో రూమ్ కాదు రా!