OG Movie : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan).. పేరు కాదు ఇదొక బ్రాండ్ అని ఎప్పటికప్పుడు ఆయన అభిమానులు నిరూపిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ నుంచి సినిమా విడుదలవుతోంది అంటే అభిమానుల హడావిడి ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పవన్ కళ్యాణ్ అభిమానులే కాదు సామాన్య ప్రేక్షకులు కూడా ఒకప్పుడు ఆయన సినిమాల కోసం ఎదురుచూసేవారు. కానీ పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే సినిమాలపై ఆసక్తి తగ్గించుకున్నారో.. అటు సామాన్య ప్రజలలో కూడా ఆయన సినిమాలపై ఆసక్తి తగ్గిపోయిందనే వార్త వ్యక్తం అవుతోంది. వాస్తవానికి ఈమధ్య కాలంలో అభిమానులు హడావిడి చేస్తున్నారే కానీ సినిమా ప్రేక్షకుడిలో ఆయన సినిమాపై పెద్దగా ఆసక్తి కనబడడం లేదు. అయితే ఈ విషయం ఇటీవల రిలీజైన ‘హరిహర వీరమల్లు’ సినిమాతో స్పష్టమైందని చెప్పవచ్చు.
సినిమా కోసం రంగంలోకి దిగిన పవన్..
పవన్ కళ్యాణ్ ‘బ్రో’ సినిమాతో చివరిసారిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. మళ్ళీ రెండేళ్ల తర్వాత ‘హరిహర వీరమల్లు’ అంటూ ఈ ఏడాది జూలై 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చారు. పవన్ కళ్యాణ్ రాజకీయాలలో బిజీగా మారడం వల్ల ఈ సినిమా ఐదేళ్ల నుంచి సెట్ పైనే ఉంది. కానీ ఎట్టకేలకు విడుదలయ్యింది. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ సినిమాపై అభిమానులు ఆసక్తి చూపించారే కానీ ప్రేక్షకులు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేకపోయారు. దీంతో తప్పని పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ అటు ఏపీ డీసీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే.. ఇటు సినిమాను ప్రమోట్ చేసుకోవడానికి రంగంలోకి దిగి.. సినిమాను కొంతమేర ముందుకు తీసుకెళ్లారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ ఈ సినిమా ప్రమోషన్స్ కి రాకపోయి ఉండి ఉంటే.. రిజల్ట్ వేరేలా ఉండేదని పలువురు తమ అభిప్రాయాలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
ఓజీ బజ్ కేవలం ఫ్యాన్స్ నుంచే.. ఆసక్తి చూపించని ఆడియన్స్..
ఇకపోతే ఇప్పుడు ఫ్యాన్స్ అందరి దృష్టి ఓజీ పైనే. ప్రముఖ డైరెక్టర్ సుజీత్(Sujeeth ) దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే హరిహర వీరమల్లు సినిమా రిజల్ట్ తర్వాత ప్రేక్షకులలో ఈ సినిమాపై కూడా పెద్దగా బజ్ క్రియేట్ అవడంలేదు. నిజానికి పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద ఎత్తున ఈ సినిమా అప్డేట్స్ కోసం, ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారే కానీ అటు సామాన్య ప్రేక్షకులలో ఎటువంటి అంచనాలు లేకపోవడం ఆశ్చర్యకరమనే చెప్పాలి.
ఓజీ కోసం పవన్ వీరమల్లు గెటప్ వేస్తారా?
ఇకపోతే గతంలో పవన్ కళ్యాణ్ ప్రభుత్వ పనులు విడిచిపెట్టి.. హరిహర వీరమల్లు సినిమా కోసం ప్రమోషన్స్ చేశారు. ఇప్పుడు అభిమానులలో తప్ప ప్రేక్షకులలో పెద్దగా ఆసక్తి లేని కారణంగా మళ్లీ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు గెటప్ వేస్తారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ సినిమాలపై ఇప్పుడు రోజురోజుకు అంచనాలు తగ్గిపోతూ ఉండడం గమనార్హం. ఇదిలా ఉండగా ఈరోజు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు.. ఈ సందర్భంగా ఓజీ సినిమా నుండి ఈ రోజు సాయంత్రం నాలుగున్నర గంటలకు అప్డేట్ వదలనున్నారు మేకర్స్. మరి కనీసం ఈ అప్డేట్ అయినా ప్రేక్షకులలో బజ్ పెంచుతుందేమో చూడాలి.
also read:Nandamuri Family: మళ్లీ మొదలైన వార్.. హరికృష్ణ జయంతితో బయటపడ్డ గొడవలు!