Last Date Payment: చివరి రోజున క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లిస్తే స్కోర్‌కి నష్టం ఉంటుందా? అనే ప్రశ్న చాలామందిని కలవరపెడుతోంది. కానీ గూగుల్‌లో వెతికితే చాలా సమాధానాలు కనిపిస్తున్నాయి. వాటిలో ఏది నిజం, ఏది అబద్ధం. ఎవరు నమ్మాలి? ఎవరిని ఫాలో అవ్వాలి? మన స్కోర్‌తో చెల్లింపులకి సంబంధం ఎంత? వీటన్నిటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
క్రెడిట్ కార్డ్ వాడకంపై యువత ఆధిపత్యం
భారతదేశంలో క్రెడిట్ కార్డుల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఇది వరకు నగరాలకే పరిమితంగా ఉండేది. కానీ ఇప్పుడు చిన్న పట్టణాల్లో కూడా వీటి వాడకం పెరిగిపోయింది. ఈ క్రమంలో యువత ఎక్కువగా వీటిని ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే తక్కువ సమయంలోనే ఆన్‌లైన్ షాపింగ్, టిక్కెట్ బుకింగ్‌లు, రెస్టారెంట్ బిల్లులు ఇలా అనేక వాటి కార్డులు వాడేస్తున్నారు. అయితే దీని వల్ల ఒక పెద్ద సమస్య వచ్చింది. బిల్లుల చెల్లింపులో జాప్యం. బిల్లులు టైం కి కట్టకపోతే, అది మీ క్రెడిట్ స్కోరును చాలా ప్రభావితం చేస్తుంది.
ముఖ్యమైన విషయమేమిటంటే…
ఈ క్రమంలో మీరు బిల్లు చెల్లించాల్సిన గడువు తేదీ (Due Date)కి చివరి రోజే అయినా సరే మీరు టైంలో పేమెంట్ చేస్తే మీ స్కోరుపై ఎలాంటి ప్రభావం ఉండదు. చాలా మంది ఈ విషయాన్ని అపార్థం చేసుకుంటున్నారు. “చివరి రోజున చెల్లిస్తే Late అన్నమాట కదా!” అని. కానీ నిజం ఏమిటంటే, మీ డ్యూ డేట్ అనేది బ్యాంక్ నిర్దేశించిన గడువు. దాని లోపల మీరు చెల్లిస్తే అది Late Payment కాదు. ఇది అధికారికంగా Timely Payment కిందకు వస్తుంది.
మీరు గడువు తేదీ తరువాత చెల్లిస్తే:
-Late Payment Fee వసూలు అవుతుంది
-CIBIL స్కోర్ దెబ్బతింటుంది
-Statementలో Late Mark వస్తుంది
-భవిష్యత్తులో మీరు లోన్ అప్లై చేస్తే అది నెగెటివ్‌గా కౌంట్ అవుతుంది
-అంటే చిన్న చిన్న పొరపాట్లు మీ ఫైనాన్షియల్ ఫ్యూచర్ మీద పెద్ద ప్రభావం చూపిస్తాయి
Read Also: Realme Narzo 80 launch: అగ్గువ ధరకే 6000mAh బ్యాటరీ …
అప్పుడు ఎలా ప్లాన్ చేయాలి?
-క్రెడిట్ స్కోర్ కాపాడుకోవడం అనేది చిన్న చిన్న డిసిప్లిన్ అలవాట్లతో సాధ్యమే:
-గడువు తేదీ ముందు ఒకరోజు లేదా రెండు రోజులు ముందు చెల్లించండి
-బిల్లింగ్ డేట్, డ్యూయ్ డేట్ అలర్ట్స్ ఆనవే పెట్టుకోండి
-ఆటోపే వేశాక మీ అకౌంట్‌లో బ్యాలెన్స్ ఉండేలా చూసుకోండి
టైంకి క్రెడిట్ కార్డ్ బిల్లులు చెల్లించడం వల్ల ఉపయోగాలు:
-క్రెడిట్ స్కోర్ 750+ మీద ఉంటుంది
-క్రెడిట్ కార్డ్ లిమిట్ పెరుగుతుంది
-లోన్స్, హోం లోన్, బిజినెస్ లోన్ లు ఈజీగా సాన్షన్ అవుతాయి
-ఇంట్రెస్ట్ చార్జీలు తప్పుతాయి
-మనసుకు ప్రశాంతత, ఫైనాన్షియల్ హెల్త్ మెరుగవుతుంది
ఇది కేవలం స్కోర్ గురించే కాదు
మీరు ఈ రోజు రూ.5000 బిల్లు ఆలస్యంగా చెల్లించారంటే, అది పెద్ద విషయం కాదనుకుంటారు. కానీ అదే మీరు కొన్ని నెలలపాటు అలానే చేస్తే, అది మీ CIBIL స్కోరును 700 నుంచి 600కి దిగేసే ప్రమాదం ఉంటుంది. ఆ తరువాత మీరు ఎంత EMI రేటు తక్కువ కావాలని చూసినా కూడా, బ్యాంకులు రిజెక్ట్ చేసే అవకాశం ఉంటుంది.