BigTV English
Advertisement

Naveen Chandra : త్రివిక్రమ్ అయినా సరే.. ఈయన కండీషన్స్ కి ఒప్పుకోవాల్సిందే..

Naveen Chandra : త్రివిక్రమ్ అయినా సరే.. ఈయన కండీషన్స్ కి ఒప్పుకోవాల్సిందే..

Naveen Chandra : అందాల రాక్షసి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరో నవీన్ చంద్ర. తమిళంలో సినిమా చేయాలని మొదటి అడుగు వేసిన నవీన్ చంద్రకి అక్కడ అవకాశం రాకపోవడంతో, తెలుగులో అవకాశాలు వెతుక్కున్నాడు. అందాల రాక్షసి సినిమాతో తెలుగులో యూత్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. తర్వాత ఎన్నో సినిమాలను తెలుగులో చేశారు. నాని హీరోగా ‘నేను లోకల్’ సినిమాలో విలన్ పాత్రలో నవీన్ చంద్ర నటించి మెప్పించారు. హీరోగా, విలన్ గా క్యారెక్టర్ ఏదైనా, ఎటువంటి పాత్ర వచ్చిన ఆ పాత్రకు న్యాయం చేయడంలో నవీన్ చంద్ర ముందుంటారు. తాజాగా ఆయన నటించిన చిత్రం 28 డిగ్రీ సెల్సియస్ థియేటర్లలో సందడి చేయనుంది. విశ్వనాథ్ ఈ సినిమా కి దర్శకత్వం వహించారు. సాయి అభిషేక్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శాలిని వడ్ని కట్టి హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సందర్భంగా నవీన్ చంద్ర ఇచ్చిన ఇంటర్వ్యూలో టాప్ డైరెక్టర్స్ గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆ డైరెక్టర్స్ ఎవరూ..? ఆయన ఏం మాట్లాడారు ఇప్పుడు చూద్దాం..


టాప్ డైరెక్టర్ తో ఇదే ఇబ్బంది ..

పెద్దపెద్ద డైరెక్టర్ తో మీరు సినిమాలు తీస్తే, మీకు కథ చెప్పే అంత టైం వాళ్లకు ఉంటుందా లేదా అని యాంకర్ అగిగిన ప్రశ్నకు, నవీన్ చంద్ర మాట్లాడుతూ.. ‘వాళ్లకు టైం కచ్చితంగా ఉండదు కానీ,  ముందుగా చెప్పలంటే డైనమిక్ డైరెక్టర్ శంకర్ గారి సినిమాలో గేమ్ చేంజర్ సినిమాకి నాకు చెప్పిన క్యారెక్టర్ నాకు అర్థమయ్యే వరకు.. నేను వాళ్ళ దగ్గరే ఉండి చెప్పించుకుని చేస్తాను. నేను వెళ్లి శంకర్ గారిని అడిగి సార్ ఇలా చేద్దాం అని నేను చెప్తే ఆయన వద్దు ఇలా చెయ్యి అని చెప్తారు. చేసిన తర్వాత కూడా నాకు సరిగా చేయలేదనిపిస్తే నేను వాళ్లకి చెప్పేస్తాను. అంతా బాగుంది అనుకుంటే ఓకే అంటారు.


డైరెక్టర్ ఎవరైనా, నాకు నచ్చితేనే చేస్తాను ..

ఇంకా నవీన్ చంద్ర మాట్లడుతూ .. ‘మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సార్ తో, అరవింద సమేత చేసేటప్పుడు, బాలిరెడ్డి క్యారెక్టర్ కోసం నన్ను తీసుకున్నారు. ఆ క్యారెక్టర్ చెప్పగానే నేను ముందు అమీర్ పేట వెళ్లి అక్కడ ఆ క్యారెక్టర్ కి తగిన కాస్టూమ్స్ తీసుకొని అవి డైరెక్టర్ గారికి చూపించి, దాని గురించి మొత్తం తెలుసుకున్నాకే చేశాను. సార్ కూడా బాగుంది అని చేయమన్నారు. నేను ఏ క్యారెక్టర్ అయినా క్షుణ్ణంగా తెలుసుకున్నాకే చేస్తాను. ఇప్పటివరకు నేను చేసిన డైరెక్టర్లు అందరూ క్యారెక్టర్ ని నాకు ఎప్పుడూ విసుక్కోకుండా చెప్పారు అదే నా అదృష్టం. చిన్న డైరెక్టర్ అయినా పెద్ద డైరెక్టర్ అయినా ఎవరైనా సరే ఒకవేళ వాళ్ళ దగ్గర నుంచి నాకు ఇన్ఫర్మేషన్, ఫుల్ డీటెయిల్స్ దొరక్కపోతే నేనే వెళ్లి అడుగుతాను. స్క్రీన్ మీద నేను బాగా కనిపించాలి, కథ నాకు చెప్పిన క్యారెక్టర్ క్షుణ్ణంగా తెలుసుకున్నాకే సినిమా చేశాను. నేను అందాల రాక్షసి సినిమా తీసేటప్పుడు అనురాగ్ గారిని చూసి ఈ క్వాలిటీ నేర్చుకున్నాను అని’ నవీన్ చంద్ర తెలిపారు. ఇక సినిమా విషయానికి వస్తే.. రవితేజ హీరోగా వస్తున్నా మాస్ జాతరలో ఒక కీలక పాత్ర, ఇన్స్పెక్టర్ 2 చిత్రాలు ప్రస్తుతం నవీన్ చంద్ర చేతిలో ఉన్నాయి.

Also read: Jack సెన్సారు పూర్తి ..యు/ఎ…రెండు గంటల పది నిమిషాలు లెంగ్త్.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×