Phone Tapping Case Updates: ఫోన్ ట్యాపింగ్ కేసు బయటకు వచ్చిన ప్రతీసారి బీఆర్ఎస్ కీలక నేతలకు టెన్షన్ మొదలైందా? ఎక్కడ తమ పేరు బయటకు వస్తాయోమోనని బెంబేలెత్తుతున్నారా? కీలక నిందితుల చుట్టూ ఉచ్చు బిగియడంతో టెన్షన్ మరింత పెరిగిందా? ఈ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుందా? ప్రధాన నిందితులకు రెడ్ కార్నర్ నోటీసు జారీ అయ్యిందా? ఏప్రిల్ సెకండ్ వీక్ నాటికి నిందితులు హైదరాబాద్ కు రావడం ఖాయమా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
టెన్షన్‌లో ఆ నేతలు
బీఆర్ఎస్ కీలక నేతలకు కష్టాలు చుట్టుముట్టాయి. ఏడాదిగా ఫోన్ ట్యాపింగ్ కేసు నుంచి తప్పించుకున్నారు. ఇప్పుడు అన్నిదారులు మూసుకుపోయాయి. కీలక నిందితులు అసలు నిజాలు చెబితే తమ పరిస్థితి ఏంటన్న టెన్షన్ మొదలైపోయింది. తమ పొలిటికల్ కెరీర్ ముగిసినట్టేనని అంటున్నారు. ఈ ఉచ్చులో అప్పటి ప్రభుత్వ కీలక పెద్దలు ఉన్నట్లు తెలుస్తోంది. నిందితులు హైదరాబాద్‌కు రాకముందే అమెరికాకు వెళ్లాలని ఒకరిద్దరు ప్లాన్ చేస్తున్నట్లు కారు పార్టీ నుంచి ఓ ఫీలర్ బయటకు వచ్చింది.
రెడ్‌కార్నర్ నోటీస్ జారీ
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం జరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఐఎస్‌బీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావు, మరో కీలక నిందితుడు శ్రవణ్‌రావులను విదేశాల నుంచి రప్పించేందుకు దాదాపుగా మార్గం సుగమమైంది. వారిపై రెడ్‌కార్నర్ నోటీస్ జారీ అయ్యింది. ఈ మేరకు ఇంటర్ పోల్ నుంచి సీబీఐ ద్వారా తెలంగాణ సీఐడీకి సమాచారం వచ్చింది.
వీలైనంత త్వరగా వారిద్దరిని తెలంగాణకు తీసుకురావడానికి పావులు కదుపుతున్నారు. సీబీఐ అధికారులతో పోలీసులు సంప్రదింపులు తీవ్రతరం చేశారు. రెడ్ కార్నర్ నోటీస్ గురించి అమెరికాలో యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోం ల్యాండ్ సెక్యూరిటీకి సమాచారం ఇచ్చే పనిలో పోలీసులు రెడీ అయ్యారు. ఆ సమాచారం డీహెచ్‌ఎస్‌కు చేరితే నిందితులను తాత్కాలికంగా అరెస్ట్ చేయవచ్చు.
ALSO READ: మార్చి 21 నుంచి పదో తరగతి పరీక్షలు
ఆ తర్వాత డిపోర్టేషన్ ప్రక్రియ ద్వారా అమెరికా నుంచి భారత్‌కు రానున్నారు. అయితే ప్రొవిజనల్ అరెస్ట్‌ను అక్కడి న్యాయస్థానంలో నిందితులు ఛాలెంజ్ చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. రాజకీయ ఆశ్రయం కల్పించాలంటూ నిందితులు ఇప్పటికే పిటిషన్ దాఖలు చేశారు. దీంతో అక్కడి కోర్టు ఆ అంశాన్ని ఏ విధంగా పరిగణనలోకి తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.
అక్కడ న్యాయస్థానంలో ఊరట లభించకపోతే వారిని డిపోర్ట్ చేయడం ఖాయమని అంటున్నారు. వారిద్దరిని అమెరికా నుంచి భారత్‌కి తిప్పి పంపనున్నారు. నిందితులపై అన్ని ఎయిర్‌పోర్టుల్లో లుక్ అవుట్ సర్క్యులర్ జారీ అయ్యాయి. దీంతో విమానాశ్రయంలో ఆపి హైదరాబాద్ పోలీసులకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. వారిని హైదరాబాద్‌కు రప్పించ గలిగితే ఈ కేసు దర్యాప్తు రాజకీయ మలుపు తిరిగే అవకాశం ఉంది.
అమెరికాలో ఎక్కడ ఉంటున్నారు?
రెడ్ కార్నర నోటీసు విషయం తెలియగానే ప్రభాకర్ రావు కెనడా, శ్రవణ్‌రావు బెల్జియం వెళ్లినట్టు తెలుస్తోంది. వెంటనే వారు ఆయా ప్రాంతాల నుంచి అమెరికాకు చేరుకునే అవకాశం ఉంది. ట్రీట్‌మెంట్ కోసం అమెరికా వెళ్లారు ప్రభాకర్‌రావు. ఆయన ఇల్లినాయిస్‌లోని అరోరాలో ఉన్నారు. మియామిలో శ్రవణ్‌రావు ఉన్నట్లు గతంలో కోర్టుకి సమాచారం ఇచ్చారు పోలీసులు.
నిందితులు విదేశాలకి పారిపోయారని భావించారు హైదరాబాద్ పోలీసులు. దీంతో ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయాలకి నివేదిక పంపి వారి పాస్‌పోర్టును ఇప్పటికే రద్దు చేయించారు. ఈ క్రమంలో రెడ్ కార్నర్ నోటీస్ జారీ కావడం కొత్త మలుపు తిరిగింది.
ఈ కేసులో అరెస్టయిన మాజీ పోలీస్ అధికారులు ప్రణీత్‌రావు, భుజంగరావు, తిరుపతన్న సహా మాజీ ఓఎస్డీ రాధాకిషన్‌వు వాంగ్మూలాలను నమోదు చేశారు. ప్రభాకర్‌రావు, శ్రవణ్‌రావులే కీలక నిందితులని చెప్పారు. వారిని విచారిస్తే ఫోన్ అక్రమ ట్యాపింగ్ లోగుట్టు కనిపెట్టవచ్చు. అప్పుడే దీని వెనుక రాజకీయ పెద్దల ప్రమేయం తేలనుంది.