Megastar Chiranjeevi : తెలుగు రాష్ట్రాల ప్రజలకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా చిత్రసీమలో అడుగుపెట్టిన ఆయన తన నటన, స్టైల్, మేనరిజంతో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. యూత్ ఐకాన్ గా అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు మన పవర్ స్టార్.. ఎన్నో సినిమాలతో అలరించడం మాత్రమే కాదు.. డిప్యూటీ సీఎం గా ప్రజా నాయకుడిగా ప్రజల హృదయాలను గెలుచుకున్నాడు. నేడు ఆయన పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియాలో పవర్ స్టార్ పేరుతో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.. సినీ ప్రముఖులతో పాటుగా రాజకీయ ప్రముఖులు, అభిమానులు.. కుటుంబ సభ్యులు ఆయనకు ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్ ట్వీట్ చేశారు. తమ్ముడి పై ప్రేమను కురిపిస్తూ ఆయన చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
నీ ప్రజాసేవే నీకు రక్ష.. చిరు ట్వీట్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తమ్ముడికి ప్రత్యేకంగా విషెస్ చెప్పుతూ చేసిన ట్వీట్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. చిరు చేసిన ట్వీట్ లో ఏముందంటే.. చలనచిత్ర రంగంలో అగ్రనటుడిగా, ప్రజా జీవితంలో జనసేనాని గా, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రజలకు నిరంతర సేవలందిస్తున్న కళ్యాణ్ బాబుకి జన్మదిన శుభాకాంక్షలు. ప్రజా సేవలో నువ్వు చూపుతున్న అంకితభావం చిరస్మరణీయం.. ప్రజలందరి ఆశీస్సులతో, అభిమానంతో నిండునూరేళ్లు ఆయురారోగ్యాలతో ప్రజలకు మార్గదర్శకుడిగా నిలవాలని ఆశీర్వదిస్తున్నాను. దీర్ఘాయుష్మాన్ భవ!.. అంటూ పేర్కొన్నాడు. ఈ ట్వీట్ పై మెగా అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. అన్నకు తమ్ముడంటే ఎంత ప్రేమో అని కామెంట్స్ చేస్తున్నారు. మొన్న చిరంజీవి బర్త్డే సందర్భంగా కూడా తన తమ్ముడి గురించే ట్వీట్ చేశారు. అది కూడా వైరల్ అయింది.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా ఆయన అభిమానులతో పాటు తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. యువత ఇవాళ పెద్ద పండగే.. ఆయనపై అభిమానాన్ని చాటుతూ అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తూన్నారు..
Also Read : పల్లవి ప్లాన్ సక్సెస్.. శ్రీకర్ పై మర్డర్ కేసు.. మనసులోని అక్కసును కక్కేసిన శ్రీయా..
పవన్ కళ్యాణ్ సినిమాలు..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ చిత్రం హరిహర వీరమల్లు. ఈ మూవీ ఇటీవలే థియేటర్లోకి వచ్చింది. గతంలో ఎన్నడూ చూడని విధంగా పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో కనిపించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. కానీ బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఇక ఈ నెలలో రిలీజ్ కాబోతున్న అభిమానులు సినిమా కోసం అభిమానులు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు.. డైరెక్టర్ సుజిత్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇక హరిష్ శంకర్ కాంబినేషన్లో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.. ఈ సినిమా కూడా దాదాపు షూటింగ్ ని పూర్తి చేసుకుంది. త్వరలోనే విడుదల తేదీని అనౌన్స్ చేసే అవకాశం ఉంది. అటు మెగాస్టార్ కూడా రెండు మూడు భారీ ప్రాజెక్టులలో నటిస్తూ బిజీగా ఉన్నారు..
చలనచిత్ర రంగంలో అగ్రనటుడిగా,
ప్రజా జీవితంలో జనసేనాని గా,
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రజలకు నిరంతర సేవలందిస్తున్న కళ్యాణ్ బాబుకి జన్మదిన శుభాకాంక్షలు.ప్రజా సేవలో నువ్వు చూపుతున్న అంకితభావం చిరస్మరణీయం.
ప్రజలందరి ఆశీస్సులతో, అభిమానంతో నిండునూరేళ్లు ఆయురారోగ్యాలతో ప్రజలకు… pic.twitter.com/13gaXFpWsG— Chiranjeevi Konidela (@KChiruTweets) September 2, 2025