Post Office: ఆగస్టు ఒకటి నుంచి దేశవ్యాప్తంగా పోస్టాఫీసుల్లో డిజిటల్ చెల్లింపులను మొదలుకానున్నాయి. దీనికి సంబంధించి తెర వెనుక పనులు వేగంగా జరుగుతున్నాయి. పోస్టాఫీసులతో ప్రజలు చేసే ప్రతీ లావాదేవీలను డిజిటల్ రూపంలో చెల్లింపులు చేసుకోవచ్చు.
టీ దగ్గర నుంచి భవనాలు రిజిస్ట్రేషన్ల వరకు చెల్లింపులు డిజిటల్ విధానంలో జరుగుతోంది. ఎక్కడ చూసినా క్యూఆర్ కోడ్ బోర్డులు కనిపిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో బలమై నెట్‌వర్క్ పోస్టాఫీసులు ఈ విషయంలో వెనుకబడ్డాయి. సర్వీసులు అందిస్తున్నా, టెక్నాలజీని ఉపయోగించడంలో పోస్టాఫీసులు వెనుకబడ్డాయి.
ఫలితంగా ప్రైవేటు కొరియర్లు, సర్వేలు వేగంగా పుట్టుకొచ్చాయి. దీన్ని గమనించిన కేంద్ర ప్రభుత్వం, పోస్టాఫీసులకు పూర్వవైభవం తెచ్చేందుకు దృష్టి సారించింది. దేశవ్యాప్తంగా 1.5 లక్షలకు పైగా పోస్టాఫీసులు ఉన్నాయి. ఈ ఏడాది ఆగస్టు ఒకటి నుంచి డిజిటల్ చెల్లింపులు స్వీకరించనున్నాయి. ఈ విషయాన్ని భారత పోస్టల్ విభాగం ప్రకటన చేసింది.
కొత్త విధానం డిజిటల్ ఇండియా మిషన్‌లో కీలకంగా మారనుంది. పోస్టాఫీసులు ఇప్పుటివరకు యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్-UPI వ్యవస్థతో అనుసంధానం కాలేదు. ఈ సమస్యను అధిగమించేందుకు కొత్తగా అప్లికేషన్‌ను అభివృద్ధి చేస్తోంది ప్రభుత్వం. డైనమిక్ క్యూఆర్ కోడ్‌ల ద్వారా లావాదేవీలను సులభతరం కానుంది.
ALSO READ: చిన్న వ్యాపారులకు సువర్ణ అవకాశం, ష్యూరిటీ లేకుండానే రూ. 10 లక్షల వరకు
పోస్టాఫీసుల్లో మనం చేసే ప్రతీ లావాదేవీనీ డిజిటల్ రూపంలో చెల్లించుకోవచ్చు. కొత్త వ్యవస్థ ప్రవేశపెట్టడానికి ముందు కర్నాటక సర్కిల్‌లో పైలట్ ప్రాజెక్ట్‌గా అమల్లోకి తీసుకొచ్చింది.మైసూర్, బాగల్‌కోట్ ప్రధాన పోస్టాఫీసుల్లో వాటి అనుబంధ ఆఫీసుల్లో QR కోడ్‌ల ద్వారా మెయిల్ బుకింగ్, మనీ ఆర్డర్, సేవింగ్స్ అకౌంట్లలో డబ్బు జమ చేయడం వంటివి విజయవంతంగా సక్సెస్ అయ్యాయి.
ప్రారంభంలో స్టాటిక్ క్యూఆర్ కోడ్ ద్వారా డిజిటల్ చెల్లింపులను ప్రవేశపెట్టింది. వాటికి పలు రకాల సమస్యలు వెంటాడాయి. కస్టమర్లు ఫిర్యాదులు చేయడంతో ఆ ప్రయత్నం విఫలమైంది. లోపాలను సరిదిద్దుకొని డైనమిక్ క్యూఆర్ కోడ్‌లతో కొత్త వ్యవస్థను తీసుకొచ్చింది. డిజిటల్ చెల్లింపుల పద్దతి గ్రామాల్లో ఉపయోగపడుతుందని ఆ శాఖ భావిస్తోంది.
దేశంలో ఎక్కువగా గ్రామాలు, పట్టణాల ప్రజలు పోస్టాఫీసుల్లో అకౌంట్లు ఉన్నాయి. పేదలు, మధ్య తరగతి ప్రజలు పోస్టాఫీస్ డిజిటల్ సేవల్ని వినియోగించుకునే అవకాశం ఉంది. ప్రభుత్వాల పథకాల డబ్బులు జమ అయ్యేందుకు పోస్టాఫీస్ అకౌంట్లను ఉపయోగిస్తున్నారు. వారికి అకౌంట్లలో పడే డబ్బులను డిజిటల్ రూపంలో పొందడం వారికి మరింత తేలిక కానుంది.
దీనివల్ల చీటికి మాటికీ పోస్టాఫీస్‌కి వెళ్లాల్సిన అవసరం ఉండదు. డిజిటల్ చెల్లింపుల విధానం దశలవారీగా అమల్లోకి రానుంది. తొలుత పెద్ద పోస్టాఫీసుల్లో అమలు చేయనున్నారు. ఆ తర్వాత మధ్య స్థాయి ప్రాంతాలకు విస్తరించనున్నారు. ఫైనల్ గ్రామాల పోస్టాఫీసుల వంతుకానుంది. ఈ ప్రక్రియను అమలు చేసేందుకు సిబ్బందికి క్యూఆర్ స్కానింగ్ పై ట్రైనింగ్ ఇవ్వనున్నారు.