BigTV English

Pomegranate Peel: ఇదేందిరా మామ.. దానిమ్మ తొక్కలతో తెల్లజుట్టు నల్లగా మార్చుకోవచ్చా..?

Pomegranate Peel: ఇదేందిరా మామ.. దానిమ్మ తొక్కలతో తెల్లజుట్టు నల్లగా మార్చుకోవచ్చా..?

Pomegranate Peel: ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరిని వేధిస్తున్న సమస్య తెల్లజుట్టు.. నిండా పాతికేళ్లు రాకుండానే వైట్ హెయిర్ వచ్చేస్తుంది. ఇందుకు ప్రధాన కారణం.. బయట కాలుష్యం, దుమ్మూ ధూళి, స్ట్రెస్ ఒకటైతే.. కొంత మందికి జన్యులోపం వల్ల చిన్న వయసులోనే తెల్లజుట్టు వస్తుంది. దీనిని బాలనెరుపు అంటారు. ఇందుకోసం చాలా మంది తెల్లజుట్టును కవర్ చేసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తుంటారు. అయిన ఫలితం ఉండదు.


ముఖ్యంగా వైట్ హెయిర్ రాకుండా ఉండాలంటే సరైన ఆహారం తీసుకోవాల్సిందే. ప్రతిరోజు వ్యాయామం చేయాలి. జుట్టు బలంగా ఉండాలంటే పండ్లు, ఆకు కూరలు తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటితో పాటు మరికొన్ని నాచురల్ టిప్స్ ఫాలో అయ్యారంటే మంచి ఫలితం ఉంటుంది. ఇందుకోసం ఒక్కసారి దానిమ్మ తొక్కల్లో మరికొన్ని పదార్ధాలు కలిపి ఇలా ట్రై చేయండి. మంచి రిజల్ట్ మీకు కనిపిస్తాయి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

☀ కావాల్సిన పదార్ధాలు
⦿ దానిమ్మ తొక్కలు
⦿ ఆవాల నూనె
⦿ ఉసిరి పొడి
⦿ కలోంజీ సీడ్స్
⦿ గోరింటాకు పొడి


☀ తయారు చేసుకునే విధానం
ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని, అందులో దానిమ్మ తొక్కలు, కలోంజీ సీడ్స్ వేసి బాగా నల్లగా మారేంత వరకు వేయించండి. ఇప్పుడు స్టవ్ కట్టేసి వీటిని మిక్సీ జార్ తీసుకుని మెత్తగా పొడిలాగా చేసుకోండి. ఈ మిశ్రమాన్ని వేరే గిన్నెలోకి తీసుకుని అందులో కప్పు ఆవాల నూనె, ఉసిరి పొడి, గోరింటాకు పొడి వేసి బాగా మిక్స్ చేయండి. దీన్ని జుట్టుకు పెట్టుకుని గంట తర్వాత సాధారణ షాంపూతో తలస్నానం చెయ్యండి. ఇలా వారానికి రెండు సార్లు క్రమం తప్పకుండా చేస్తే.. తెల్లజుట్టు నల్లగా మారుతుంది. సాధారణంగా దానిమ్మ ఆరోగ్యానికి, చర్మ సౌందర్యానికి మంచిదని మనందరికి తెలిసిందే.. అయితే తెల్లజుట్టుకు కూడా అద్భుతంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇక ఆవాల నూనె గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. జుట్టుకు చక్కగా పనిచేస్తుంది. గోరింటాకు పొడి, ఉసిరి పొడి జుట్టు సంరక్షణకు, జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంలో తోడ్పడతాయి. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ చిట్కాను ఓసారి ట్రై చేయండి.

తెల్లజుట్టు నల్లగా మార్చేందుకు ఈ చిట్కా కూడా ఓసారి ట్రై చేయండి. మంచి ఫలితం ఉంటుంది. ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

☀ కావాల్సిన పదార్గాలు
⦿ ఎండబెట్టిన ఉసిరి ముక్కలు
⦿ నిగెల్లా సీడ్స్
⦿ మెంతులు
⦿ పసుపు
⦿ అలోవెరా
⦿ కొబ్బరి నూనె

☀ తయారు చేసుకునే విధానం
ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో.. ఎండిపోయిన ఉసిరి ముక్కలు, నిగెల్లా సీడ్స్, మెంతులు, పసుపు వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి మందపాటి పాన్ పెట్టుకుని, అందులో తయారు చేసుకున్న పొడిని చేసి బాగా నల్లగా మారేంత వరకు వేయించండి. స్టవ్ కట్టేసి ఈ మిశ్రమాన్ని చిన్న గిన్నెలోకి తీసుకుని.. అందులో టీ స్పూన్ అలోవెరా జెల్, కొబ్బరి నూనె కలిపి మిక్స్ చేయండి. దీన్ని జుట్టుకు అప్లై చేసి గంట తర్వాత తలస్నానం చెయ్యండి. ఇలా నెలకు రెండు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఈ టిప్స్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు. జుట్టు కూడా ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది.

☀ గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

Weight Gain Fast: ఈ ఫుడ్ తింటే.. తక్కువ సమయంలోనే ఎక్కువ బరువు పెరగొచ్చు !

Spirulina Powder for Hair: డైలీ ఒక్క స్పూన్ ఇది తింటే చాలు.. ఊడిన చోటే కొత్త జుట్టు. 100 % రిజల్ట్ !

Navratri Special Recipes: నవరాత్రి స్పెషల్ వంటకాలు.. నైవేద్యంలో తప్పకుండా ఇవి ఉండాల్సిందే !

Poor Kidney Function: కిడ్నీలు ఫెయిల్ అయ్యాయని తెలిపే.. సంకేతాలు ఇవే !

Type 5 Diabetes: టైప్-5 డయాబెటిస్ బారిన పడుతున్న యువత .. లక్షణాలు ఎలా ఉంటాయంటే ?

Heart Disease: గుండె సంబంధిత సమస్యలకు చెక్ పెట్టే.. 5 సూపర్ ఫుడ్స్ ఇవే !

Ghost In Dreams: నిద్రకు ముందు ఇలాంటి పనులు చేస్తే.. దెయ్యాలు కలలోకి వస్తాయ్, జర భద్రం!

Sleep on Side: గుండె సేఫ్ గా ఉండాలంటే ఏ సైడ్ పడుకోవాలి? డాక్టర్లు ఏం చెప్తున్నారంటే?

Big Stories

×