Crorepati Plan: ఒక కప్ కాఫీ… ఒక స్నాక్… ఒక చిన్న షాపింగ్, ఇవన్నీ కలిపితే రోజు ఖర్చు రూ.300 అవుతుంది. ఇది మీకు పెద్దగా అనిపించకపోవచ్చు, కానీ ప్రతిరోజూ అదే రూ. 300 మనం ప్లాన్ ప్రకారం పెట్టుబడి చేస్తే? ఊహించలేని మొత్తం మీకు లభిస్తుంది. మీరు నమ్మకపోయినా, ఇది నిజం. SIP ద్వారా రోజుకు రూ.300 పెట్టుబడి చేస్తే, మీరు 1 కోటి పొందవచ్చు. ఎలాంటి బిజినెస్ లేదనుకుంటున్నా, ఈ చిన్నదైన ఫైనాన్షియల్ డిసిప్లిన్ మీ జీవితాన్ని మార్చే అవకాశాన్ని కల్పిస్తుంది. ఇలాంటి SIP ప్లాన్ మీకు నిధులు మాత్రమే కాకుండా, భవిష్యత్తు భద్రత, డ్రీమ్ హౌస్, పిల్లల ఎడ్యుకేషన్ వంటి అనేక అంశాలను సాధ్యం చేసుకోవచ్చు. అయితే ఇది ఎలా సాధ్యం, దీని కోసం ఏం చేయాలనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
SIP అంటే ఏంటి?
మ్యూచువల్ ఫండ్ SIP అనేది ఒక ప్రణాళిక ప్రకారం చేసే పెట్టుబడి పద్ధతి. దీని ద్వారా ప్రతి నెలా మీరు ఒక ఫిక్స్‌డ్ అమౌంట్‌ను మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడి పెడతారు. దీనివల్ల మార్కెట్ హెచ్చుతగ్గులకు లోనైనా కూడా మీకు యావరేజింగ్ ప్రయోజనం లభిస్తుంది. ఈ క్రమంలో మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పవచ్చు.
రోజు రూ.300
ఈ క్రమంలో మీరు రోజుకు రూ. 300 సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా కోటి రూపాయలు వచ్చేందుకు ఎంత సమయం పడుతుందనేది ఇప్పుడు చూద్దాం.
-రోజుకు రూ.300
-అంటే నెలకు రూ. 300 × 30 = రూ.9,000
-సంవత్సరానికి రూ. 1,08,000 పెట్టుబడి
-కాలవ్యవధి: 19 సంవత్సరాలు
-అంచనా రాబడి రేటు: 15% ఏటా
-19 ఏళ్ల తర్వాత మీ సంపద ఎంత?
ఈ డేటా ఆధారంగా ఫైనాన్షియల్ SIP క్యాలిక్యులేటర్ ద్వారా లెక్కలు వేస్తే:
-మొత్తం పెట్టుబడి: రూ.9,000 × 12 × 19 = రూ. 20,52,000
-రాబడిగా వచ్చే మొత్తం: దాదాపు రూ. 1,02,00,000 (ఒక కోటి రూపాయల పైగా!)
-మీకు వచ్చే లాభం: రూ. 81,50,000 పైగా
Read Also: Baba Vanga: బాబా వంగా భయానక జోస్యం..మనిషి మనసుని …
ఎలా ప్రారంభించాలి?
రోజుకు ఎంత ఆదా చేయగలిగితే, దాన్ని నెలవారీగా మార్చండి. ఉదాహరణకి రూ.300 రోజుకు అంటే రూ.9,000 నెలకు. తర్వాత సరైన ఫండ్ ఎంచుకోండి. Long-term wealth creation కోసం Equity Mutual Funds బెటర్. ఒకసారి మొదలెట్టిన తర్వాత… వదలొద్దు. మార్కెట్ అప్ & డౌన్ రెండూ ఉంటాయి. కానీ మీ పెట్టుబడి క్రమం మాత్రం బ్రేక్ కాకూడదు.
ఎందుకు 15% రాబడి సాధ్యమే
పూర్తి మార్కెట్ చరిత్రను చూస్తే, Nifty 50 లేదా Sensex లాంటి ఇండెక్స్‌లు 12-17% CAGR (Compound Annual Growth Rate) ఇచ్చాయి. Long term పెట్టుబడి వల్ల మార్కెట్ ఫ్లక్చుయేషన్స్‌ను అవరిడ్జ్ చేసి మనం మున్ముందు అధిక లాభాలు పొందవచ్చు.
ఓ చిన్న మార్పుతో పెద్ద భవిష్యత్తు!
మనల్ని చూసే పిల్లలు మనం ఎలా డబ్బు ఆదా చేస్తున్నామో, ఎలాంటి పెట్టుబడులు పెడుతున్నామో గమనిస్తారు. రోజుకు కేవలం రూ.300 అనేది చిన్న విషయం లాగా అనిపించినా, దాని ద్వారా భవిష్యత్తులో మన కుటుంబానికి ఆర్థిక భద్రత కలుగుతుంది. ఇది కేవలం పెట్టుబడి కాదు. మన భవిష్యత్తుకు ఇచ్చే గిఫ్ట్.
చిన్న మొత్తాలతో పెద్ద లక్ష్యాలు సాధించవచ్చు
పిల్లల విద్య కోసం 20 ఏళ్లలో రూ.50 లక్షలు
రిటైర్మెంట్: 25 ఏళ్లలో రూ.1 కోటి పైగా
గృహ కొనుగోలు: 10-15 ఏళ్లలో రూ.40-60 లక్షలు