తెలుగు బుల్లితెర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్న వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ (Bigg Boss).తాజాగా ఊహించని ట్విస్టులతో కంటెస్టెంట్స్ లోనే కాదు ఆడియన్స్ లో కూడా ఫుల్ జోష్ నింపుతోంది. ముఖ్యంగా బిగ్ బాస్ సీజన్ 8 లో ఉన్నన్ని ట్విస్ట్ లు మరే సీజన్లో లేవు అంటూ నెటిజెన్స్ సైతం కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే తాజాగా సీజన్ 8 సెప్టెంబర్ ఒకటవ తేదీన గ్రాండ్ గా ప్రారంభం అయ్యి, 14 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి అడుగు పెట్టారు. అయితే ఆరవ వారం అనూహ్యంగా మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ను ఏకంగా 8 మందిని వైల్డ్ కార్డు ద్వారా తీసుకొచ్చారు.
క్లాన్స్ గా సభ్యులను డివైడ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. హౌస్ లో ప్రస్తుతం పదిమంది కొనసాగుతూ ఉండగా అందులో కన్నడ బ్యాచ్ , తెలుగు బ్యాచ్ అన్నట్టుగా రెండు టీంలు విడిపోయాయి. ఈవారం ఒకరు ఎలిమినేట్ అయిపోతే.. మిగతా బ్యాచ్ వారిదే ఆధిపత్యం అంటూ కామెంట్లు కూడా నెటిజన్స్ చేశారు. కానీ 11వ వారం ఫ్యామిలీ వీక్ కావడం అవినాష్ ఎలిమినేట్ అయినప్పటికీ, నబీల్ తన దగ్గర ఉన్న ఎవిక్షన్ ఫ్రీ షీల్డ్ ఉపయోగించి అవినాష్ ను సేవ్ చేసి, ఎలిమినేషన్స్ రద్దు చేశారు. 12వ వారం మొదలైంది. అందులో భాగంగానే నామినేషన్స్ ప్రక్రియ ప్రారంభమైన విషయం తెలిసిందే. దీనికి తోడు ఈ వారం డబల్ నామినేషన్ ఉంది.
అయితే ఇక్కడ ఊహించని ట్విస్ట్ ఏమిటంటే.. ఈవారం నామినేషన్ ఎక్స్ హౌస్ మేట్ చేయడం.. బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభమైనప్పుడు కంటెస్టెంట్ గా అడుగుపెట్టి వర్మ (RGV ) సపోర్ట్ తో భారీ పాపులారిటీ దక్కించుకుంది సోనియా ఆకుల (Sonia akula). అయితే పృథ్వీ , నిఖిల్ తో లవ్ ట్రాక్ నడిపి తాను చెప్పినట్టే వారు చేసేలా మార్చుకొని, చివరికి నెగిటివిటీ మూట కట్టుకొని హౌస్ నుండి బయటకు వెళ్లిపోయింది. అయితే ఈ వారం నామినేషన్ కి సోనియా హౌస్ లోకి అడుగుపెట్టి, కన్నడా బ్యాచ్ తాటతీసింది అని చెప్పవచ్చు. తాజాగా ఈరోజు నామినేషన్స్ కి సంబంధించిన ప్రోమో ని విడుదల చేయగా. ప్రోమోలో కన్నడ బ్యాచ్ ని సోనియా ఒక ఆట ఆడుకున్నట్టు చూపించారు.
ప్రోమోలో ఏముంది అనే విషయానికి వస్తే.. ఈవారం నామినేషన్ ప్రక్రియ కొంచెం భిన్నంగా ఉండబోతోంది. ఎక్స్ హౌస్ మేట్స్ మిమ్మల్ని నామినేట్ చేయబోతున్నారు అంటూ బిగ్ బాస్ తెలిపారు. అందులో భాగంగానే సోనియా ఆకుల హౌస్ లోకి అడుగుపెట్టింది. దీంతో కంటెస్టెంట్స్ అందరూ చాలా సర్ప్రైజ్ అయ్యారు. బిగ్ బాస్ మాట్లాడుతూ.. “సోనియా తగిన కారణాలు చెప్పి, వారి తలపై షుగర్ బాటిల్ ని పగలగొట్టి ఇద్దరిని నామినేట్ చేయండి” అంటూ తెలిపారు బిగ్ బాస్. నా మొదటి నామినేషన్ ప్రేరణ (Prerana) అంటూ సోనియా మాట్లాడుతూ.. “నువ్వు ఇద్దరు మాట్లాడుతున్నప్పుడు, మాటలు వదిలేస్తావ్, కిచెన్ లో వర్క్ ఇస్తున్నప్పుడు” అని మాట్లాడగానే.. ప్రేరణ అందుకొని..” గౌతమ్ ఇర్రెస్పాన్సిబిల్ గా బిహేవ్ చేశాడు కాబట్టి “అని చెబుతూ ఉండగానే.. గౌతమ్ అందుకొని..”నువ్వెలా నన్ను ఇర్ రెస్పాన్సిబుల్ అని చెబుతావ్ “అంటూ ఫైర్ అయ్యాడు. “పృథ్వీ కావాలి , అవినాష్ అవుట్ అవ్వాలి అని ఎలా చెప్తావు” అంటూ ఫైర్ అయ్యింది సోనియా. ఇక తర్వాత షుగర్ బాటిల్ తీసుకొని ప్రేరణ తలపై పగలగొట్టింది.
ఇక తర్వాత నిఖిల్ (Nikhil )ని నామినేట్ చేసింది సోనియా. “ఫస్ట్ పృథ్వీ ఎందుకు నామినేట్ చేశావు? నిఖిల్ ” అంటూ ప్రశ్నించింది. నిఖిల్ మాట్లాడుతూ..” కేర్ లెస్ ” అంటూ సమాధానం తెలిపాడు. “ఏంటీ? కాఫీ కప్పుకి నన్ను నామినేట్ చేసావా “అంటూ పృథ్వి అడిగాడు. ఇక యష్మి ప్రేమలో పడిపోయావు అంటూ నిఖిల్ ని ఉద్దేశించి కామెంట్ చేయగా.. “ఆ ఫీలింగ్ ఉందని తెలియగానే ఆమెను కట్ చేశాను కదా ఆమెతో మాట్లాడలేదు కదా” అంటూ నిఖిల్ అన్నాడు. ఇక వెంటనే యష్మీ మాట్లాడుతూ..” నువ్వు నిజంగానే కట్ చేసావా? “అని ఫైర్ అవుతూ అడిగింది. నిఖిల్ ..”నీ దగ్గర నేను నీ గురించి ఏమీ మాట్లాడలేదు” అంటూ నిఖిల్ తెలిపాడు. “తప్పుంటే నీ జోలికి వచ్చేదాన్ని కాదు.. ఇక్కడ బ్యాడ్ అయ్యింది” అంటూ అరుస్తూ రెచ్చిపోయింది. మొత్తానికైతే ప్రోమో చూసిన వారంతా ఇప్పుడు ప్రాయశ్చిత్తపడుతోందా సోనియా అంటూ కామెంట్లు చేశారు.