Brahmamudi serial today Episode: దుగ్గిరాల ఫ్యామిలీ రాజ్‌కు కర్మకాండలు జరిపిస్తుంది. అందరూ ఏడుస్తూ ఉంటారు. నా కళ్ల ముందే నా మనవడిని పోగొట్టుకున్నాను అని ఇందిరాదేవి ఏడుస్తుంది. ఇక నన్ను అమ్మా అని ఎవరు పిలుస్తారు.ఇంకెప్పటికీ ఆ పిలుపు వినబడనంత దూరంగా వెళ్లిపోయావు కదరా.. అంటూ అపర్ణ ఏడస్తుంది. అక్కడే ఉన్న రుద్రాణిని రాహుల్ మమ్మీ గుండె పట్టినట్టుగా లేదా నీకు అని అడుగుతాడు. ఉందని రుద్రాణి చెప్పగానే.. మరి నీ కళ్లలో నీళ్లు రావడం లేదేంటి మమ్మీ అంటాడు. గుండెను రాయిగా మార్చుకున్నాను. వాడు దూరం అయితేనే కదా..? నువ్వు కంపెనీకి సీఈవో అవుతావు అంటుంది. దీంతో రాహుల్ ఈ కాసేపైనా మనుషుల్లా మట్లాడుకుందాం మమ్మీ.. ఎలాగూ రాజ్ తిరిగి రాడు కదా అంటాడు. మరోవైపు కింద పంతులు చదువుతున్న మంత్రాలు పైన రూంలో ఉన్న కావ్యకు వినబడగానే ఆశ్చర్యంగా లేచి వస్తుంది. బయటకు వచ్చి రాజ్‌కు కర్మ జరిపించడం చూసి షాక్ అవుతుంది.
గట్టిగా ఆపండి అని అరుస్తూ దగ్గరకు వచ్చి అందరినీ తిడుతూ.. ఏంటిది మామయ్యగారు ఏం చేస్తున్నారు మీరు అంటూ ప్రశ్నిస్తుంది. దీంతో సుభాష్ తప్పదమ్మా నా కొడుక్కి ఉత్తమగతులు లేకుండా చేసే అధికారం నాకు లేదమ్మా అంటాడు. ఉత్తమ గతులు ఈ లోకంలో లేని వారికి చేయాలి మామయ్య ఉన్నవారికి కాదు అంటుంది కావ్య. అపర్ణ ఏడుస్తూ.. గుండె రాయిని చేసుకో కావ్య.. ఈ నిజాన్ని జీర్ణం చేసుకో చిన్న వసులోనే నీకు చాలా కష్టం వచ్చింది తల్లి.. ఏం చేస్తాం. మన తలరాతను ఎవ్వరూ మార్చలేరు అటుంది. దీంతో కావ్య ఏడుస్తూ అత్తయ్యా మీకు ఎన్ని సార్లు చెప్పాలి. ఆయన ప్రాణాలతోనే ఉన్నారు అత్తయ్యా నా కళ్లతో నేను చూశాను. మీరే నమ్మకపోతే ఎలా అంటుంది. దీంతో ఇందిరాదేవి అమ్మా కావ్య రాను రాను నువ్వు ధైర్యాన్ని కోల్పోయి మతిస్థిమితం పోగొట్టుకుంటున్నావు. నీకు మేమున్నాం తల్లి.. ఈ కార్యక్రమాన్ని ఆపొద్దు తల్లి.. అంటుంది. దీంతో కావ్య అయ్యో బతికున్న మనిషికి కర్మకాండలు జరిపించడం ఏంటి..? నన్ను నమ్మండి ఫ్లీజ్ అంటూ వేడుకుంటుంది.
