Big Stories

Stock market: ముగిసిన స్టాక్ మార్కెట్, మెరిసిన ఆటో, ఫార్మా రంగాలు!

BOMBAY STOCK MARKET CLOSING BELL AUTO, PHARMA REALTY GAIN
BOMBAY STOCK MARKET CLOSING BELL AUTO, PHARMA REALTY GAIN

Today’s Stock Market Updates: అంతర్జాతీయ మార్కెట్ల బలహీన సంకేతాలు, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ ప్రభావం బాంబే స్టాక్ మార్కెట్ పై పడింది. దీంతో చివరకు స్వల్ప లాభాలతో గట్టెక్కింది. శుక్రవారం ఉదయం స్టాక్ మార్కెట్ స్వల్ప లాభాలతో ప్రారంభమైంది. కాసేపటికే ఇంట్రాడే కనిష్టానికి పడిపోయింది. ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్ల బలహీన సంకేతాలు మార్కెట్ పై ప్రభావం చూపింది. దీనికితోడు మదుపరులు విదేశీ పెట్టుబడుల ఉపసంహరణకు దిగడంతో సూచీలు ఊగిసలాడాయి. ముఖ్యంగా ఐటీ షేర్ల నష్టాలు మార్కెట్ సెంటిమెంట్ ను మరింత దెబ్బతీశాయి. దీంతో రోజంతా సూచీలు ఊగిసలాడాయి. చివరకు స్వల్ప లాభాలను దక్కించుకుంది.

- Advertisement -

మార్కెట్ ముగిసేసరికి బీఎస్ఈ 190 పాయింట్ల లాభంతో 72, 831 వద్ద ముగిసింది. అటు నిఫ్టీ కూడా 84 పాయింట్లు లాభపడి 22,096 పాయింట్ల స్థిరపడింది. ముఖ్యంగా లోహ, ఆటో, రియల్టీ, ఎఫ్ఎంసీజీ, హెల్త్ కేర్ రంగాల సూచీలు రాణించాయి. ఐటీ షేర్లు రెండు శాతానికి పైగా నష్టపోయాయి. ఇక నిఫ్టీలో యూపీఎల్, మారుతీ సుజుకీ, హీరో మోటార్స్, బజాజ్ ఆటో, సన్ ఫార్మా షేర్లు లాభపడ్డాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News