BigTV English

Voluntary Provident Fund: లక్షల్లో పన్ను ఆదా.. ఈ ప్రభుత్వ స్కీమ్‌తో అదిరిపోయే బెనిఫిట్స్

Voluntary Provident Fund: లక్షల్లో పన్ను ఆదా.. ఈ ప్రభుత్వ స్కీమ్‌తో అదిరిపోయే బెనిఫిట్స్
Voluntary Provident Fund Benefits
Voluntary Provident Fund Benefits

Voluntary Provident Fund Benefits: కేంద్ర ప్రభుత్వం ఎన్నో పొదుపు పథకాలు, పెన్షన్ పథకాల్ని ముందుకు తీసుకొస్తున్న విషయం అందరికీ తెలిసిందే. దీర్ఘకాలంలో పెద్ద మొత్తంలో నిధులు జమ కావాలంటే పీపీఎఫ్, ఈపీఎఫ్‌తో పాటు వీపీఎఫ్ కూడా మంచి ఆప్షన్ అని అంటారు. ఈ పథకాల్లో మదుపు చేయడం వల్ల పన్ను మినహాయింపు సహా ఇంకెన్నో ప్రయోజనాలు పొందవచ్చు.


ఉద్యోగం చేస్తున్న ప్రతి ఒక్కరికీ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) గురించి తెలిసే ఉంటుంది. దీంట్లో ఉద్యోగి మూలవేతనం నుంచి 12 శాతం ఉద్యోగి భవిష్య నిధి ఖాతాకు అంటే ఈపీఎఫ్ ద్వారా జమ చేస్తుంటారు. ఉద్యోగ సంస్థ కూడా అంతే మొత్తం వారి ఖాతాకు జోడిస్తుంటుంది. ఈ పీఎఫ్ డిపాజిట్లపై ప్రతి ఆర్థిక సంవత్సరం కేంద్రం ఒక వడ్డీ రేటును నిర్ణయించి వడ్డీ జమ చేస్తుంటుంది.

ఇటీవల 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ఓ వడ్డీ రేటును 8.25 శాతంగా కేంద్రం ఖరారు చేసింది. ఇది చాలా ప్రముఖ బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఆఫర్ చేస్తున్న వడ్డీ కంటే చాలా ఎక్కువే. ఇక ఎఫ్డీ కంటే ఎక్కువగా వడ్డీ అందుకుంటూ.. భవిష్యత్తులో పెద్ద మొత్తం నిధి జమ చేసుకోవాలంటే వారికి వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్ (VPF) బెస్ట్ ఆప్షన్.


కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న కొన్ని పొదుపు పథకాల్లో వీపీఎఫ్ కూడా ఒకటి. పేరుకు తగ్గట్లుగానే, ఇందులో జమ చేయడం కూడా పూర్తిగా స్వచ్చందంగా ఉంటుంది. ఈ మొత్తం కూడా ఉద్యోగి ఈపీఎఫ్ అకౌంట్లోనే జమ అవుతుంది. ఉద్యోగి నెలవారీ పొదుపులో అదనపు మొత్తాన్ని జమ చేయవచ్చు. ఈపీఎఫ్ ఫండ్‌కి వర్తించే వడ్డీ రేటు దీనికి కూడా వర్తిస్తుంది. ఏదైనా సంస్థలో పని చేసే ఎవరైనా ఈ ఎంపికను ఉపయోగించవచ్చు.

Read More: వీడు మామూలోడు కాదు.. భార్య ఫోన్ కాల్స్‌తో రూ.15 కోట్లు కొట్టేశాడు..!

ప్రాథమిక జీతంతో పాటు డీఏతో సమానమైన గరిష్ట వీపీఎఫ్ మొత్తాన్ని జమ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఈపీఎఫ్ మాదిరిగానే వీపీఎఫ్‌కు కూడా ఐదేళ్ల లాకిన్ పీరియడ్ ఉంటుంది. వైద్య అవసరాలు, రిటైర్మెంట్, ఇంటి నిర్మాణం వంటి అవసరాలు వచ్చినప్పుడు ఈ మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు.

