BigTV English

Health Tips: నిద్రకు ముందు వాకింగ్ చేస్తే.. ఎన్ని ప్రయోజనాలో తెలుసా !

Health Tips: నిద్రకు ముందు వాకింగ్ చేస్తే.. ఎన్ని ప్రయోజనాలో తెలుసా !

Night Walk Benefits: ఆరోగ్యంగా ఉండటం కోసం ప్రతిరోజు వ్యాయామం చేయాలి. లేకుంటే అనారోగ్యం బారిన పడాల్సి వస్తుంది. అయితే వయస్సుకు అనుగుణంగా వ్యాయామ పద్దతులు వేరు వేరుగా ఉంటాయి. యువకులు..రన్నింగ్, జాగింగ్, జిమ్ కి వెళ్లడం వంటివి చేస్తారు. వయస్సు పైబడిన వారు యోగా, ధ్యానం, వాకింగ్ వంటివి చేయవచ్చు. ప్రతి ఒక్కరు వాకింగ్ చేయడం అలవాటు చేసుకోవాలి. రాత్ని నిద్రపోయే ముందు వాకింగ్ చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.


నిద్ర పోయే ముందు నడవడం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గుతుంది. మానసిక స్థితి ఇది మెరుగుపరుస్తుంది. అంతే కాకుండా డిప్రెషన్ ను తగ్గిస్తుంది. బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది. అయితే నిద్రపోయే ముందు నడవడం వల్ల క్యాలరీలు తగ్గుతాయి. రోజూ వాకింగ్ చేయడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అంతే కాకుండా బీపీ కూడా అదుపులో ఉంటుంది. శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. ఇది మంచి నిద్రకు దోహదం చేస్తుంది.రాత్రి నిద్ర పోయే ముందు నడవడం వల్ల మనసు ప్రశాంతంగా ఉండి తేలికగా నిద్ర పడుతుంది.

Also Read: డ్యాన్స్ చేస్తే ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయో తెలుసా..


ఈవెనింగ్ వాక్ గుండె కార్యకలాపాలను క్రమబద్దీకరించడానికి సహాయపడుతుంది. రక్తపోటును అదుపులో ఉంచుతుంది. వాకింగ్ వల్ల కాళ్లలోని కండరాలు బలపడటంతో పాటు కీళ్లకు బలం వస్తుంది. కానీ ఈవెనింగ్ వాక్ చేసేటప్పుడు కొన్ని విషయాలను తప్పక గుర్తుంచుకోవాలి. రాత్రి భోజనం చేసిన 2 గంటల తర్వాత వాకింగ్ చేయాలి. అతి వేగంగా నడవకుండా..తేలికపాటి నడకతో మాత్రమే నడవాలి. వాకింగ్ చేసేటప్పుడు సౌకర్యవంతమైన దుస్తులు ధరించాలి. ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వైద్యుల సలహాలు తీసుకొని వాకింగ్ చేయడం మంచిది.

Related News

Vitamin D: విటమిన్ డి కోసం.. ఏ టైమ్‌లో ఎండలో నిలబడాలి ?

Iron Rich Foods:తరచూ నీరసంగా, అలసిపోయినట్లు అనిపిస్తోందా? అయితే ఇవి తినండి

Natural Face Packs: ఫేస్ క్రీములు అవసరమే లేదు, ఈ ఫేస్ ప్యాక్స్‌తో మెరిసే చర్మం

Pneumonia causes: న్యుమోనియా రావడానికి అసలు కారణాలివే !

Pineapple Benefits: ఖాళీ కడుపుతో పైనాపిల్ తింటే.. ఇన్ని లాభాలా ?

Night Shift Workers: నైట్ షిప్ట్ చేస్తున్నారా ? ఈ టిప్స్ మీకోసమే !

Big Stories

×