Nindu Noorella Saavasam Serial Today Episode: అమర్, మిస్సమ్మకు శారీ తీసుకోవడం చూసిన చిత్ర, మను దగ్గరకు వెళ్లి బావగారు అక్కడ భాగీకి శారీ తీసుకుంటన్నాడు. నువ్వేమో ఇక్కడున్నావా… వెళ్లి ఎలాగైనా అడ్డుకో అని చెప్తుంది. దీంతో మనోహరి ఇరిటేటింగ్‌గా అమర్ దగ్గరకు వెళ్తుంది. అప్పుడే అమర్‌కు నిజం చెప్పాలని దగ్గరకు వెళ్లబోతున్న సరస్వతి వార్డెన్ మనోహరిని చూసి పక్కకు వెళ్లిపోతుంది. హమ్మయ్యా మనోహరి కంట్లో పడలేదు అనుకుంటుంది. అమర్ దగ్గరకు వెళ్లిన మనోహరి వెరీ నైస్ శారీ అమర్ చాలా బాగుంది. ఎవరికి సెలెక్ట్ చేస్తున్నావు అమర్ ఈ శారీ అని అడుగుతుంది. అమర్ వెంటనే భాగీకి అని చెప్తాడు. దీంతో మనోహరి కోపాన్ని అపుకుంటూ అమర్ నాకు కూడా ఒక శారీ సెలెక్ట్ చేయోచ్చు కదా అని అడుగుతుంది.
దీంతో అమర్ నీ టేస్ట్ ఎలా ఉంటుందో నాకు తెలియదు మనోహరి.. నువ్వు సెలెక్ట్ చేసుకో నేన బిల్ పే చేస్తాను అంటాడు. ఇంతలో అంజు వచ్చి డాడ్ మాకోసం మిస్సమ్మ మంచి మంచి డ్రెస్సులు సెలెక్ట్ చేసింది తెలుసా..? అని చెప్తుంది. మీకు నచ్చాయా..? అని అమర్ అడగ్గానే.. అంజు చాలా బాగా నచ్చాయి డాడ్.. ఇంతకీ ఈ శారీ ఎవరి కోసం సెలెక్ట్ చేస్తున్నారు.. మనోహరి ఆంటీ కోసమా..? అని అడుగుతుంది. దీంతో అమర్ కాదు నాన్న భాగీకి అని చెప్పగానే.. అవునా.. సరే ఓకే డాడ్ అంటూ వెళ్లిపోతుంది అంజు. మనోహరి కోపంగా చిన్న పిల్ల ముందు కూడా నన్ను అవమానిస్తున్నాడు. ఏ ఆ శారీ నాకే అని చెప్తే తన సొమ్మేం పోతుంది. నేను తీసుకుంటే తను డబ్బులు పే చేస్తాడు అంట.. నా దగ్గర డబ్బులు లేవా..? అని మనసులో అనుకంటూ ఇరిటేటింగ్‌గా ఫీలవుతుంది.
మరోవైపు చంభా, ఆరు కోసం షాపింగ్ మాల్ లో వెతుకుతూ ఉంటుంది. మరోవైపు మిస్సమ్మ ను పిల్లుల ఆ శారీ ఈ శారీ తీసుకో అని చెప్తుంటే.. ఇంతలో అంజు పరుగెత్తుకుంటూ వచ్చి ఆగండి అంటూ… మిస్సమ్మకు ఎవ్వరూ శారీ సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. అంటుంది. ఏ అంజు నువ్వు సెలెక్ట్ చేస్తావా..? అని అడుగుతుంది. దీంతో అయ్యో మిస్సమ్మ నేను కాదు పైన డాడ్ నీకోసం శారీ సెలెక్ట్ చేశారు అని చెప్తుంది. దీంతో నిజమా అంజు అంటూ ఆకాష్ అడుగుతాడు. అప్పట్లో డాడీ మమ్మీకి శారీ సెలెక్ట్ చేసేవారు. ఇప్పుడు మిస్సమ్మకు సెలెక్ట్ చేస్తున్నారన్న మాట అంటుంది అమ్ము. అవును ఆ విషయం మీకు చెబుదామనే పరుగెత్తుకుంటూ వచ్చాను అంటుంది అంజు. దీంతో మిస్సమ్మ పో అంజు నువ్వు నాకు అబద్దం చెప్తున్నావు నన్ను ఆట పట్టించాలని చూస్తున్నావు.. అంటుంది మిస్సమ్మ. దీంతో అంజు అయ్యో మిస్సమ్మ నీ మీద ఒట్టు అంటూ అంజు చెప్పగానే.. మిస్సమ్మ డ్రీమ్‌లోకి వెళ్తుంది.
మరోవైపు సరస్వతి వార్డెన్ అక్కడే చూసి మనోహరి అమర్ దగ్గర నుంచి వెళ్లడం లేదని తెలుసుకుని పక్కకు వెళ్లి ఒక లెటర్ రాసి అమర్ ఇవ్వమని అక్కడి స్టాప్‌కు ఇస్తుంది. ఆ లెటర్ అమర్‌కు ఇవ్వకుండా తాను తీసుకుని ఓపెన్ చేసి షాక్ అవుతుంది మనోహరి. వెంటనే పరుగెత్తుకుంటూ లిప్ట్ దగ్గరకు వెళ్తుంది. వెనకాలే వస్తున్న చిత్ర ఏంటి మను బావగారి చేత ఎన్ని శారీస్ కొనిచ్చుకున్నావు అని అడుగుతుంది. శారీస్ కాదే వార్డెన్ ఇక్కడికి వచ్చింది అని మనోహరి చెప్పగానే.. సరస్వతి వార్డెన్ ఇక్కడికి వచ్చారా..? పిల్లలకు బట్టలు కొనడానికి రాజు గారు వస్తారనుకుంటే వార్డెన్ వచ్చిందా..? అదొచ్చింది పిల్లలకు బట్టలు తీసుకోవడానికి కాదు. అమర్‌కు నా గురించి చెప్పడానికి.. అమర్‌ను కలవాలని ఈ స్లిప్ రాసి మీ స్టాప్ తో అమర్‌కు పంపించింది. లక్కీగా అది నా చేతుల్లో పడింది అని చెప్తుంది.
దీంతో ఇప్పుడు ఏం చేద్దాం మను అని అడగ్గానే.. సెల్లార్ లో వెయిట్ చేస్తానని చెప్పింది కదా అక్కడే దాన్ని చంపేస్తాను అంటూ వెళ్తుంది మనోహరి. మనోహరి నుంచి తప్పించుకుని పారిపోతుంది వార్డెన్. తర్వాత అందరూ గణపతిని తీసుకుని ఇంటికి వస్తారు. ఇంట్లో గణపతి ఉత్సవాలకు ఏర్పాట్లు చేస్తారు. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం