BigTV English

Samantha : సామ్ కొత్త బాయ్ ఫ్రెండ్.. త్వరలోనే పెళ్లి డేట్ లాక్ ..?

Samantha : సామ్ కొత్త బాయ్ ఫ్రెండ్.. త్వరలోనే పెళ్లి డేట్ లాక్ ..?

Samantha : టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఒకప్పుడు టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. కానీ ఇప్పుడు హిందీలో బిజీ హీరోయిన్.. తమిళ సినీ ప్రపంచంలో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన సమంత చెన్నైలో పెరిగారు.. అలా చైన్నై నుంచి కేరళ ప్రయాణం సాగింది. చివరకు తెలుగు చిత్ర పరిశ్రమలో సక్సెస్ అయ్యింది. ఇప్పటివరకు సామ్ నటించిన ప్రతి సినిమా బాక్సాఫీస్ రికార్డ్ లను బ్రేక్ చేసింది. 2010లో ఒక తమిళ చిత్రంలో చిన్న పాత్రతో సినీ రంగ ప్రవేశం చేసిన సమంత, తర్వాత ‘ఏ మాయ చేశావే’ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఈ సినిమాలో ఆమెతో పాటు నటించిన నాగ చైతన్యతో ప్రేమలో పడింది. కొన్నాళ్ళ పాటుగా డేటింగ్ చేసి పెళ్లి చేసుకుంది.. ఇప్పుడు మరో వ్యక్తిని పెళ్లి చేసుకోబోతుందనే వార్త షికారు చేస్తుంది.


సమంత, నాగ చైతన్య ప్రేమించి ఇంట్లో పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. అయితే వీరి బంధం ఎక్కువ రోజులు నిలవలేదు. 2017లో వివాహం చేసుకున్నారు. అయితే, నాలుగు సంవత్సరాల తరువాత, 2021లో వారు విడిపోయారు. ఆరోగ్య సమస్యల కారణంగా కొంతకాలం సినిమాలకు విరామం తీసుకున్న సమంత, ఇప్పుడు తిరిగి సినిమాల్లో రీఎంట్రీ ఇచ్చారు. ఆమె మంచి కథలను ఎంచుకుంటూ, ప్రాజెక్ట్‌లపై దృష్టి పెడుతున్నారు. ప్రస్తుతం నాగ చైతన్య నటి శోభిత ధూళిపాళ్లను వివాహం చేసుకోబోతున్నాడు. ఆగస్టు 8 న ఆమెతో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. త్వరలోనే పెళ్లితో ఈ జంట పెళ్లి చేసుకోబోతున్నారు. అయితే సమంత మాత్రం రెండో పెళ్లి గురించి ఎక్కడ ప్రస్తావించలేదు. ఈమె కూడా ఒక తోడును వెతుక్కుంటే బాగుండు అని ఆమె ఫ్యాన్స్ అనుకున్నారు. త్వరలోనే ఆ కోరిక నేర వేరే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది..

అసలు మ్యాటర్ కు వస్తే.. సమంత తన బాయ్ ఫ్రెండ్ తో ఉన్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.. తాజాగా సమంత ఒక వివాహ వేడుకలో ఒక యువకుడితో చేయి చేయి పట్టుకుని నడుస్తున్న వీడియో వైరల్ అయ్యింది. ఈ వీడియోని చూసిన నెటిజన్లు, ఆ అబ్బాయి సమంత కొత్త బాయ్‌ఫ్రెండ్ అని భావించారు. అయితే, దర్శిని సూర్య ప్రకటించిన వివరాల ప్రకారం, ఆ యువకుడు సమంతకు చాలాకాలంగా స్నేహితుడు.. వీరిద్దరూ కలిసి ట్రిప్ లు వేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా వీరిద్దరూ కలిసి ఈ పెళ్లి వేడుకకు హాజరయ్యారు. అక్కడ వీరిద్దరూ దిగిన ఫోటోనే ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. నిజంగానే వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారా? త్వరలోనే పెళ్లి చేసుకుంటారా? అన్నది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా ఈడు జోడు బాగున్నాడని పెళ్లి చేసుకోవాలని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి సామ్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.. ఇకపోతే ప్రస్తుతం సామ్ హిందీలో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. తెలుగులో సినిమాలు చేస్తుందో? లేదో చూడాలి..


Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×