BigTV English
Advertisement

Agent OTT: ఇన్నాళ్ల ఎదురుచూపులకు చెక్.. ఫైనల్‌గా ఓటీటీలోకి అఖిల్ ‘ఏజెంట్’..

Agent OTT: ఇన్నాళ్ల ఎదురుచూపులకు చెక్.. ఫైనల్‌గా ఓటీటీలోకి అఖిల్ ‘ఏజెంట్’..

Agent OTT: మామూలుగా ఈరోజుల్లో ఏ సినిమా అయినా థియేటర్లలో విడుదలయిన నెలరోజుల తర్వాత ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఒకవేళ థియేటర్‌లో ఆ సినిమాకు బ్లాక్‌బస్టర్ టాక్ లభిస్తే ఓటీటీలో స్ట్రీమింగ్‌కు కనీసం రెండు నెలల టైమ్ తీసుకుంటున్నారు మేకర్స్. వారికి ఓటీటీ స్ట్రీమింగ్ అస్సలు ఇష్టం లేకపోతే 80 రోజుల పాలసీ ఫాలో అవుతున్నారు. కానీ థియేటర్లలో విడుదలయిన రెండేళ్ల తర్వాత ఓటీటీలోకి రావడం అనేది ఒక కొత్త రికార్డ్. అక్కినేని అఖిల్ సినిమా ఆ రికార్డ్ క్రియేట్ చేసింది. అఖిల్ హీరోగా నటించిన ‘ఏజెంట్’ మూవీ ఫైనల్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్‌ను అక్కినేని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హల్‌చల్ మొదలుపెట్టారు.


డిశాస్టర్ టాక్

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అక్కినేని అఖిల్ హీరోగా నటించిన చిత్రమే ‘ఏజెంట్’. ఈ సినిమా 2023 ఏప్రిల్ 28న థియేటర్లలో విడుదలయ్యింది. ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించారు అనిల్ సుంకర. అందుకే మూవీకి భారీగా ప్రమోషన్స్ కూడా చేశారు. అఖిల్ సైతం తన మునుపెన్నడూ చిత్రాలకు చేయనంత ప్రమోషన్స్ ‘ఏజెంట్’కు చేశాడు. దేశవ్యాప్తంగా తిరుగుతూ మూవీ టీమ్ అంతా ప్రమోషన్స్ చేశారు. కానీ థియేటర్లలో విడుదలయ్యి ఫస్ట్ షో పూర్తవ్వగానే దీనికి ఫ్లాప్ టాక్ వచ్చేసింది. దీంతో చాలామంది ప్రేక్షకులు రెండో రోజు నుండే ఈ సినిమా కోసం థియేటర్లకు వెళ్లడానికి ఇష్టపడలేదు. అలా థియేటర్లలో సినిమా డిశాస్టర్ అయ్యింది.


ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్

అసలు ‘ఏజెంట్’ మూవీ అంతలా ఎందుకు డిశాస్టర్ అయ్యింది అని తెలుసుకోవడం కోసం చాలామంది ప్రేక్షకులు దీనిని ఓటీటీలో చూడడానికి ఫిక్స్ అయ్యారు. అప్పటి నుండి ఇప్పటివరకు ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. 2024లో కూడా ‘ఏజెంట్’ (Agent) మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభించుకుంటుందని రూమర్స్ వచ్చాయి. కానీ ఎందుకో అప్పటినుండి ఇప్పటివరకు ఈ మూవీ అసలు ఓటీటీలోకి రాలేదు. ఫైనల్‌గా సోనీ లివ్‌లో ‘ఏజెంట్’ మూవీ స్ట్రీమింగ్ ప్రారంభించుకుంది. సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసి అక్కినేని ఫ్యాన్స్‌కు ఫీస్ట్ ఇవ్వడానికి సిద్ధమయ్యింది. ఈ మూవీని ఓటీటీలో చూసి రివ్యూలు అందించడానికి రెడీగా ఉన్నారు ఫ్యాన్స్.

Also Read: ‘ఓదెల 2’లో అవన్నీ ఉంటాయి.. ఇంట్రెస్టింగ్ విషయాలు రివీల్ చేసిన తమన్నా

భారీ అంచనాలు

ఒక యాక్షన్ కమర్షియల్ సినిమాగా ‘ఏజెంట్’ తెరకెక్కింది. ఇందులో అక్కినేని అఖిల్‌ (Akkineni Akhil)తో పాటు మమ్ముట్టి కూడా ఒక కీలక పాత్రలో కనిపించారు. మలయాళ స్టార్ హీరో మమ్ముట్టిని ఈ సినిమాలో క్యాస్ట్ చేయడంపై కూడా దీనిపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. కానీ విడుదలయిన తర్వాత సినిమాలో యాక్షన్ సీన్స్ ఉన్నా అసలు ఆ సీన్స్ ఎందుకు వస్తాయో సంబంధం లేకుండా ఉందని చూసిన ప్రేక్షకులు భావించారు. పైగా అంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించిన అనిల్ సుంకర సైతం.. అసలు ఈ మూవీని సరిగ్గా ప్లాన్ చేసుకోలేదని స్టేట్‌మెంట్ ఇచ్చేసరికి ‘ఏజెంట్’పై అప్పట్లో విపరీతంగా ట్రోల్స్ వచ్చాయి.

Related News

Chiranjeeva OTT : ఓటీటీలోకి వచ్చేసిన రాజ్ తరుణ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Jatadhara OTT: ‘ జటాధర’ ఓటీటీ పార్ట్నర్ లాక్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే..?

OTT Movie : అమ్మాయిలతో ఆ పాడు పని చేసి చంపే సైకో… ఒంటరిగా చూడాల్సిన సీన్స్… క్లైమాక్స్ కేక

OTT Movie : 240 కోట్ల కలెక్షన్స్, 10 అవార్డులు… ఈ బ్లాక్ బస్టర్ మూవీ హీరోని జైలుకు పంపిందన్న విషయం తెలుసా ?

Kiss movie OTT : కిస్ పెట్టుకుంటే ఫ్యూచర్లోకి… మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి సూపర్ హిట్ తమిళ్ మూవీ

Feminichi Fathima OTT : కేరళ స్టేట్ అవార్డ్స్ లో దుమ్మురేపిన ‘ఫెమినిచి ఫాతిమా’… ఓటీటీలో రిలీజ్ ఎప్పుడో తెలుసా?

Friday OTT Movies : శుక్రవారం ఓటీటీల్లోకి 17 సినిమాలు.. ఆ 4 వెరీ స్పెషల్..

OTT Movie : ఎక్స్ కంటే డేంజర్ గా ఉండే 5 థ్రిల్లర్ సిరీస్ లు… యాక్షన్ మాత్రమే కాదు మజా ఇచ్చే అడ్వెంచర్ కూడా

Big Stories

×