Man Chokes Woman With Belt: అమెరికాలో దారుణం చోటు చేసుకుంది. ఒంటరిగా మహిళ వెళ్లడం గమనించిన ఓ వ్యక్తి ఆమె మెడకు బెల్టు వేసి కూతవేటు దూరం లాక్కుపోయాడు. ఆమె అపస్మారక స్థితిలో వెళ్లాక అత్యాచారానికి పాల్పడ్డాడు. సంచలనం రేపిన ఈ ఘటన న్యూయార్క్‌లో వెలుగుచూసింది.
వివరాల్లోకి వెళ్తే.. మే ఒకటిన నాలుగు పదుల వయసున్న మహిళ ఎర్లీ మార్నింగ్ మూడు గంటల సమయం లో న్యూయార్క్‌లోని ఈస్ట్ 152వ స్ట్రీట్‌లో నడుచుకుంటూ వెళ్తోంది. మహిళ ఒంటరిగా వెళ్లడం గమనించిన ఓ వ్యక్తి, తన ఆనవాళ్లు గుర్తు పట్టకుండా ముఖానికి క్లాత్ కట్టుకుని మహిళ వెంటపడ్డాడు. ఆ సమయంలో వెనుక నుంచి ఆమె మెడకు బెల్ట్ బిగించి కొంతదూరం తీసుకెళ్లాడు. ఆమె ప్రతిఘటించినప్పటికీ ఫలితం లేకపోయింది.
కాసేపటికి ఆమె అపస్మారక స్థితికి చేరుకుంది. వెంటనే ఆమెని రెండు కార్ల మధ్యలో పడేసి ఆపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆసుపత్రిలో ఆమె ట్రీట్‌మెంట్ తీసుకుంటోంది. సీసీటీవీ కెమెరాలో ఆధారంగా పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. ఈ విషయాన్ని న్యూయార్క్ పోలీసులు వెల్లడించారు.
Also Read: Family Murder : కుటుంబం దారుణ హత్య.. ఆపై నిందితుడి ఆత్మహత్య.. కారణమేంటంటే?
https://twitter.com/CollinRugg/status/1788691145599381736