BigTV English

BMW R 12 And R 12 Nine T Bikes Launched: దడ పుట్టించే ధర వద్ద బీఎండబ్ల్యూ కొత్త బైక్స్ లాంచ్.. రైడర్లకు అనుభూతిని అందించే ఫీచర్లు..!

BMW R 12 And R 12 Nine T Bikes Launched: దడ పుట్టించే ధర వద్ద బీఎండబ్ల్యూ కొత్త బైక్స్ లాంచ్.. రైడర్లకు అనుభూతిని అందించే ఫీచర్లు..!

BMW R 12 And R 12 Nine T Bikes Launched: ప్రముఖ బైక్ తయారీ సంస్థ బీఎండబ్ల్యూ మోటోరాడ్ తాజాగా తన లైనప్‌లో ఉన్న రెండు కొత్త బైక్‌లను మార్కెట్‌లో లాంచ్ చేసింది. ‘బీఎండబ్ల్యూ ఆర్ 12, బీఎండబ్ల్యూ ఆర్ 12 నైన్‌టి రోడ్‌స్టర్’ పేర్లను వీటిని మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఈ రెండు బైక్‌లు వాటి లుక్, డిజైన్, ఫీచర్లతో ఆకట్టుకుంటున్నాయి. అయితే వీటి ధరలు మాత్రం అమాంతంగా ఆకాశన్నంటాయనే చెప్పాలి. తాజాగా లాంచ్ అయిన ఈ బైక్‌ల ధరల విషయానికొస్తే.. అందులో బీఎండబ్ల్యూ ఆర్ 12 బైక్ రూ.19.90 లక్షల ఎక్స్ షోరూమ్ ధరతో లాంచ్ అయింది. అలాగే బీఎండబ్ల్యూ ఆర్ 12 నైన్‌టి రోడ్‌స్టర్ బైక్ రూ.20.90 లక్షల ఎక్స్ షోరూమ్ ధర వద్ద అందుబాటులోకి వచ్చింది.


అయితే ఈ రెండు బైక్‌ల మధ్య వ్యత్యాసం దాదాపు రూ.1 లక్షగా చెప్పుకోవచ్చు. అయితే ఈ రెండు బైక్‌లు చూడ్డానికి ఒకేలా ఉన్నా.. ఫ్యూయల్ ట్యాంక్‌తో పాటు మరికొన్ని దగ్గర్ల మార్పులు కనిపిస్తాయి. కాగా ఈ బైక్‌లు బ్రష్డ్ సైడ్ ప్యానెల్స్, అల్యూమినియం ట్యాంక్, డ్యూయల్ ఎగ్జాస్ట్‌లు, స్పోక్ వీల్స్ వంటివి కలిగి ఉన్నాయి. ఈ రెండు బైక్‌లు 1170 సిసి ఎయిర్ అండ్ ఆయిల్ కూల్డ్ బాక్సర్ ఇంజిన్‌తో వస్తాయి. ఈ ఇంజిన్ 7000 ఆర్‌పీఎమ్ వద్ద 110 బిహెచ్‌బి పవర్‌ను, 6500 ఆర్‌పీఎమ్ వద్ద 115 ఎన్‌ఎమ్ టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తాయి.

Also Read: మహిళలకు స్కూటర్ గిఫ్ట్‌గా ఇవ్వాలంటే ఇదే బెస్ట్.. ధర తక్కువ మైలేజ్ ఎక్కువ.. ఫీచర్లు మాత్రం ఎక్స్‌లెంట్..!


కాగా ఆర్ 12 బైక్ ఒకే సీటుతో వస్తుంది. ఈ బైక్‌లో 19 ఇంచుల ఫ్రంట్, 14 ఇంచుల రియర్ వీల్స్ ఉంటాయి. అదే ఆర్ 12 నైన్‌టి బైక్‌లో 17 ఇంచుల స్పోక్ వీల్స్‌ కలిగి ఉన్నాయి. ఈ బైక్ బ్లాక్ స్టార్మ్, అల్యూమినియం నైట్ బ్లాక్, శాన్ రెమో గ్రీన్ పెయింట్ స్కీమ్‌లలో లభిస్తున్నాయి. కాగా ఈ రెండు బైక్‌లు అత్యద్భుతమైన లుక్, డిజైన్‌ను కలిగి ఉన్నట్లు చాలా క్లారిటీగా కనిపిస్తుంది. ఇక ఈ రెండు బైక్‌లలో అడాప్టివ్ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్, ఫుల్ ఎల్‌ఈడీ లైటింగ్, కార్నరింగ్ ఏబీఎస్, ట్రాక్షన్ కంట్రోల్, కీలెస్ ఇగ్నిషన్, ఇంజిన్ బ్రేకింగ్ కంట్రోల్, అలాగే టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి అత్యాధునిక ఫీచర్లు ఇందులో అందించబడ్డాయి.

ఇక వీటి రైడింగ్ మోడ్ విషయానికొస్తే.. ఆర్ 12 బైక్ రోల్ రైడింగ్ మోడ్, రాక్ రైడింగ్ మోడ్‌లను కలిగి ఉంది. అదే ఆర్‌ 12 నైన్‌టి బైక్ రెయిన్ మోడ్, రోడ్ మోడ్, స్టాండర్డ్ మోడ్‌లతో అందుబాటులోకి వచ్చింది. కాగా రెండు కొత్త బీఎండబ్ల్యూ బైక్‌లు 17 ఇంచుల వీల్స్‌ను కలిగి ఉంటాయి. ఇక బ్రేకింగ్ విషయానికొస్తే.. ఇందులో ఫ్రంట్ సైడ్ 310 మిమి డిస్క్ బ్రేక్స్, బ్యాక్ సైడ్ సింగిల్ 265 మిమీ రోటర్ ఉంది. వీటితో పాటు మరిన్ని ఫీచర్లను ఈ బైక్‌లలో అందించారు.

Tags

Related News

Personal Finance: 45 సంవత్సరాలకే రిటైరయ్యి పెన్షన్ పొందుతూ లైఫ్ హాయిగా గడపాలని ఉందా..అయితే ఇలా ప్లాన్ చేసుకోండి..

Central Govt Scheme: విదేశాల్లో చదవాలని ఉందా… అయితే కేంద్ర ప్రభుత్వం అందించే రూ. 40 లక్షల లోన్ కోసం ఇలా అప్లై చేసుకోండి.

Mobile Recharge: ఎయిర్ టెల్ లోని ఈ ఆఫర్ తో రీచార్జ్ చేస్తే Netflix, Prime Video, Zee5, JioHotstar ఫ్రీగా చూసే ఛాన్స్..

Real Estate: రెంటల్ అగ్రిమెంట్ 11 నెలలు మాత్రమే ఎందుకు చేయించుకుంటారు..దీని వెనుక ఉన్న అసలు మతలబు ఇదే..

Real Estate: క్లియర్ టైటిల్ ల్యాండ్ కొనాలి అంటే తప్పనిసరిగా చూడాల్సిన డాక్యుమెంట్స్ ఇవే…లేకపోతే భారీ నష్టం తప్పదు..

Real Estate: అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌ కొంటున్నారా..అయితే అన్ డివైడెడ్ షేర్ (UDS) అంటే ఏంటి ?.. ఈ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ?

Big Stories

×