వీపీఎఫ్‌లో నగదు డిపాజిట్ చేయడం ద్వారా మీరు ఆకర్షణీయమైన వడ్డీని పొందవచ్చు. అంతకుముందు 8.15 శాతంగా ఉండగా.. ప్రస్తుతం 8.25 శాతంగా మారింది. ప్రతి సంవత్సరం వడ్డీ రేట్లు మారిన్నప్పటికీ.. చాలా బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్లు 8 శాతం కంటే తక్కువ. అయితే పీపీఎఫ్ వడ్డీ రేటు 7.1 శాతమే.

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌లో డిపాజిట్ చేసిన మొత్తానికి సెక్షన్-80C కింద పన్ను ప్రయోజనం కూడా లభిస్తుంది. ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ.1.50 లక్షల వరకు పన్ను తగ్గించవచ్చు. హోం లోన్ లేని వారు వీపీఎఫ్ పథకం ఎంచుకోవడం మంచి ఎంపిక.

అధిక రాబడిని ఇచ్చే ఇన్వెస్ట్‌మెంట్ సాధనాల్లో పెట్టుబడి పెట్టేటప్పుడు వచ్చే మూలధన లాభాలపై పన్ను చెల్లించబడుతుంది. అయితే వీపీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేస్తే పన్ను ఉండదు. దీర్ఘకాలంలో పెద్ద మొత్తంలో నగదు ఉపసంహరణపై కూడా పన్ను లేదు.

మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీ మార్కెట్లు మంచి రాబడిని కలిగి ఉంటాయి. అయితే ఇక్కడే ప్రమాదం ఉంది. హామీ ఇవ్వబడిన రాబడులు లేవు. అదే ఈపీఎఫ్, వీపీఎఫ్ ప్రభుత్వ మద్దతును కలిగి ఉంటాయి. కాబట్టి మన డిపాజిట్లపై హామీతో కూడిన రాబడిని ఆశించవచ్చు.

వీపీఎఫ్‌లో డిపాజిట్ చేయడం కూడా చాలా సులభం. జమ చేయాల్సిన వీపీఎఫ్ మొత్తాన్ని తెలుపుతూ హెచ్‌ఆర్ విభాగంలో దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది. ప్రతి నెలా ఈ మొత్తాన్ని తీసివేసిన తర్వాత, మిగిలిన జీతం మీ ఖాతాలో జమ చేయబడుతుంది.

చాలా మందికి డబ్బు వచ్చిన తర్వాత పెట్టుబడి పెట్టలేకపోవచ్చు. జీతం రాగానే ఖర్చవుతుంది. అలాంటి వ్యక్తులు పొదుపును అలవాటుగా మార్చుకోవడానికి వీపీఎఫ్ పనిచేస్తుందని చెప్పవచ్చు.

Related News

D-Mart: కొనేది తక్కువ, దొంగతనాలు ఎక్కువ.. డి-మార్ట్ యాజమాన్యానికి కొత్త తలనొప్పి!

JIO Super Plans: జియో నుంచి సూపర్ ఆఫర్లు.. ఏది ఫ్రీ, ఏది బెస్ట్ అంటే?

SEBI – Foreign Funds: భారతీయ ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్.. విదేశీ ఫండ్స్‌కి SEBI గ్రీన్ సిగ్నల్

ICICI Bank New Rules: కస్టమర్లకు ICICI బిక్ షాక్.. కనీస బ్యాలెన్స్ రూ.10 వేలు కాదు.. అంతకుమించి.. పేదోళ్ల సంగతి ఏంటో?

Digital Rent Agreement: ఈ రూల్ తెలియకుండా ఇల్లు అద్దెకు ఇస్తే రూ. 5000 జరిమానా కట్టక తప్పదు..

Real Estate: ఈ విషయాలు తెలియకుండా ‌ఫార్మ్ లాండ్స్ కొంటే భారీ నష్టం తప్పుదు..అడ్వర్టయిజ్‌మెంట్స్ చూసి మోసపోకండి..

Big Stories

×