BigTV English

National:అవిశ్వాస పరీక్షకు సిద్ధమవుతున్న హేమంత్ సోరెన్

National:అవిశ్వాస పరీక్షకు సిద్ధమవుతున్న హేమంత్ సోరెన్

July 8 Jarkhand cm Hemanth Soren faceing the Trust Vote
వివాదాస్పద నేత జేఎంఎం కు చెందిన హేమంత్ సోరెన్ జార్ఖండ్ ముఖ్యమంత్రిగా మరోసారి ప్రమాణ స్వీకారం చేశారు. మనీ ల్యాండరింగ్ కు సంబంధించిన కేసులో అరెస్టయిన హేమంత్ సోరెన్ గత నెల 28న బెయిల్ పై బయటకు వచ్చిన విషయం తెలిసిందే. జైలు నుంచి బయటకు వచ్చిన నేపథ్యంలో ఈ నెల 3న కూటమి ఎమ్మెల్యేలు అంతా సమావేశమయ్యారు. హేమంత్ ను శాసనసభా పక్లనేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీనితో శుక్రవారం హేమంత్ సోరెన్ 13వ జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కాగా జులై 8 సోమవారం విశ్వాస పరీక్ష నిర్వహించేందుకు మంత్రి వర్గ మండలి నిర్ణయం తీసుకుంది.


హేమంత్ కు మార్గం సుగమం

సోమవారం హేమంత్ సోరె్న్ అసెంబ్లీలో విశ్వాస పరీక్షను ఎదుర్కోనున్నారు. జార్ఖండ్ శాసన సభలో అధికార కూటమికి చెందిన హేమంత్ సోరెన్ కు పూర్తి మెజారిటీ ఉండటంతో ఈ విశ్వాస పరీక్షలో నెగ్గనున్నారు. జార్ఖండ్ అసెంబ్లీ లో ప్రస్తుత ఎమ్మెల్యేల సంఖ్య 81 మంది. అందులో అధికార కూటమికి చెందిన జెఎంఎంకు 27 మంది ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి 17 మంది, ఆర్జెడీ పార్టీకి ఒకరు చొప్పున ఎమ్మెల్యేల బలం ఉంది. ఈ విశ్వాస పరీక్షలో నెగ్గాలంటే 42 మంది ఎమ్మెల్యేల మద్ధతు కావాల్సివుంటుంది. అయితే లోక్ సభ ఎన్నికల తర్వాత మ్యాజిక్ మర్క్ 38 కి తగ్గింది. జెఎంఎం పార్టీకి మెజారిటీ సభ్యుల మద్దతు ఉండటంతో ఈ విశ్వాస పరీక్ష నామమాత్రం కానుంది.


Tags

Related News

Air India: మరో ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. ఫ్లైట్‌లో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు

Army rescue: మంచు పర్వతాల మధ్య.. పురిటి నొప్పులతో మహిళ! రంగంలోకి 56 మంది జవాన్స్.. ఆ తర్వాత?

FASTag Annual Pass: వాహనదారులకు శుభవార్త.. ఫాస్టాగ్ వార్షిక పాస్ కావాలా..? సింపుల్ ప్రాసెస్

Bengaluru: బెంగుళూరులో ప్రధాని.. వందే భారత్ రైళ్లు ప్రారంభం, ఆ తర్వాత రైలులో ముచ్చట్లు

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Big Stories

×