రుద్రాణి మాత్రం కాస్త నిదానంగా ఆలోచించు కావ్య ఈ శ్రాద్దకర్మలు చేయకపోతే వాడి ఆత్మ ఎలా సతోషిస్తుంది. కాస్త లోపలికి తీసుకెళ్లండి అని చెప్పగానే.. స్వప్న, అప్పు వచ్చి కావ్యను లోపలికి తీసుకెళ్తుంటే.. ఏంటే అందరిలాగే మీరు నమ్మడం లేదా..? ఎందుకే ఎవ్వరూ నన్ను నమ్మడం లేదు అంటూ ఏడుస్తుంది. స్వప్న ముందు నువ్వు లోపలికి రావే.. అంటూ లోపలికి తీసుకెళ్లబోతుంటే విదిలించుకుని అందరినీ తిడుతుంది. నా పసుపు కుంకుమలు తుడిచేసే హక్కు ఎవ్వరికీ లేదు.. నా ఐదో తనాన్ని తీసేసే హక్కు ఇక్కడ ఎవ్వరికీ లేదు.. అంటూ ఏడుస్తుంది. దీంతో అపర్ణ ఏడుస్తూ కావ్య అడ్డుపడకే నీ తలరాత ఇంతేనని సరిపెట్టుకో.. పసుపు కుంకుమ తీయాలా లేదా అనేది నీ ఇష్టం. కానీ నా కొడుక్కి తిలోదకాలు వదలకపోతే జీవితాంతం అది మమ్మల్ని దహించి వేస్తుంది. ఈ తంతు జరగనివ్వు కావ్య నీకు దండం పెడతాను.. అంటూ రోదిస్తుంది.
మీ కొడుకు నిజంగా చనిపోయి ఉంటే నేనే మీకు అందరికీ కొడుకులా ఉండేదాన్ని కానీ ఆయన బతికేఉన్నారు అత్తయ్యా అని చెప్పగానే.. అపర్ణ ఏంటి అత్తయ్యా ఇది అంతా అయోమయంగా ఉంది. కావ్య ఇంత నమ్మకంగా చెప్తుంటే.. మనం మూర్ఖంగా ప్రవర్తిస్తున్నామా..? మనమే నిజంగా రాక్షసంగా మారిపోయామా..? ఏం చేయాలో నాకు తెలియడం లేదు అత్తయ్యా అంటుంది. దీంతో ఇందిరాదేవి నాన్నా సుభాష్ ఏం చేద్దాంరా..? కావ్య మాటలు వింటుంటే నాకు ఎటూ పాలు పోవడం లేదు. మతి స్థిమితం లేకపోతే తను ఇంత కచ్చితంగా మాట్లాడుతుందా..? ఏం చేద్దాం రా..? అని అడగ్గానే.. సుభాష్ అమ్మా రాజ్ నిజంగా బతికే ఉంటే కావ్యనే కనక వాడు చూసి ఉంటే వదిలేసి ఎలా వెళ్లిపోతాడమ్మా.. కావ్య బ్రమ పడుతుంది. మన అందరిని కూడ అదే భ్రమలోకి నెట్టేస్తుంది. అనగానే.. రుద్రాణి అవును భ్రమ పడుతుంది. ముందు ఎవరైనా హాస్పిటల్‌కు తీసుకెళ్లండి అని చెప్పగానే.. కళ్యాణ్ నువ్వు అప్పు కలిసి కావ్యను హాస్పిటల్‌కు తీసుకెళ్లండి అని ధాన్యలక్ష్మీ చెప్పగానే.. కావ్య కోపంగా ధాన్యలక్ష్మీని తిడుతుంది. నేను పూర్తి ఆరోగ్యంగానే ఉన్నాను అంటుంది. కావ్య ఎంత చెప్పినా వినకుండా కర్మ జరిపిస్తుంటే.. రాజ్ ఫోటో తీసుకుని లోపలికి వెళ్లిపోతుంది.
మరోవైపు రాజ్ తనకు ప్రశాంతత లేకుండా చేస్తున్నాడు అంటూ ఇరిటేటింగ్ గా ఫీలవుతుంది యామిని. ఎందుకు ఏం చేస్తున్నాడు అని వైదేహి అడగ్గానే.. తను ఎవరినో కాపాడాడు అంట.. తన గురించే ఆలోచిస్తున్నాడు.. అంటూ కోపంగా తిడుతుంటే.. సరేలే బేబీ రాజ్ ఆలోచిస్తే తలనొప్పి వస్తుంది కానీ గతం గుర్తుకు వస్తుందా..? అంటూ ప్రశ్నిస్తుంది. దీంతో యామిని కోపంగా వైదేహిని తిడుతుంది. రాజ్ కాదు రామ్ అని పిలవాలి అంటుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?