SRH vs MI: ఇండియన్ ప్రీమియర్ లీగ్ { IPL 2025} 18వ సీజన్ లో సన్రైజర్స్ హైదరాబాద్ మరో కీలక పోరుకు సిద్ధమైంది. ఈ సీజన్ లో వరుస ఓటముల తర్వాత హోం గ్రౌండ్ లో పంజాబ్ కింగ్స్ పై విజయాన్ని అందుకున్న సన్రైజర్స్ హైదరాబాద్.. ఐపీఎల్ లో ఐదు సార్లు ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ తో నేడు తలపడబోతోంది. ఈ సీజన్ లో ఆడిన తొలి మ్యాచ్ లోనే సంచలన బాదుడుతో ప్రకంపనలు సృష్టించిన హైదరాబాద్ జట్టు.. ఆ తర్వాత వరుసగా నాలుగు మ్యాచ్లలో ఓడి, గత పోరులో పంజాబ్ కింగ్స్ పై భారీ స్కోరును చేదించి తిరిగి గెలుపు బాట పట్టింది.
గత ఐదు మ్యాచ్లలో విఫలమైన ఓపెనర్ అభిషేక్ శర్మ.. విధ్వంసకర సెంచరీ తో ఫామ్ లోకి వచ్చాడు. ట్రావీస్ హెడ్ సైతం ఆఫ్ సెంచరీ తో టచ్ లోకి వచ్చేసాడు. ఈ సీజన్ లో మరోసారి బ్యాటింగ్ బలాన్ని నమ్ముకుని బరిలోకి దిగుతుంది హైదరాబాద్. మరోవైపు ఈ సీజన్ లో ముంబై ఇండియన్స్ పరిస్థితి కూడా అంత మెరుగ్గా లేదు. ఇప్పటివరకు ముంబై ఆడిన ఆరు మ్యాచ్లలో రెండు విజయాలు, నాలుగు ఓటములతో నాలుగు పాయింట్లు మాత్రమే సాధించింది.
ఇక గత మ్యాచ్ లో దూకుడు మీద ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ ని కట్టడి చేయడంతో.. ముంబై తిరిగి ఆత్మవిశ్వాసం కూడగట్టుకుంది. మరోవైపు ఈ మ్యాచ్ కి సంబంధించి హైదరాబాద్ తుది జట్టులో పలుమార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి. స్టార్ స్పిన్నర్ ఆడమ్ జంప గాయంతో ఈ సీజన్ మొత్తానికి దూరం కావడంతో.. అతడి స్థానంలో కర్ణాటక యువ బ్యాటర్ స్మరణ్ రవిచంద్రన్ ని తీసుకుంది. వాంఖడే పిచ్ స్పిన్ కి అనుకూలంగా ఉన్న నేపథ్యంలో రాహుల్ చాహర్ ని తుది జట్టులోకి తీసుకొని అవకాశం ఉంది.
Also Read: Indian Coaching staff: బీసీసీఐ సంచలన నిర్ణయం… ఆ ఇద్దరి ఉద్యోగాలు పీకేశారు
ఈ నేపథ్యంలో ఓ పేసర్ పై వేటు పడే అవకాశం ఉంది. మరోవైపు మహమ్మద్ షమీ పేలవ ఫామ్ జట్టును కలవరపడుతుంది. ఇక అభిషేక్ శర్మ తిరిగి ఫామ్ లోకి రావడం శుభ పరిణామం. అలాగే హోమ్ గ్రౌండ్ లో ఈ మ్యాచ్ జరుగుతుండడం ముంబై ఇండియన్స్ కి కలిసి వచ్చే అంశం. ఇక ఈ మ్యాచ్ గురించి ఇప్పటికే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున మీమ్స్ వైరల్ గా మారాయి. ముంబై ఇండియన్స్ నీ ట్రోల్ చేస్తూ సోషల్ మీడియాలో రచ్చ రేపుతున్నారు హైదరాబాద్ అభిమానులు. మహేష్ బాబు నటించిన బిజినెస్మేన్ సినిమాలోని డైలాగ్స్ ని వాడుతూ ముంబై ఇండియన్స్ ని ట్రోల్ చేస్తున్నారు. ఈ మీమ్స్ చూసిన హైదరాబాద్ అభిమానులు తెగ నవ్వుకుంటున్నారు. అయితే కొంతమంది మాత్రం ఇలాంటివి గెలిచిన తర్వాత చేస్తే బెటర్ అని అభిప్రాయపడుతున్నారు.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">