Compounding Power: పెద్ద మొత్తంలో పెట్టుబడులు చేసి కోట్లు సంపాదించడం ఎవరైనా చేస్తారు. కానీ మీరు చిన్న మొత్తాలను ఇన్వెస్ట్ చేసి, అదే కోట్ల రూపాయలను సంపాదించవచ్చు. అవును మీరు చూస్తుంది నిజమే. కేవలం నెలకు రూ. 7 వేలతో 5 కోట్ల రూపాయలను సంపాదించవచ్చు. అయితే దీని కోసం ఏం చేయాలి, ఎన్ని నెలలు పెట్టుబడులు చేయాలి, ఎలా వస్తుందనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కాంపౌండింగ్ అంటే ఏంటి?
కాంపౌండింగ్ అనేది మీరు పెట్టుబడి చేసిన మొత్తం మాత్రమే కాదు. ఇది మీకు వచ్చే లాభాలపై కూడా వడ్డీని అందిస్తుంది. మీ పెట్టుబడి విషయంలో ఒక క్రమబద్ధమైన పద్ధతిని అనుసరిస్తే, దీర్ఘకాలంలో మీరు మంచి లాభాలను పొందుతారు.
సిప్ విధానంలో
SIP (Systematic Investment Plan) అనేది మ్యూచువల్ ఫండ్‌లో స్థిర మొత్తాన్ని నెలవారీగా పెట్టుబడి చేయడానికి అందుబాటులో ఉన్న బెస్ట్ ప్లాన్. దీనిలో మీరు నెలవారీగా లేదా త్రైమాసికంగా ఒక నిర్దిష్ట మొత్తాన్ని పెట్టుబడి చేసుకోవచ్చు. ఇది మార్కెట్ ఒడిదుడుకులను సమర్థవంతంగా ఎదుర్కొనడంలో సహాయపడుతుంది. మీరు దీనిలో ఎంత త్వరగా పెట్టుబడులు ప్రారంభిస్తే, మీ పెట్టుబడి పెరగడానికి అంత ఎక్కువ సమయం ఉంటుంది.
SIP పెట్టుబడి ప్రయోజనాలు
-చిన్న మొత్తంలో ప్రారంభించవచ్చు
-క్రమబద్ధమైన పెట్టుబడి వల్ల మార్కెట్‌లో స్థిరత
-దీర్ఘకాలంలో అధిక రాబడులు
-పెట్టుబడి ఆటోమేటిక్‌గా జరిగేలా సౌకర్యం
-మార్కెట్ ఒడిదుడుకులకు భయపడకుండా పెట్టుబడి చేయగలుగుతారు
Read Also: Business Idea: తక్కువ పనితో నెలకు రూ. 2 లక్షలకుపైగా …
5 కోట్లు ఎలా వస్తాయంటే
మీరు రూ.5 కోట్ల మొత్తాన్ని పొందాలంటే ప్రతి నెల రూ. 7,000, సిప్ ద్వారా 32 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ క్రమంలో మీరు 32 సంవత్సరాల్లో చేసిన మొత్తం పెట్టుబడి రూ. 26,88,000 అవుతుంది. కానీ ఆ తర్వాత మీకు వచ్చే మొత్తం రూ. 5,23,31,075. అంటే మీకు వడ్డీ రూపంలోనే మీకు రూ. 4,73,12,000 లభిస్తాయి. ఈ క్రమంలో మీరు చేసిన పెట్టుబడి లక్షల్లో ఉంటే, వడ్డీగానే 4 కోట్ల రూపాయలకుపైగా అందుకుంటారు. 15% వార్షిక వడ్డీ రేటుతో ఈ మొత్తం మీకు లభిస్తుంది.
ఎందుకు ముందు ప్రారంభించాలి?
ముందుగా ప్రారంభించడం వల్ల లాభాలు ఎక్కువగా ఉంటాయి. మీరు ముందుగా పెట్టుబడి ప్రారంభిస్తే, కాంపౌండింగ్ విధానం వల్ల లాభాలు అధికంగా పెరుగుతాయి. ఈ క్రమంలో చిన్న మొత్తంలో పెట్టుబడి చేసినా కూడా, దీర్ఘకాలంలో అది పెద్ద మొత్తంగా మారుతుంది. దీర్ఘ కాలంలో మార్కెట్ ఒడిదుడుకులు మీ పెట్టుబడిపై తక్కువ ప్రభావం చూపిస్తాయి
పెట్టుబడి ప్రారంభించడానికి సరైన సమయం
25 ఏళ్ల వయస్సులో వ్యక్తి SIP ప్రారంభిస్తే, 32 సంవత్సరాల తర్వాత రూ. 5 కోట్లకు చేరుకోవడం పూర్తిగా సాధ్యమే. కానీ అదే వ్యక్తి 35 ఏళ్ల వయస్సులో SIP ప్రారంభిస్తే, 10 సంవత్సరాల ఆలస్యానికి ఈ మొత్తం ఎదుర్కోవాలంటే కొంచెం కష్టమని చెప్పవచ్చు. వయసు పెరిగిన కొద్ది పెట్టుబడి చేసే మొత్తాన్ని పెంచుకోవాల్సి ఉంటుంది.