Big Stories

Citroen Basalt Coupe SUV Spied: సిట్రోయెన్ కొత్త స్మార్ట్ SUV.. హైటెక్ ఫీచర్లతో వచ్చేస్తోంది!

Citroen Basalt Coupe SUV Spied: ఫ్రెంచ్ వాహన తయారీ సంస్థ సిట్రోయెన్, C5 ఎయిర్‌క్రాస్, C3 ఎయిర్‌క్రాస్ తర్వాత భారతదేశంలో తన మూడవ SUVని పరిచయం చేయడానికి సిద్ధమవుతోంది. ఈ SUV కాన్సెప్ట్‌ను ఈ సంవత్సరం ప్రారంభంలో టీజ్ చేశారు. సిట్రోయెన్ కొత్త బసాల్ట్ కూపే SUVని త్వరలో విడుదల చేయబోతోంది. కంపెనీ భారతదేశంలో నిరంతరం ఈ ఎస్‌యూవీని టెస్ట్ చేస్తూనే ఉంది.

- Advertisement -

ఈ టెస్ట్ మోడల్ ఉత్పత్తికి దాదాపు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. 2024 Q2లో కంపెనీ దీన్ని భారత్‌లో విడుదల చేయనుంది. ఇది ప్రదర్శనలో చాలా శక్తివంతమైన SUV. రాబోయే టాటా కర్వ్ కూపే SUV లాగా కనిపిస్తుంది. సిట్రోయెన్ ఈ కొత్త SUV భారతదేశంలో తయారు చేయారీ చేస్తుంది. ఇది దేశంలో కంపెనీ రెండవ SUV అవుతుంది. సిట్రోయెన్ C3 శ్రేణితో పోల్చితే ఇది ఒక శక్తివంతమైన వాహనం. ఇది డిజైన్ పరంగా భిన్నంగా ఉంటుంది.

- Advertisement -

కంపెనీ ఈ SUVని స్మార్ట్ కార్ ప్లాట్‌ఫారమ్‌పై నిర్మిస్తుంది. ముందు నుండి C3 ఎయిర్‌క్రాస్ లాగా కనిపిస్తుంది. అయితే దాని వెనుక భాగం కూపే శైలికి పూర్తిగా వ్యతిరేకంగా ఉంటుంది. దీనితో పాటు స్ప్లిట్ హెడ్‌ల్యాంప్‌లు, గ్రిల్ ముందు భాగంలోని అనేక మార్పులు చూడొచ్చు. దీని అల్లాయ్ వీల్స్ కూడా చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. ఓవరాల్ గా ఇది బలంగా కనిపిస్తుంది. వెహికల్ వెనుక వైపు చూస్తే అది కూపే శైలిని మరింత పూర్తి చేసే రూఫ్‌లైన్‌తో దృఢంగా ఉంటుంది. ఆకర్షణీయంగా కనిపించే సి-పిల్లర్‌ కూడా ఇందులో ఉంటుంది.

Also Read: టీవీఎస్ ఐక్యూబ్ నుంచి కొత్త వేరియంట్లు.. త్వరలో లాంచ్!

Citroen India ఇంకా దీని సాంకేతిక అంశాల గురించి ఎటువంటి సమాచారం అందించలేదు. అయితే దీని డ్యాష్‌బోర్డ్ డిజైన్ ఇతర Citroen కార్ల మాదిరిగానే ఉంటుంది తెలుస్తోంది. దీని క్యాబిన్ చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ కారులో అనేక హైటెక్ ఫీచర్లు కూడా అందుబాటులోకి రానున్నాయి. కొత్త సిట్రోయెన్ బసాల్ట్ C3 ఎయిర్‌క్రాస్‌కు పవర్ అందించే  1.2-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌తో పవర్ చేయబడుతుందని భావిస్తున్నారు. ఆటోమేటిక్‌తో పాటు మాన్యువల్ గేర్‌బాక్స్‌తో ఆప్షన్ కారులో ఉంటుంది. కంపెనీ ఇక్కడ 1.2-లీటర్ NA పెట్రోల్ ఇంజన్‌ను కూడా అందించే అవకాశాలు ఉన్నాయి. ఇది అధిక మైలేజ్ ఇస్తుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News