Big Stories

Vizag Drugs Case: విశాఖ డ్రగ్స్ కేసు.. వెలుగులోకి సంచలన విషయాలు..!

Vizag Drugs Case Updates
Vizag Drugs Case Updates

Sensational Facts on Vizag Drugs: విశాఖ పోర్టులో డ్రగ్స్ పట్టుబడటం ఏపీలో సంచలన రేపింది. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్న సీబీఐకు ఏపీ పోలీసులు ఆటంకం కలిగించారన్న వార్తలపై విశాఖ సీపీ రవిశంకర్ స్పందించారు. సీబీఐకు పూర్తిగా సహకరిస్తున్నామన్నారు. డాగ్‌ స్క్వాడ్‌ ను కూడా అందించామని పేర్కొన్నారు. డ్రగ్స్ దొరికిన ప్రాంతం నగర కమిషనరేట్‌ పరిధిలోకి రాదని వెల్లడించారు.

- Advertisement -

బ్రెజిల్‌ నుంచి విశాఖ పోర్టుకు డ్రగ్స్ రావడం కలకలం రేపింది. 25 వేల కిలోల డ్రైడ్‌ ఈస్ట్‌ కంటెయినర్‌ వచ్చింది. అందులో డ్రగ్స్ ఉన్నాయని సీబీఐ గుర్తించింది. రెండేళ్ల కిందట విజయవాడ చిరునామాతో అఫ్గానిస్థాన్‌ నుంచి భారీగా హెరాయిన్ వచ్చింది. ఆ డ్రగ్స్ గుజరాత్ లోని ముంద్రా పోర్టులో పట్టబడింది. ఇలా ఏపీ కేంద్రం డ్రగ్స్ దందా సాగుతోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

- Advertisement -

సీబీఐ రికార్డు చేసుకున్న వివరాలు ప్రకారం బ్రెజిల్ లోని శాంటోస్ పోర్ట్ నుంచి కంటెయినర్ వచ్చింది. ఈ కంటెయినర్ ను సంధ్యా ఆక్వా ఎక్స్ పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో బుక్ చేసుకున్నారు. ఈ కంటెయినర్ జర్మనీ మీదుగా విశాఖకు వస్తుండగా స్క్రీనింగ్ చేసి డ్రగ్స్ ఉన్నట్లు అనుమానపడ్డారు. ఇంటర్ పోల్ వెంటనే అలెర్ట్ అయ్యింది. ఈ -మెయిల్ ద్వారా భారత్ ప్రభుత్వానికి సమాచారం ఇచ్చింది. దీంతో సీబీఐ అధికారులు దర్యాప్తు చేపట్టారు.

Also Read: ఏపీలో అధికార పార్టీకి నో కోడ్.. మౌనంగా పోలీసులు

మార్చి 16న షిప్ విశాఖ తీరానికి చేరుకుంది. కంటెయినర్ 25 వేల కేజీల బ్యాగులను గుర్తించాయి. మొత్తం వెయ్యి బ్యాగులు ఉన్నట్లు లెక్కలు తేల్చారు. అందులో ఎండిన ఈస్ట్ ను నిర్ధారించారు.
గుజరాత్ నుంచి సాంకేతిక నిపుణుల రప్పించి మార్చి 19న శాంపిల్స్ సేకరించారు.49 శాంపిల్స్ ను నార్కోటిక్ డ్రగ్స్ డిటెక్షన్ కిట్లు తో టెస్టులు చేశారు. 27 శాంపిల్స్ లో నల్లమందు, హెరాయిన్, యాంఫటేమిన్, మెస్కలిన్ మార్ఫిన్, కొకైన్ ఆనవాళ్లను గుర్తించారు. మరో 20 బ్యాగుల్లో మెథాక్వలోన్, కొకైన్ ఉన్నట్లు నిర్ధారించారు.

కంటెయినర్ ను బుక్ చేసుకున్న ఆక్వాకంపెనీ డైరెక్టర్ కూనం హరికృష్ణ, ఈ కంపెనీకి చెందిన భరత్ కుమార్, పూరి శ్రీవాసకృష్ణమాచార్య, గిరిధర్ ను సీబీఐ ప్రశ్నించింది.సంధ్య ఆక్వా ఎక్స్‌పోర్ట్స్‌ ప్రైవేట్‌లిమిటెడ్‌ కేసు నమోదు చేశారు. కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం మూలపేటలో ఉన్న సంధ్య ఆక్వా పరిశ్రమలో సీబీఐ సోదాలు చేసింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News