Congress MLC Vijayashanti: బీజేపీపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొన్ని వ్యతిరేక శక్తులను తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ దింపబోతుందని ఆమె వ్యాఖ్యానించారు.
‘వచ్చే ఎన్నికలకు బీజేపీ ఆపరేషన్ స్టార్ట్ చేసిందని అన్నారు. అందుకే తెలంగాణ ఉద్యమకారుల పై కుట్ర చేస్తుంది. నాకు ఎమ్మెల్సీ ఇస్తే.. కొంతమంది అక్కసు వెళ్లగక్కుతున్నారు. నేను తెలంగాణ కోసం ఆస్తులు అమ్మాను. 2008లో కేసీఆర్ నా పార్టీని విలీనం చేయాలని రిక్వెస్ట్ చేస్తే.. పొత్తు కుదర్చుకున్నాను. కేసీఆర్ ను వదిలిపెట్టేది లేదు. అవినీతి విషయంలో అన్ని లెక్కలు తేలుస్తాం. నన్ను విమర్శించిన వారిని ఎవరినీ వదిలిపెట్టా’ అని విజయశాంతి ఘాటుగా మాట్లాడారు.
ALSO READ: BANK OF BARODA: గుడ్ న్యూస్.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీగా ఉద్యోగాలు.. దరఖాస్తు గడువు పొడగింపు