BigTV English

Travel Centers of America : వీడు మామూలోడు కాదు.. భార్య ఫోన్ కాల్స్‌తో రూ.15 కోట్లు కొట్టేశాడు..!

Travel Centers of America : వీడు మామూలోడు కాదు.. భార్య ఫోన్ కాల్స్‌తో రూ.15 కోట్లు కొట్టేశాడు..!

man listening wife calls


Man listening Wife Work Calls : 2020-21లో కరోనా విజృంభించిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో చాలా కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం వెసులుబాటు కల్పించాయి. ఇప్పటికీ చాలా కంపెనీల్లో ఉద్యోగులు ఇంటి నుంచే పని చేస్తున్నారు. అయితే వర్క్ ఫ్రమ్ హోం కల్చర్ లాభనష్టాల గురించి వ్యాపార వర్గాల నుంచి భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఎక్కువగా పని క్వాలిటీ గురించి చర్చ నడుస్తూ ఉంటుంది.

ఇదంతా పక్కనబెడితే.. ఓ వింత కారణంతో ఒక మహిళ ఉద్యోగం కోల్పోయింది. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న భార్య ఫోన్ కాల్స్ రహస్యంగా విన్న ఒక వ్యక్తి ఏకంగా రూ. 15 కోట్ల వరకు ఆర్జించాడు. చివరకి గుట్టు బయటపడి ఆమె ఉద్యోగం పోయింది. ఆమె భర్త పోస్టూ కూడా ఊడిపోయింది. అసలేం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.


Read More : జీమెయిల్‌ మూసివేస్తారంటూ సోషల్ మీడియాలో వైరల్.. గూగుల్‌ క్లారిటీ..

అమెరికా టెక్సాస్‌కు చెందిన టైలర్ లూడన్ అనే వ్యక్తి భార్య గతంలో బ్రిటిష్ పెట్రోలియం అండ్ బీపీ అమోకో అనే కంపెనీలో పనిచేసేది. ఆమె మెర్జర్స్ అండ్ అక్విజిషన్స్ మేనేజర్‌గా విధులు నిర్వర్తించేవారు. ట్రావెల్‌సెంటర్స్ ఆఫ్ అమెరికా ఇంక్‌ను బీపీ కొనుగోలు చేసే డీల్‌పై ఇంటి వద్ద ఉన్న ఆఫీస్ నుంచి ఆమె వర్క్ చేసేది.

దీని గురించి భర్త లూడన్.. భార్య ఫోన్ కాల్స్ రహస్యంగా విని షేర్లు పెరుగుతాయని గ్రహించి ట్రావెల్‌సెంటర్స్ ఆఫ్ అమెరికాలో వాటా కొనుగోలు చేశాడు. ఈ వ్యవహారం కొన్ని నెలల పాటు గుట్టుచప్పుడు కాకుండా సాగింది.

Read More : అమెరికాలో జాబ్ వదిలేసి.. స్టార్టప్‌తో రూ.100 కోట్లు..!

2023 ఫిబ్రవరిలో ఆ కంపెనీని బీపీ Plc సంస్థ 74 శాతం ప్రీమియంతో కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించగా.. లూడన్ తన బ్రోకరేజీ, రిటైర్మెంట్ అకౌంట్లను వేగంగా లిక్విడేట్ చేశాడు. దీంతో ఏకంగా రూ. 15 కోట్ల లాభం వచ్చిపడింది. ఇలా రహస్యంగా ఇన్‌సైడర్ ట్రేడింగ్ చేసి భార్యతో పాటు ఆమె పనిచేస్తున్న కంపెనీని మోసం చేశాడు.

కొన్ని రోజుల తర్వాత లూడన్ వ్యాపార కార్యకలాపాల గురించి యునైటెడ్ స్టేట్స్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ బయటపెట్టింది. అంతేకాకుండా ఇవేమి ఆయన భార్యకు తెలియదని వెల్లడించింది. ఆమె ఫోన్ కాల్స్ ఆధారంగా పొటెన్షియల్ డీల్ గురించి తెలుసుకొని ఈ పని చేసినట్లు లూడన్ కూడా ఒప్పుకున్నాడు. ఈ ఘటనతో ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయి విడాకుల కోసం అప్లై చేసింది.ఈ విషయాన్ని ఆమె తన కంపెనీకి తెలియజేసినప్పటికీ.. తన ప్రమేయం ఉన్నట్లు ఎలాంటి రుజువు లేకపోయినా సదరు మహిళ ఉద్యోగం కోల్పోవాల్సి వచ్చింది.

Related News

D-Mart: ఏంటీ? డిమార్ట్ నుంచి డబ్బులు కూడా సంపాదించవచ్చా? ఇంత సులభమా!

Investment Formula: రూ. 1.2 కోట్ల అప్పుల తీర్చి.. రూ. 5 కోట్ల సంపాదించి.. ఏం ప్లాన్ గురూ!

Americans Investments: బ్యాంక్ బ్యాలెన్స్ లేకుండా చేతినిండా సంపద.. అమెరికన్ల బుర్రే బుర్ర!

Maruti Suzuki e-Vitara: ప్రధాని మోదీ చేతుల మీదుగా.. మారుతీ సుజుకీ ఈవీ కారు, టార్గెట్ 100 దేశాలు

Gold Rates Today: భారీ షాకిచ్చిన బంగారం ధరలు.. తులంపై ఎంత పెరిగిందో తెలుసా?

కుటుంబ సభ్యుల నుంచి తీసుకునే కానుకలపై టాక్స్ ఉంటుందా..ఐటీ రూల్స్ ఏం చెబుతున్నాయి..

Big Stories

×