Gujrat Rape Case: మనుషులు రోజు రోజుకు దిగజారి పోతున్నారు. పశువుల్లా మారిపోతున్నారు. కన్నుమిన్నూ ఎరుగక కామంతో కళ్లుమూసుకుపోయి ప్రవర్తిస్తున్నారు. గుజరాత్ లోని భావ్ నగర్ జిల్లాలో వెలుగు చూసిన అవమానకరమైన ఘటన గురించి తెలిస్తే నోటమాటరాదు. 22 ఏళ్ల అమ్మాయి తన సోదరుడి చేతిలోనే దారుణంగా అత్యాచారానికి గురైంది. కత్తితో బెదిరిస్తూ, బీడీలతో ఒంటిపై కాల్చుతూ పైశాచికంగా ప్రవర్తించాడు. రోజు రోజుకు అతడి వ్యవహారం శ్రుతి మించి పోవడంతో సదరు యువతి పోలీసులను ఆశ్రయించింది. జరిగిన ఘోరాన్ని చెప్పి కంటతడిపెట్టింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. సదరు వ్యక్తిని అరెస్టు చేశారు.
ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?
సభ్య సమాజం తలదించుకునే ఈ ఘటన భావ్ నగర్ జిల్లాలోని తలాబా పోలీస్ స్టేషన్ లో జరిగింది. తాజాగా ఓ 22 ఏళ్ల అమ్మాయి పోలీస్ స్టేషన్ కు వచ్చి తనకు జరిగిన అన్యాయం గురించి ఫిర్యాదు చేసింది. 22 ఏళ్ల ఆ అమ్మాయి మూడు సంవత్సరాలుగా తన గ్రామానికి చెందిన ఒక యువకుడితో ప్రేమలో ఉన్నది. తరచుగా ఇద్దరూ కలిసి మాట్లాడుకునే వారు. ఈ విషయం తనకు సోదరుడు వరుసయ్యే వ్యక్తి తెలిసింది. అమ్మాయి ప్రేమ గురించి.. ఆమె పేరెంట్స్ కు చెప్తానంటూ బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. జూలై 13, ఆగస్టు 22 తేదీల్లో సదరు యువతి ఒంటరిగా ఉండటాన్ని గమనించి ఇంట్లోకి వచ్చాడు. తనతో పాటు ఓ కత్తిని కూడా తెచ్చుకున్నాడు. ఆ కత్తితో ఆమెను బెదిరించి అత్యాచారం చేశాడు. మరోసారి ఇలాగే చేశాడు. ఈసారి బీడీతో ఆమె ఒంటిపై కాల్చాడు. అతడి వేధింపులు తట్టుకోలేకపోయింది. ఎలాగైనా ఈ బాధ నుంచి బయటపడాలని భావించింది. నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడైన యువకుడికి ఇప్పటికే పెళ్లై ఓ బాబు కూడా ఉన్నాడు.
Read Also: దంపతుల మధ్య చిచ్చు.. అడవిలోకి తీసుకెళ్లి భార్యని పొడిచి, నిప్పుపెట్టాడు
నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు
సదరు యువతి నుంచి ఫిర్యాదు తీసుకున్న పోలీసులు, నిందితుడిని అరెస్టు చేశారు. ఆమెను బెదిరించేందుకు ఉపయోగించిన కత్తి, అత్యాచారం సమయంలో ధరించిన బట్టలు స్వాధీనం చేసుకున్నట్లు దర్యాప్తు అధికారి డిపి ఖంభాల తెలిపారు. బాధితురాలికి, నిందితుడికి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించారు. ఇప్పటికే బాధితురాలి వాంగ్మూలాన్ని నమోదు చేసినట్లు వివరించారు. యువతి ఇంట్లో ఎవరూ లేని సమయంలో వెళ్లి ఆమెపై లైంగిక దాడి చేసినట్లు వెల్లడించారు. నిందితుడైన సోదరుడిపై భారతీయ శిక్షాస్మృతిలోని 64(F)(M), 115(2) సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం అతడిని రిమాండ్ కు తరలించినట్లు వెల్లడించారు. మహిళలు తమపై జరిగే దాడులకు సంబంధించి వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. లేదంటే, వేధింపులు మరింత తీవ్రం అయ్యే అవకాశం ఉందన్నారు.
Read Also: అనంతలో ట్రయాంగిల్ లవ్.. ప్రియురాలి బెదిరింపులు, మరో యువతి సూసైడ్